శివకేశవ్‌లు రెడీ అవుతున్నారు
శివకేశవ్‌లు రెడీ అవుతున్నారు
Published Thu, Oct 3 2013 1:33 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
శ్రీహరి, జయంత్ హీరోలుగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘శివకేశవ్’. ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో బానూరు నాగరాజు (జడ్చర్ల) నిర్మించారు. సంజన, శ్వేతాబసుప్రసాద్, గుర్లిన్ చోప్రా కథానాయికలు. ఇటీవలే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి.
సెన్సార్‌కి సిద్ధమైన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బానూరు నాగరాజు మాట్లాడుతూ -‘‘ఓ కొత్త కోణంలో ఉండే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. శ్రీవసంత్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. శ్రీహరి నటన, పోరాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నటుడు భానుచందర్ తనయుడు జయంత్ అద్భుతంగా నటించాడు.
దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించాడు. మా సంస్థకు శుభారంభాన్నిచ్చే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బానూరు శ్రావణి-సాయినాధ్, సహనిర్మాత: బానూరు మాలతి.
Advertisement
Advertisement