డిస్కో శాంతి 1980లో వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఐటం సాంగ్స్‌తో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అసలు పేరు శాంత కుమారిగా కాగా.. సినిమాల్లో నటనతో డిస్కో శాంతిగా ముద్రపడిపోయింది. ఆగస్టు 28, 1965న జన్మించిన డిస్కో శాంతి పలు భాషలలో దాదాపు 900కి పైగా చిత్రాలలో కనిపించింది. ఆమె ఎక్కువగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఒడియా భాషల్లో నటించారు. మలయాళంలో ఉమై విజిలీ సినిమాలో ఆమె చేసిన డ్యాన్స్‌తో పాపులర్ అయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
1986లో తొలిసారి ఉదయగీతం చిత్రంలో నటించారు. మొదట కొన్ని సినిమాల్లో సహాయ నటిగా నటించింది. అదే సమయంలో ఐటెం సాంగ్స్‌లో నర్తించే అవకాశం వచ్చింది. దాదాపు 11 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో ఉన్నారు. అతని తండ్రి సీఎల్ ఆనందన్ సినిమాల్లో కూడా నటించాడు. తమిళం, తెలుగు సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించారు.
శ్రీహరితో ప్రేమ పెళ్లి
అయితే టాలీవుడ్ హీరో శ్రీహరిని 1996లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత కుటుంబాన్ని చూసుకోవడానికే ఆమె పరిమితయ్యారు. సినిమాలకు గుడ్ బై చెప్పారు. అయితే ఆమె భర్త అక్టోబరు 9, 2013న కాలేయ సంబంధ వ్యాధితో ముంబైలో కన్నుమూశారు. ఇటీవలే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
శ్రీహరి మరణం తట్టుకోలేక..
డిస్కో శాంతి మాట్లాడుతూ.. 'బావ (శ్రీహరి) చనిపోయాక నేను మద్యానికి బానిసయ్యా. జరిగిన విషాదాన్ని మరచిపోవాలని చాలా ప్రయత్నించా. ఆయన చనిపోయిన మూడు నెలల తర్వాత ధైర్యం తెచ్చుకున్నా. ఆ సమయంలో నా సోదరులు, కుటుంబ సభ్యులు మూడు నెలలకు పైగా నాతోనే ఉన్నారు. కానీ పిల్లల చదువుల కారణంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత నా కుమారులు నాకు మద్దతుగా నిలిచారు.' అని శాంతి చెప్పింది.
శ్రీహరి, డిస్కో శాంతిలది ప్రేమ వివాహం కాగా.. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలు పోషించిన శ్రీహరి, శాంతి డాన్స్ చూసి ప్రేమలో పడ్డారు. ఆమె కుటుంబం గురించి తెలుసుకుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శ్రీహరి మరణించే వరకు టాలీవుడ్‌లో కలిసి మెలిసి ఉన్న జంటలలో ఒకరిగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment