Disco Shanti
-
మా తండ్రి మళ్ళీ పుడతాడు అంటున్న కొడుకు
-
ఆ పని చేసినందుకు బావకి సారీ చెప్పాలి
-
డబ్బుల కోసం పంపించాను వాళ్ళ తమ్ముళ్ళను: డిస్కో శాంతి
-
తను గుర్తుకు వస్తే నాకు కన్నీళ్లు ఆగవు అంటున్న డిస్కో శాంతి
-
నాకు అన్నయ్య చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం
-
నన్ను ప్రతి రోజు ప్రేమిస్తాడు మా బావ..!
-
శ్రీహరి ఫామ్ హౌస్ చూశారా ..?
-
డబ్బు విలువ నాకు బాగా తెలుసు...అంతా నా మంచికే..!
-
శ్రీహరి మరణంతో మద్యానికి బానిసయ్యా: డిస్కో శాంతి
డిస్కో శాంతి 1980లో వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఐటం సాంగ్స్‌తో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అసలు పేరు శాంత కుమారిగా కాగా.. సినిమాల్లో నటనతో డిస్కో శాంతిగా ముద్రపడిపోయింది. ఆగస్టు 28, 1965న జన్మించిన డిస్కో శాంతి పలు భాషలలో దాదాపు 900కి పైగా చిత్రాలలో కనిపించింది. ఆమె ఎక్కువగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఒడియా భాషల్లో నటించారు. మలయాళంలో ఉమై విజిలీ సినిమాలో ఆమె చేసిన డ్యాన్స్‌తో పాపులర్ అయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. 1986లో తొలిసారి ఉదయగీతం చిత్రంలో నటించారు. మొదట కొన్ని సినిమాల్లో సహాయ నటిగా నటించింది. అదే సమయంలో ఐటెం సాంగ్స్‌లో నర్తించే అవకాశం వచ్చింది. దాదాపు 11 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో ఉన్నారు. అతని తండ్రి సీఎల్ ఆనందన్ సినిమాల్లో కూడా నటించాడు. తమిళం, తెలుగు సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించారు. శ్రీహరితో ప్రేమ పెళ్లి అయితే టాలీవుడ్ హీరో శ్రీహరిని 1996లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత కుటుంబాన్ని చూసుకోవడానికే ఆమె పరిమితయ్యారు. సినిమాలకు గుడ్ బై చెప్పారు. అయితే ఆమె భర్త అక్టోబరు 9, 2013న కాలేయ సంబంధ వ్యాధితో ముంబైలో కన్నుమూశారు. ఇటీవలే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శ్రీహరి మరణం తట్టుకోలేక.. డిస్కో శాంతి మాట్లాడుతూ.. 'బావ (శ్రీహరి) చనిపోయాక నేను మద్యానికి బానిసయ్యా. జరిగిన విషాదాన్ని మరచిపోవాలని చాలా ప్రయత్నించా. ఆయన చనిపోయిన మూడు నెలల తర్వాత ధైర్యం తెచ్చుకున్నా. ఆ సమయంలో నా సోదరులు, కుటుంబ సభ్యులు మూడు నెలలకు పైగా నాతోనే ఉన్నారు. కానీ పిల్లల చదువుల కారణంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత నా కుమారులు నాకు మద్దతుగా నిలిచారు.' అని శాంతి చెప్పింది. శ్రీహరి, డిస్కో శాంతిలది ప్రేమ వివాహం కాగా.. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలు పోషించిన శ్రీహరి, శాంతి డాన్స్ చూసి ప్రేమలో పడ్డారు. ఆమె కుటుంబం గురించి తెలుసుకుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శ్రీహరి మరణించే వరకు టాలీవుడ్లో కలిసి మెలిసి ఉన్న జంటలలో ఒకరిగా నిలిచారు. -
శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది.. ప్రస్తుతం మా పరిస్థితి ఇదే: డిస్కో శాంతి
శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీహరి తన బాల్యంలోనే కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి వలస వచ్చారు. అక్కడే అతని పాఠశాల విద్యను పూర్తిచేసుకున్నారు. యలమర్రులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిలు షాపు, సోడాలు అమ్మి అక్కడే జీవనం సాగించారు. అక్కడి నుంచి ఆయన సినిమాలపై మక్కువతో అరెకరం భూమి అమ్మి హైదరాబాద్ వచ్చారు. సినీ ఇండస్ట్రీలో శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి అని పేరు ఉంది. డిస్కో శాంతిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013న కాలేయ సంబంధ వ్యాధివలన ముంబై లో కన్నుమూశారు. రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు శ్రీహరి మరణం జరిగిన సమయంలో ఏం జరిగిందో తాజాగ ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి తెలిపింది. సినిమా షూటింగ్ మధ్యలో అనారోగ్యానికి గురైన శ్రీహరిని ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో జాయిన్ చేసి ఐసీయూలో పెట్టారని ఆమె ఇలా చెప్పింది. 'శ్రీహరి చనిపోయే కొన్ని గంటల ముందు వైద్యులు చెకప్‌కు వచ్చారు. ఆ సమయంలో నన్ను బయటకు పంపించారు. అప్పుడు వాళ్లు కొన్ని మందులతో పాటు ఇంజక్షన్స్ సూచించారు. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ ) కొంత సమయం తర్వాత ఒక నర్సు వచ్చి ఆ ఇంజక్షన్ వేసింది. కొన్ని నిమిషాల్లోనే శ్రీహరి కళ్లు,ముక్కు,చెవులు నుంచి మొత్తం బ్లడ్ వచ్చింది. నాకు హిందీ రాదు.. వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వాళ్లు బ్లడ్ మొత్తం క్లీన్ చేసి ఆయన్ను మరోగదిలోకి తీసుకుపోయారు. నేను ఎంత మొత్తుకున్నా శ్రీహరి దగ్గరకు కూడా పోనియలేదు.. వంద శాతం ఆ డాక్టర్లు రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇదే హైదరాబాద్‌లో అయింటే ఆయన ఖచ్చితంగా బతికేవాడు.' అని ఆమె తెలిపింది. ఆస్పత్రిలో ఠాగూర్ సినిమా చూపించారు శ్రీహరి చాలా గంటల ముందే చనిపోయినా తమకు ఆస్పత్రి సిబ్బంది చెప్పలేదని డిస్కో శాంతి పేర్కొన్నారు. వైద్యం అందిస్తున్నామని చాలా డబ్బు కట్టించుకున్నారని తెలిపింది. వాళ్లు చేసిన పని తలచుకుంటే చిరంజీవి ఠాగూర్ సినిమానే గుర్తుకొస్తుందని ఆమె పేర్కొంది. ఆస్పత్రి మీద కేసు వేయమని చాలామంది సలహాలిచ్చారు. ఆయన చనిపోతేనే మన అనుకునే వాళ్లు ఎవరూ రాలేదు. మళ్లీ ఈ కేసుల విషయంలో పిల్లలను పట్టుకుని తాను తిరగలేనని భావించి విరమించుకున్నానని శాంతి ఎమోషనల్ అయింది. చాలా మంది మోసం చేశారు శ్రీహరి మరణం తర్వాత సినీ పరిశ్రమ, స్నేహితులు ఏ ఒక్కరూ తమ ఇంటికి రాలేదని శాంతి తెలిపింది. కనీసం తాము ఉన్నామో లేమో కూడా వాళ్లకు తెలియదని గుర్తుచేసుకుంది. శ్రీహరి గతంలో ఎవరికి డబ్బు ఇచ్చారు. ఎవరిదగ్గర దాచారు అనేది తెలియదు. కానీ కొంతమంది ఆర్థిక విషయాల్లో తమను మోసం చేశారని శాంతి వాపోయింది. చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు.. తాళి తప్పా నగలన్నీ తాకట్టలో శ్రీహరి మరణం తర్వాత ఒక్కసారిగా తమకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని శాంతి గుర్తుచేసుకుంది. శ్రీహరి లేరనే బాధ ఒకవైపు ఉండగానే కొంతమంది మోసం వల్ల డబ్బు కోల్పోయాను.. అదే డబ్బు ఉండిఉంటే తన కుమారుడు చదవుకునేందుకు ఫారిన్ వెళ్లేవాడని శాంతి తెలిపింది. తమకు రావాల్సిన డబ్బు అయితే తిరిగిరాలేదు కానీ తాము తీసుకున్న అప్పువాళ్లు మాత్రం ఇంటికి వచ్చారని చెప్పింది. అప్పుడు చేసేదిమి లేకపోవడంతో తమ వద్ద ఉన్న కార్లు, భూమి, బంగారం అన్నీ అమ్మేసి బాకీలు కట్టేశానని శాంతి తెలిపింది. (ఇదీ చదవండి: 'జైలర్' చూసి రజనీకాంత్ ఎలాంటి కామెంట్ చేశారంటే: నెల్సన్) చివరకు ఎంతో ఇష్టంగా కొనుకున్న ఒక కారు ఈఎంఐ కూడా కట్టలేకపోతే బ్యాంకు వారు తీసుకుపోయారని చెప్పింది. తాళి మాత్రమే ఉంచుకుని మిగిలిన బంగారాన్ని మొత్తం కోల్పోయానని శాంతి గుర్తుచేసుకుంది. ప్రస్తుతం జీవనోపాధికి తమ రెండు ఇళ్ల నుంచి అద్దె వస్తుందని తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం తాము ఉంటున్న ఇళ్లు నుంచి కొంత భాగం రోడ్డు డివైడింగ్ కోసం పోయింది. అందుకు సంబంధించి వచ్చిన డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేశామని శాంతి తెలిపింది. సినీ ఇండస్ట్రీ నుంచి ఏమైనా మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని శాంతి పేర్కొంది. డిస్కో శాంతికి పేరు తెచ్చిన పాట 'బంగారు కోడిపెట్ట' ( ఘరానామొగుడు) -
రియల్ స్టార్ శ్రీహరి నెరవేరని కలలేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: రియల్ స్టార్, విలక్షణతకు పెట్టింది పేరైన శ్రీహరి. తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించిన నటుడుశ్రీహరి. మంచి మనిషిగా కూడా అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి పోయాడు. పేదరికం, ఆకలి బాధ తెలిసిన వ్యక్తిగా తన సాయం కోసం వచ్చిన వారిని కాదనకుండా ఆదుకున్న ఆప్తుడుగా నిలిచాడు. కరియర్ సాఫీగా పోతున్న తరుణంగా తీవ్ర అనారోగ్యంతో 2013, అక్టోబరు 9న కన్నుమూయడంతో అటు శ్రీహరి కుటుంబం, ఇటు రియల్ స్టార్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. 1964 ఆగస్టు 15న శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు శ్రీహరి. యుక్తవయసు నుండే శారీరక ధారుడ్యంపై ఆసక్తినిపెంచుకున్న శ్రీహరి అనేక పోటీల్లో పాల్లొనడంతో పాటు ‘మిస్టర్ హైదరాబాద్’గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. రెండుసార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొని, బహుమతులు గెలుచు కున్నాడు. జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర చాంపియన్ అయిన శ్రీహరి మంచి అథ్లెట్ అవ్వాలనుకున్నారట. ఈ క్రమంలో జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా నటనపై మక్కువ సినిమాలవైపు నడిపించింది. దీంతో ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా తీరలేదట. అలాగే పాలిటిక్స్ అన్నా కూడా చాలా అసక్తి ఉండేది. కచ్చితంగా రాజకీయాల్లోకి ఎంటర్ కావాలనీ, తద్వారా నలుగురికీ సహాయం చేయాలని ఆయన అనుకునేవారట.(అప్పుడు ఎంత అంటే అంత!) 1986లో స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి ఆ తరువాత నటుడుగా తన కరియర్‌కు బలమైన పునాదులు వేసుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ప్రత్యేక డైలాగ్ డెలివరీతో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. హీరోగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. దాదాపు 900 చిత్రాల్లో నటించి రియల్ స్టార్‌గా ఖ్యాతి గడించారు. పృధ్వీపుత్రుడు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆయన గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు ఇలా దాదాపు 28 చిత్రాల్లో హీరోగా చిత్రాల్లో రాణించారు. వీటితోపాటు బావగారు బావున్నారా, వీడెవండిబాబూ, తాజ్ మహల్, ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం సినిమాల్లో ఆయన నటన తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో చెల్లెలి కోసం ఆరాటపడే అన్నగా తన నటనతో నూటికి నూరుశాతం మార్కులు కొట్టేశారు. రాంచరణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ డూపర్ మగధీరలో షేర్ ఖాన్ పాత్ర, ఆయన కరియర్ గొప్ప మైలురాయి లాంటిది. ఒక విధంగా ఈ సినిమాకు ఆయన నటన పెద్ద హైలెట్. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అదే ఏడాదికి ఇదే చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. నటి డిస్కో శాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు శ్రీహరి. వీరికి ఇద్దరు కుమారులు శశాంక్, మేఘాంశ్ ఉన్నారు. హీరోగా రాణించానేది మేఘాంశ ఆకాంక్ష. అయితే నాలుగు నెలల కుమార్తె అక్షర అకాల మరణం శ్రీహరిని మానసికంగా కృంగదీసింది. అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి, మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని, అక్కడ అభివృద్ధికి కృషి చేయడం విశేషంగా నిలిచింది. కాగా ప్రభుదేవా దర్శకత్వంలో రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లిన శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కన్నుమూసారు. -
శ్రీహరి కోటలో సత్తి
-
అప్పుడు ఎంత అంటే అంత!
శశాంక్.. మేఘాంశ్.. ‘రియల్ స్టార్’గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన శ్రీహరి కుమారులు. ‘రాజ్‌దూత్’ చిత్రం ద్వారా మేఘాంశ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. శశాంక్‌కి డైరెక్టర్ అవ్వాలనే ఆశయం ఉంది. ఈ ఇద్దరూ తమ తండ్రి శ్రీహరి గురించి పంచుకున్న విశేషాలు. ► హీరోగా పరిచయమవుతున్న ఈ సమయంలో నాన్న పక్కన ఉంటే అనే ఫీలింగ్ రాక మానదు.. మేఘాంశ్: కచ్చితంగా. నాన్న ఉండి ఉంటే పక్కనే ఉండి నడిపించేవారు. ఒక భరోసా ఉండేది. అది మిస్సవుతున్నాం. సినిమా కమిట్ అయ్యే ముందు ఆర్టిస్ట్‌గా నాన్నకు వచ్చిన దాంట్లో ఓ 5 శాతం వచ్చినా చాలు అనుకున్నాను. నాన్న పేరు చెడగొట్టకూడదు అనే బాధ్యతతో చేశాను. ► నాన్న ఉన్నప్పుడే హీరో అవ్వాలనే టాపిక్ మీ మధ్య వచ్చిందా? మేఘాంశ్: మేం ఇద్దరం సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలనుకున్నారు. కానీ హీరోనా? డైరెక్టర్‌గానా? అనే డిస్కషన్ అయితే ఎప్పుడూ రాలేదు. అప్పుడు చిన్నపిల్లలం కదా. ► మీ నాన్నగారు ఫిట్‌గా ఉండేవారు. మీరు కూడా అదే అలవర్చుకున్నట్టున్నారు? మేఘాంశ్: ఆయన్ను చూసే జిమ్ చేయడం స్టార్ట్ చేశాం. నాన్నకి ఫిట్‌గా ఉండటం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మాకది ఇన్స్పైరింగ్గా ఉండేది. మా జిమ్‌లో నాన్న ఫొటోలు ఉంటాయి. జిమ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆ ఫొటోలు చూస్తుంటాం. ► శ్రీహరిగారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు.. మేఘాంశ్: అందరికీ హెల్ప్ చేయడం. శశాంక్: హంబుల్‌గా ఉండటం. మేఘాంశ్: హంబుల్‌గా ఉంటూనే రాయల్‌గా ఉండటం. ► ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకునేవారా? ఏదైనా గిఫ్ట్ ఇచ్చేవారా? ఇద్దరూ: ఆయన ఉన్నప్పుడు ప్రతిరోజూ మాకు సెలబ్రేషనే. శశాంక్: ఓ రోజు ఆమ్లెట్ చేసి ఇచ్చా. మస్త్ ఉంది అన్నారు. మేఘాంశ్: నేను నాన్నతో చాలా క్లోజ్‌గా ఉండేవాడిని. శశాంక్: వీడు డాడీ పెట్. ► నాన్న వెళ్లిపోయిన తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటి? శశాంక్: లైఫ్‌స్టైల్ మారిపోయింది. అప్పుడు బాధ్యతలు లేవు. ఇలా అంటే (చిటికేస్తూ) అన్నీ వచ్చేసేవి. ఇప్పుడు కొంచెం చూసి ఖర్చు పెడుతున్నాం. ఫైనాన్షియల్‌గా చాలా రెస్పాన్సిబుల్ అయిపోయాం. ► స్కూల్‌కి వెళ్లను అన్నప్పుడు నాన్న కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మేఘాంశ్: మమ్మీ కొట్టేది. కానీ డాడీ ఎప్పుడూ కొట్టలేదు. స్కూల్ బంక్ కొడితే డాడీ దగ్గరకు వెళ్లిపోయేవాళ్లం. ► డాడీ ఏ విషయంలోనూ కోప్పడలేదా? మేఘాంశ్: ఎప్పుడూ లేదు. శశాంక్: ఒకే ఒక్కసారి నన్ను కోప్పడ్డారు. ఆయన్ను చూడటానికి ఫ్యాన్స్ వచ్చారు. నేను పటాసులు కాలుస్తున్నాను. గేట్ దగ్గర రాకెట్ పేలిస్తే ఓ అభిమాని మీదకు వెళ్లింది. అప్పుడు కోప్పడ్డారు. ఇంకోసారి కార్ విండోలో నుంచి మేఘాంశ్ చేయి బయటపెడితే అద్దం పైకి ఎత్తేశా. అప్పుడు తిట్టారు. ► బిజీ ఆర్టిస్ట్ అయినా మీతో టైమ్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవారా? ఇద్దరూ: రోజూ కలసి భోజనం చేసేవాళ్లం. అప్పుడు మమ్మీ మా అల్లరి గురించి చెబుతుండేది. వాళ్ల గురించి ఇప్పుడెందుకు? హ్యాపీగా తిననివ్వు అని మమ్మీనే తిట్టేవాళ్లు. మాకు ఒక్క తిట్టు కూడా పడేది కాదు. ► మీ ప్రోగ్రెస్ కార్డ్ ఎవరు సైన్ చేసేవాళ్లు? మేఘాంశ్: మమ్మీనే. అప్పుడప్పుడు పాస్ అయ్యేవాణ్ణి, అప్పుడప్పుడు ఫెయిల్ అయ్యేవాణ్ణి. శశాంక్: కానీ వాడి తిట్లన్నీ నాకు పడేవి. ఎందుకంటే ముందు నా ప్రోగ్రెస్ కార్డ్ చూసి నన్ను తిట్టేది. మళ్లీ వాడిని ఏం తిడతాంలే అనుకునేదేమో. నన్ను తిడుతూనే ఉండేది. ► మీ ఇద్దర్లో టామ్ ఎవరు? జెర్రీ ఎవరు? మేఘాంశ్: వాడే. (శశాంక్ని చూపిస్తూ) వాడు కొట్టేటోడు.. నేను పడేటోడ్ని. (నవ్వుతూ ) ► మీ తమ్ముడు హీరో అవుతున్నాడు కదా. ఏమనిపిస్తుంది? మేఘాంశ్: మంచిగా చెప్పురా ప్లీజ్. శశాంక్: అలా చెప్పాలనే ఆలోచిస్తున్నా. ఫస్ట్ నాకు నవ్వొచ్చింది. బచ్చాగాడు హీరో అయిపోయాడు అనుకున్నాను. అయితే నేను చెప్పేదొక్కటే. హిట్ అయినా ఫట్ అయినా హంబుల్‌గా ఉండాలి. ► మీ నాన్నగారు ఉన్నప్పుడు ఓసారి పదివేలకు చాక్లెట్లు కొన్నారట? శశాంక్: నాన్నగారి కార్డ్ తీసుకెళ్లాడు. అక్కడున్న చాక్లెట్లు అన్నీ కొన్నాడు. రేయ్.. మేఘాంశ్ పదివేలు అయిందీ అంటే ఓ చాక్లెట్ పక్కన పెట్టి ఇప్పుడు 9 వేలే కదా తీసుకో అన్నాడు (నవ్వుతూ). మేఘాంశ్: మాకు రిస్ట్రిక్షన్స్ ఉండేవి కావు. పాకెట్‌మనీ ఇచ్చేవాళ్లు కాదు. ఎవరికైనా డబ్బులిచ్చి మాతో పాటు పంపేవాళ్లు. మేం కొనుక్కునేవాళ్లం. అప్పుడు ఎంత అంటే అంత. ఇప్పుడు ఎంత అవసరం ఉంటే అంత. ► యాక్టర్ అవుతున్నారు. హోమ్ వర్క్ కోసం నాన్న సినిమాలేమైనా చూశారా? మేఘాంశ్: అలా ఏం చూడలేదు. అయితే నాన్నని చూడటం కోసమే ఆయన సినిమాలు చూస్తుంటాను. ► మీ నాన్నగారికి తీరని కోరిక ఏదైనా మిగిలిపోయిందా? శశాంక్: పాలిటిక్స్. ఇంకో సంవత్సరం ఉండి ఉంటే కచ్చితంగా పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యేవారు. ఆయనకు బాగా ఇంట్రెస్ట్. సహాయం చేయాలని అనుకుంటారు. ► మరి మీలో ఎవరికైనా ఆ ఇంట్రెస్ట్ ఉందా? మేఘాంశ్: ఇంట్రెస్ట్, నాలెడ్జ్ రెండూ లేవు. ► నాన్న యాక్ట్ చేసిన సినిమాల్లో బాగా నచ్చినవి? ఇద్దరూ: కింగ్, ఢీ, భద్రాచలం, విజయరామరాజు... ఇలా చాలా ఉన్నాయి. ► తమ్ముడు హీరో అయ్యాడు.. మరి అన్న డైరెక్టర్ ఎప్పుడు అవుతాడు? శశాంక్: షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను. ఇంకా ఏమీ అనుకోలేదు. శశాంక్, మేఘాంశ్ -
నటి మేనకోడలు ఆచూకీ దొరికింది!
డిస్కోశాంతి సోదరుడి కుమార్తె క్షేమం సాక్షి, పెరంబూరు (చెన్నై): నటి డిస్కోశాంతి సోదరుడి కూతురు క్షేమంగా ఉన్నట్టు సమాచారం. పలు భాషా చిత్రాల్లో నటించి ప్రాచుర్యం పొందిన డిస్కోశాంతికి సోదరి లలితాకుమారి, సోదరుడు అరుణ్ ఉన్నారు. లలితా కుమారి నటుడు ప్రకాశ్‌రాజ్ మాజీ భార్య అన్న విషయం తెలిసిందే. కాగా వీరి సోదరుడు అరుణ్ సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. అరుణ్, సెర్లీ దంపతుల పెద్ద కుమార్తె అప్రినా ప్లస్ టూ చదువుతోంది. ఈ అమ్మాయి గత 8వ తేదీన పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు టీ.నగర్, పాండిబజార్లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, మీడియాను ఆశ్రయించారు. దీంతో పోలీసులు అప్రినా ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నా, మరో వైపు ఆమె కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ప్రకాశ్‌రాజ్ తన ట్విట్టర్లో అప్రినా ఆచూకీ లభించిందని, క్షేమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ విషయమై డిస్కోశాంతి సోదరి లలితాకుమారి కుటుంబ సభ్యులను సంప్రదించగా అప్రినా ఆచూకీ తెలిసిందని త్వరలోనే తను ఇంటికి రానున్నట్టు తెలిపారు. అప్రినా ఎక్కడికి వెళ్లింది. ఇన్ని రోజులు ఎక్కడ ఉంది లాంటి వివరాలను చెప్పడానికి వారు నిరాకరించారు. -
శ్రీహరి ప్రథమ వర్ధంతి
-
మా బావకు నేను చేస్తున్న ఆఖరి పెద్ద ఉత్సవమిది : శాంతి
‘‘పిల్లలు కూడా సినిమాల్లోనే స్థిరపడాలని కోరుకునేవారు బావ. నాకు మాత్రం వాళ్లు బాగా చదువుకుని మంచి స్థానాల్లో స్థిరపడాలని ఉండేది. అయితే... పిల్లలు వాళ్ల నాన్న వైపే మొగ్గు చూపారు. వాళ్లు కూడా సినిమాల్లోనే స్థిరపడాలనుకుంటున్నారు. మా బావకు నేను చేస్తున్న ఆఖరి పెద్ద ఉత్సవం ఇది. ఇక నుంచి అంతా మా పిల్లలు చూసుకుంటారు. ఎప్పటిలాగే ఇక నుంచి కూడా అభిమానులతో, శ్రేయోభిలాషులతో సత్సంబంధాలను కొనసాగిస్తాం’’ అని శాంతి శ్రీహరి అన్నారు. గురువారం నటుడు శ్రీహరి ప్రథమ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని శ్రీహరి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతి శ్రీహరి మాట్లాడారు. తాను దర్శకునిగా మారతానని, తమ్ముడు హీరోగా నిలబడతాడని, ఇద్దరం కలిసి సేవాకార్యక్రమాలను కొనసాగిస్తామని శ్రీహరి పెద్ద కుమారుడు శశాంక్ నమ్మకం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సి. కల్యాణ్, దర్శకులు వీరశంకర్, దేవి ప్రసాద్, బాబీ, జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
అప్పా పేరు నిలబెడతాం..!
అది.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నం. 45. ఆ దారిలో వెళ్లే ప్రతి ఒక్కరి చూపూ ఒక ఇంటిపై పడకుండా ఉండదు. అది నటుడు ‘శ్రీహరి’ ఇల్లు అని అందరికీ తెలుసు. ఎనిమిది నెలల క్రితం ఆ ఇంటి సందడి వేరు. ఎప్పుడూ వచ్చేపోయేవాళ్లతో కళకళలాడుతుండేది. ఇప్పుడా కళ లేదు. లంకంత ఆ ఇంట్లో తన ఇద్దరు కొడుకులు శశాంక్, మేఘాంశ్‌లతో మాత్రమే ఉంటున్నారు శాంతీ శ్రీహరి. ఆమెలో పూర్వపు ఉత్సాహం కానీ.. కళ కానీ లేదు. చాలా చిక్కిపోయారు. జీవితంలో హఠాత్తుగా వచ్చిన మార్పుని ఆహ్వానించడానికి ఆమె ఇంకా అలవాటుపడలేదనిపించింది. మరి.. పిల్లల సంగతేంటి...? ఇంతలో శశాంక్, మేఘాంశ్ వచ్చారు. చూడచక్కగా ఉన్నారు. ఇద్దరూ ‘హీరో మెటీరియల్’ అనిపించింది. ఏం చదువుతున్నారని అడిగితే... ఇంటర్ సెకండ్ ఇయర్ అని శశాంక్, టెన్త్ అని మేఘాంశ్ చెప్పారు. దర్శకుడు కావాలన్నది శశాంక్ ఆశయమైతే, హీరో కావాలన్నది మేఘాంశ్ లక్ష్యం. మరి.. వారి ఆశయాల గురించి శ్రీహరికి తెలుసా? ‘‘దర్శకత్వం సులువు కాదనీ, శ్రద్ధపెట్టి చేయాలనీ అప్పా (తమిళంలో నాన్న అని అర్థం) అన్నారు. నేను రెండు షార్ట్ ఫిలిమ్స్ తీసి, యూ ట్యూబ్‌లో పెట్టాను. అవి చూసి అందరూ మెచ్చుకున్నారు’’ అని శశాంక్ చెప్పాడు. ‘‘నాన్న నటించిన ‘భైరవ’లో చేశాను. ‘పెద్దయిన తర్వాత హీరో అవుతా’నంటే, శరీరం ఫిట్‌గా ఉండాలనీ, అంకితభావం అవసరమనీ అప్పా చెప్పారు’’ అని మేఘాంశ్ అన్నాడు. అప్పా లేని లోటు మాటేమిటి? ‘‘మనకేంటిలే.. అప్పా ఉన్నారు.. అన్నీ చూసుకుంటారనే ధైర్యం ఉండేది. ఇప్పుడు మాత్రం అభద్రతాభావం ఉంది’’ అన్నారు అన్నదమ్ములిద్దరూ. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. భర్త చనిపోయిన తర్వాత ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కొడుక్కి అప్పజెప్పేశారు శాంతి. పదిహేడేళ్ల వయసులో ఇంటి బాధ్యతా? ‘‘అప్పా ఉన్నంతవరకూ ఏమైనా కావాలంటే, క్రెడిట్ కార్డ్ ఇచ్చి.. కొనుక్కోమనేవారు. అవసరమైనవి ఎంత ఖరీదు అయినా కొనుక్కోమనేవారు. అనవసరమైన వాటికి ఖర్చు చేయొద్దనేవారు. తమ్ముడికి చాక్లెట్లంటే చాలా ఇష్టం. ఒకసారి అప్పా క్రెడిట్ కార్డ్ తీసుకెళ్లి, పదివేల రూపాయలకు చాక్లెట్లు కొనుక్కుని, ఫ్రిజ్‌లో దాచుకుని తిన్నాడు. నేనైతే నెలకో వాచ్ కొనుక్కునేవాణ్ణి. అది కూడా చాలా ఖరీదుగలది. ఇప్పుడు నేను వాచ్‌లు కొనడం మానేశాను. తమ్ముడు కూడా పెద్దగా చాక్లెట్లు కొనుక్కోవడం లేదు. ఇంటికి కావాల్సినవి కొంటుంటే, ‘ఇంత ఖర్చా?’ అనిపించింది. ఆదాయం కూడా లేదు కాబట్టి, అప్పా ఉన్నప్పటిలా విచ్చలవిడిగా ఖర్చుపెట్టకూడదనుకుంటున్నాను’’ అని వచ్చిపడ్డ పెద్దరికం నేర్పిన బాధ్యతతో శశాంక్ అన్నాడు. ‘‘నేనూ, అన్నయ్య బాగా అల్లరి చేసేవాళ్లం. చిన్న చిన్న గొడవలకే కొట్టేసుకునేవాళ్లం. అవుట్డోర్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు, నాన్న ఫోన్ చేసి ‘తమ్ముణ్ణి కొట్టొద్దురా..’ అని అన్నయ్యకు ప్రత్యేకంగా చెప్పేవారు’’ అంటున్నప్పుడు, నాన్న లేని బాధ మేఘాంశ్ కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. చనిపోయేవరకూ బిజీగా సినిమాలు చేశారు శ్రీహరి. ఎంత బిజీగా ఉన్నా కుటుంబాన్ని విస్మరించలేదాయన. షూటింగ్ నుంచి ఇంటికి రాగానే భార్యాపిల్లలతో గడిపేవారు. ‘‘దాదాపు మూడు నాలుగు గంటలు లాన్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఎంత కష్టపడి పైకొచ్చిందీ అప్పా చెప్పేవారు’’ అని మేఘాంశ్ అన్నాడు. అది మాత్రమే కాదు.. దాదాపు రోజూ బ్రేక్‌ఫాస్ట్‌కు మినర్వా కాఫీ షాప్‌కి వెళ్లేవాళ్లమని అన్నాడు శశాంక్. మరి.. ఇప్పుడూ? ‘‘అప్పా చనిపోయిన ఈ ఎనిమిది నెలల్లో ఈ మధ్యే అమ్మ ఒకసారి తీసుకెళ్లింది’’ అన్నాడు మేఘాంశ్. భార్య శాంతి అంటే శ్రీహరికి ప్రాణం. పిల్లలు అల్లరి చేసినప్పుడు, ఆమె కోప్పడితే ‘పిల్లలు చేయకపోతే పెద్దాళ్లు అల్లరి చేస్తారా’ అని భార్యను మందలించేవారు కానీ.. పిల్లలను ఏమీ అనేవారు కాదట. ‘‘కానీ, ‘అమ్మ తిట్టింది.. అప్పా’ అని కంప్లయింట్ చేసినప్పుడు మాత్రం ‘మీ మంచికే తిట్టి ఉంటుంది. మీకు అమ్మ కాక ముందు తను నా భార్య. నా భార్య గురించి నాకే కంప్లయింట్ చేస్తారా’ అని అమ్మని వెనకేసుకొచ్చేవారు’’ అని మేఘాంశ్ చెప్పాడు. అసలు శ్రీహరి ఇంత హఠాత్తుగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతారని ఎవరూ ఊహించలేదు. ఆయన ముంబయ్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు.. ఇంట్లోవాళ్లకి జాగ్రత్తలు చెప్పి వెళ్లారట. చివరిసారిగా పిల్లలతో శ్రీహరి ఎప్పుడు మాట్లాడారు? ‘‘ముంబయ్ నుంచి ఫోన్ చేసి, ‘‘జిమ్ చేస్తున్న చోట అద్దం బిగించడానికి మనుషులొస్తున్నారు. దగ్గరుండి చూస్కో. తమ్ముడు మేఘాంశ్ కొట్టొద్దు’’ అన్నారని చెప్పేటప్పుడు శశాంక్ ఉద్వేగానికి గురయ్యాడు. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి కాబట్టి, పిల్లలకు తన కష్టాలు చెప్పడంతో పాటు కొన్ని సలహాలు కూడా శ్రీహరి ఇచ్చే ఉంటారు. ఆ మాటే శశాంక్, మేఘాంశ్‌లతో అంటే.. ‘‘అటు నావైపు బంధువులను కానీ, ఇటు మీ అమ్మవైపు బంధువులను కానీ, స్నేహితులను కానీ ఈజీగా నమ్మొద్దు. డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలివిగా ఉండాలి’’ అని చెప్పేవారన్నారు. నా భార్యా పిల్లలే నా ప్రపంచం అనేవారు శ్రీహరి. దాదాపు ప్రతి ఏడాదీ తన కుటుంబాన్ని విదేశాలకు తీసుకెళ్లేవారట. దాని గురించి చెబుతూ -‘‘యూఎస్, మలేసియా, సింగపూర్, దుబాయ్.. ఇలా చాలా దేశాలకు మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ ఏం అడిగినా కొనిచ్చేవారు’’ అన్నాడు మేఘాంశ్. మరి.. ఈ ఏడాది సంగతేంటి.. ఎక్కడికైనా వెళ్లారా? ‘‘ఆస్ట్రేలియా తీసుకెళ్లనా అని అమ్మ అడిగింది. కానీ, లెక్కలేసుకుని చూస్తే, బాగా ఖర్చయ్యేట్లు ఉంది. దాంతో, ఇప్పుడు అవసరమా అని మాకే అనిపించింది. నాన్న లేకుండా టూర్ వెళ్లడానికి అమ్మకి ఇష్టం లేకపోయినప్పటికీ మా కోసం అడిగింది. కానీ, మేమే వద్దన్నాం. చెన్నైలో మా పిన్ని ఇంటికెళ్లి ఓ పదిహేను రోజులు ఉండొచ్చాం’’ అని చెప్పాడు శశాంక్. ప్రతి ఏడాదీ తన పుట్టినరోజును అభిమానుల సమక్షంలో చేసుకునేవారు శ్రీహరి. పిల్లల పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరిపేవారు. మరి.. ‘ఫాదర్స్ డే’ నాడు మీరు బహుమతులిచ్చేవారా? ‘‘తప్పనిసరిగా ఇచ్చేవాళ్లం. నాన్న సింపుల్‌గానే ఉండేవారు. మాకేం కొనాలో కూడా తెలిసేది కాదు. షోరూమ్‌కి వెళ్లి, కంటికి ఏది నచ్చితే అది కొనిచ్చేవాళ్లం. అవి చూసి నవ్వుకునేవారు’’ అని పిల్లలిద్దరూ చెప్పారు. ‘‘ఈ ఫాదర్స్ డేకి మా నుంచి దూరం అవుతారని ఊహించలేదు. చాలా షాకింగ్‌గా ఉంది. మా అప్పా ఎక్కడున్నా మమ్మల్ని చూస్తూ ఉంటారని మా నమ్మకం. ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పా పేరు నిలబెడతాం. ఆయన స్థాయికి తగ్గట్టుగా స్థిరపడాలన్నదే మా లక్ష్యం’’ అన్నారు మేఘాంశ్, శశాంక్. ఏ తండ్రి అయినా పిల్లల గురించి కోరుకొనేది అదేగా! - డి.జి. భవాని మా లాన్లో జిమ్నాస్టిక్ బెడ్ ఉంది. అప్పా మాతో జిమ్నాస్టిక్స్ చేయించేవారు. ఎక్కువ సోమర్‌సాల్ట్స్ చేసేవాళ్లం. అప్పా ఉన్నప్పుడు ఎలా వర్కవుట్ చేసేవాళ్లమో ఇప్పుడూ అలానే చేస్తున్నాం. అప్పుడు సలహాలిచ్చే అప్పా లేకపోవడమే ఇప్పుడు పెద్ద లోటు. - శశాంక్ -
పిల్లలు లేకపోతే నేను కూడా బావతోపాటు...
ఆ రోజు సందర్భం వేరు. దాదాపు ఐదేళ్ల క్రితం... 2009 ఫిబ్రవరి 12.... వాలెంటైన్స్ డేకి రెండురోజుల ముందు నేను... రియల్‌హీరో శ్రీహరి ఇంటర్వ్యూ కోసం వెళ్లినప్పుడు.. ఆయనతో పాటు ఆయన భార్య శాంతి కూడా... రియల్ స్టార్లా అనిపించారు! ఈ రోజు సందర్భం వేరు. శ్రీహరి లేరు. కానీ ఆయన భార్య రియల్ లైఫ్ హీరోలా వాస్తవ జీవితంతో పోరాడుతూ కనిపించారు! ఆ రోజు సరదాగా శ్రీహరి... ‘‘నన్ను ఒక్క పూట వదలవే, కోటి రూపాయలిస్తా’’ అన్నారు. ఈ రోజు శాంతి... కోట్లు ఖర్చుపెట్టయినా బతికించుకుంటానని కన్నీళ్లతో ఎంత వేడుకున్నా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు శ్రీహరి! ఆ రోజు శాంతి... ‘శ్రీహరిని విడిచి ఒక్కపూటైనా ఉండలేను’ అన్నారు. ఈరోజు దేవుడు శాంతిని ఒంటరిని చేసి... జ్ఞాపకాలను మాత్రమే తోడుగా మిగిల్చాడు. ఆ రోజు శాంతి... ‘‘నాకు కారే అక్కర్లేదు బావా... సైకిల్ మీద తీసుకెళ్లినా నీతోపాటు వచ్చేస్తా’’ అన్నారు. ఈ రోజు... శ్రీహరితో కలిసి నడిచే భాగ్యాన్ని కూడా కోల్పోయారు. ఆ రోజు శ్రీహరి... ‘‘పెళ్లి కాకముందు పదమూడేళ్లలో... రెండు మూడు జీవితాలు చూసింది శాంతి’’ అన్నారు. ఈ రోజు శాంతి... భర్త పోయాక ఇంకెన్ని జీవితాలను చూడాల్సి వస్తుందో అనిపించింది. ఆ రోజు శాంతి... ‘‘బావ లేకుండా బతకలేను’’ అన్నారు. ఈ రోజు... బావ ఇంకా బతికే ఉన్నాడన్న భ్రాంతిలో బతుకుతున్నారు. ఎవరి జీవితంలోనైనా ఇంత వైరుధ్యం ఉంటుందా? శాంతి జీవితంలో ఉంది. చదవండి... ఈవారం ‘తారాంతరంగం’లో... - ఇందిర పరిమి, ఫీచర్స్ ఎడిటర్ ఇందిర: 9 అక్టోబర్... అసలు ఆరోజు ఏం జరిగింది? శాంతి: ప్రభుదేవా సినిమా షూటింగ్కోసమని ముంబై వెళ్లాం. ముందురోజు రాత్రి హైదరాబాద్ చేరుకోవాల్సిన వాళ్లం కానీ, ఏదో సాంగ్ సీక్వెన్స్ ఉందని ప్రభుదేవా రిక్వెస్ట్ చేయడంతో ముంబైలోనే ఉండిపోయాం. బావకి ముందురోజు కాస్త జ్వరం ఉన్నా, ఆరోజు బాగానే ఉన్నాడు. రోజూ పాలు, బ్రెడ్ తీసుకునేవాడు, ఆరోజు టీ తెప్పించమని చెప్పి, బెడ్ మీదే కూర్చుని తాగాడు. తర్వాత కాళ్లు లాగుతున్నాయని, నాతో కాళ్లు నొక్కించుకుని కాసేపు పడుకున్నాడు. ఉదయం 8.30 టైంలో అనుకుంటా... తనకిష్టమైన ఉడిపి హోటల్ నుంచి ఇష్టంగా తినే ఊతప్పం తెప్పించాను. కానీ, ‘నాకు తినాలని లేదు, నువ్వు తినెయ్’ అన్నాడు. తను తినందే ఏరోజూ ముందు తినే అలవాటు లేని నేను, ముందురోజు తినకపోవడంతో ఆకలిగా ఉందని, తిందామని కూర్చున్నాను. ఇంతలో బావ మళ్లీ పిలిచి, ఛాతీలో మంటగా ఉందన్నాడు. హోటల్ వాళ్లనడిగి, వెంటనే డాక్టర్ని పిలిపించాను. ‘పల్స్ తక్కువగా ఉంది, హాస్పిటల్‌కు తీసుకెళ్లడం మంచిది’ అన్నారు డాక్టర్. ‘బట్టలు మార్చుకుని వెళ్దాం’ అనే లోపలే బావ గబగబా బయటికెళ్లిపోయాడు. నేను కిందికి వచ్చేలోపలే తనతోపాటు ఉన్న మనుషులను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లిపోయాడు. ‘ఏంటి బావా అలా వెళ్లిపోయావు?’ అని ఫోన్ చేసి అడగ్గానే ‘కంగారేం లేదు... పక్కనే ఉన్న హాస్పిటల్‌కు వెళ్లి ఇంజక్షన్ తీసుకుని అరగంటలో వచ్చేస్తా’ అన్నాడు. కానీ నాకు కంగారు తగ్గక, ప్రతి 10 నిమిషాలకు కాల్ చేస్తూనే ఉన్నా. చివరికి బావ ‘నైట్ షూటింగ్... నిద్దర లేదు... లొల్లి చేయకుండా కాసేపు నన్ను రెస్ట్ తీసుకోనీవే’ అని విసుక్కుని ఫోన్ పెట్టేశాడు. కాసేపటి తర్వాత మళ్లీ కాల్ చేస్తే తెలిసింది... బావని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని! అది తెలియగానే నా గుండె ఆగిపోయినట్టయింది! వెంటనే బండి పంపమని చెప్పి, 10.45 కల్లా హాస్పిటల్‌కు చేరుకున్నాను. ఎమర్జన్సీ వార్డ్... బావను చూడగానే ఏడవడం మొదలెట్టాను. ‘ఏమీ లేదు, పల్స్ తక్కువ ఉంది. గ్లూకోజ్‌తోపాటు ఏదో మందు ఎక్కిస్తానన్నారు. అది తీసుకోగానే వెళ్లిపోదాం... నాకేం కాదు, ఏడవకు’ అన్నాడు బావ. తర్వాత చీఫ్ డాక్టర్ వచ్చాడు. ‘మేజర్‌గా ఏమీ లేదు’ అంటూ ఏదో చెప్పి వెళ్లిపోయారు కానీ నాకు విషయం పెద్దగా అర్థం కాలేదు. సెలైన్ ఎక్కిస్తుండగా బావ, నేనూ ఎప్పటిలానే మాట్లాడుకున్నాం. అయితే ఉన్నట్టుండి బావ నాలుక మడత పడడం మొదలైంది. ‘ఏ మైంది బావా’ అంటుండగానే కళ్లు మూతలు పడడం మొదలైంది. డ్యూటీ డాక్టర్ని, నర్సుల్ని గట్టిగా పిలిచాను. వెంటనే ఏవో ఇంజక్షన్లు ఇస్తూ, కాసేపు నన్ను బయటికి పొమ్మన్నారు. నేనలా పోతుండగా బావ ‘వీళ్లిలా గుచ్చేస్తున్నారు... ఏం చేస్తున్నావ్... రావే’ అని గట్టిగా అరిచాడు. అయినా హాస్పిటల్ వాళ్లు నన్ను అక్కడ ఉండనీయకుండా బైటికి పంపించడంతో ఏమీ చేయలేక వెళ్లిపోయాను. బయటికొచ్చి ఫోన్లు చేయడం మొదలెట్టాను... ముందు హైదరాబాద్‌లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ సంజీవ్‌కి, శ్రీనివాస్ అన్నకి (బావ వాళ్ల అన్న)! ఇద్దర్నీ వెంటనే ముంబై బయల్దేరి రమ్మని చెప్పి, మళ్లీ బావ దగ్గరికి వచ్చాను. (బోరున ఏడుస్తూ..) మా ఇద్దరి ప్రేమా మా ఇద్దరికే తెలుసు... మనిషి నిస్తేజంగా అలా పడుకుని ఉన్నాడనే కానీ, తన చూపు మాత్రం నావైపే! ఏం జరుగుతోందో తెలియని అయోమయంలో పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చున్నాను... ఇంతలో బావ నోట్లోంచి ఉన్నట్టుండి రక్తం రావడం మొదలైంది. బావకు తలనొప్పి వస్తేనే తట్టుకోలేని నేను, అంతలా రక్తం రావడంతో గట్టిగా అరవడం మొదలెట్టాను. వెంటనే నన్ను వార్డు నుంచి బయటికి పంపించబోయారు హాస్పిటల్ స్టాఫ్! ‘నాకు ఇక్కడ ఏం జరుగుతోందో చెప్పండి’ అని అడగడంతో, ‘అది తర్వాత... మీరిక్కడుంటే ట్రీట్మెంట్ ఇవ్వలేం’ అంటూ నన్ను బయటికి పంపించేశారు. చేసేదేంలేక పిల్లలకు ఫోన్ చేసి, ‘అప్పకి బాలేదు. వెంటనే వచ్చేయండి’ అని చెప్పి మళ్లీ లోపలికి వచ్చేంతలో డాక్టర్ ‘హి ఈజ్ నో మోర్’ అని చెప్పారు! ‘ఇంతలో ఇంత ఘోరమా?’ అని ఒకవైపు... అస్సలు నమ్మకం కలగకపోవడం మరోవైపు! సాయంత్రం 7.30 టైంలో అనుకుంటా పిల్లలు వచ్చారు... 9.30 దాకా బావ చేయి పట్టుకుని అక్కడే కూర్చున్నా. మర్నాడు పొద్దున బావని తీసుకుని హైదరాబాద్‌కి వచ్చాం. ఇందిర: గత సంవత్సరంగా ఆయన సన్నగా, బలహీనంగా కనిపించారు... అసలు ప్రాబ్లమేంటి? శాంతి: కొన్నాళ్ల క్రితం ఆయనకు షుగర్ వచ్చింది. దానికితోడు లివర్ ప్రాబ్లమ్ కూడా రావడంతో మనిషి సన్నబడిపోయాడు. అయితే వాటన్నిటినీ తక్కువ కాలంలోనే కంట్రోల్‌కి తెచ్చుకున్నాడు. సంవత్సరంగా అయితే తాగడం పూర్తిగా మానేశాడు. మనిషి సన్నబడ్డాడనే గానీ, హెల్త్ పర్ఫెక్ట్గా ఉండింది. చివరి వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇందిర: మీరు కూడా అంత ఆరోగ్యంగా కనిపించట్లేదు... చాలా సన్నబడిపోయారు! శాంతి: నిజమే... 18 కేజీలు తగ్గాను! ఏం చేయను? బావ లేకుండా... తిండి ఎక్కట్లేదు... మనుషుల్ని కలవాలనిపించట్లేదు... బయటికి పోవాలనిపించట్లేదు... ఏమీ చేయాలనిపించట్లేదు... ఏం చేయను? ఇందిర: ఇలాంటి పరిస్థితి ఆకస్మికంగా సంభవించినప్పుడు మనం నమ్మకపోవడం నుంచి అపనమ్మకంలో బతుకుతుంటాం... శాంతి: నాకైతే బావ చనిపోయినట్లేలేదు! షూటింగ్‌కి వెళ్లాడు... ఏడింటికల్లా తిరిగొస్తాడు, బావకోసం వంట చేయాలి... అనే ఆలోచనలతోనే బతుకుతున్నాను. మీకో విషయం తెలుసా.. పిల్లలకు ఇష్టమున్నా లేకున్నా, రోజూ నేను బావకు ఇష్టమైన వంటలే చేస్తుంటా. మూడుపూటలా బావకి (ఫోటో దగ్గర) పెడుతుంటా! ఇందిర: ఒక మనిషి గొప్పతనం పోయిన తర్వాత కానీ తెలీదంటారు. మీ బావ గురించి మీకు తెలీదని కాదు... శాంతి: యస్... యస్... యస్... బావ పోయిన రోజు నేను చూసిన అభిమానం అంతా ఇంతా కాదు. అభిమానులు, నచ్చినవాళ్లు, బంధువులు, స్నేహితులు... ఒకరుకాదు ఆరోజు వచ్చింది! బావ నిజంగా చాలా అదృష్టవంతుడు! అయితే ఇంత మంచి వ్యక్తిని 47 ఏళ్లకే దేవుడలా తీసుకెళ్లిపోవడం చాలా అన్యాయం! ఇందిర: మీరు ఆరోజు అంత నిబ్బరంగా వుండడం చాలా ఆశ్చర్యపరిచింది... శాంతి: ఎందుకంటే... ఆరోజు నాకసలు బావ చనిపోయిన ఫీలింగే లేదు! బతికున్నారని, లేస్తారనే అనిపించింది! పొలంలో పాప పక్కన పెట్టినప్పుడు కూడా బావ లేచి వస్తాడని, మట్టి వేయొద్దని అన్నాను. (ఏడుస్తూ) ఇద్దరు పిల్లలు లేకపోతే ఆరోజు నేను కూడా బావతోపాటు లోపల పడిపోయేదాన్ని! వాళ్లిద్దరికోసమే... బతకడం! ఇందిర: ఆయన మరణం ఆకస్మికంగా జరిగింది... మీకేదైనా జరిగితే పిల్లల సంగతేంటని ఎప్పుడైనా ఆలోచించారా? శాంతి: బావకు ప్లానింగ్ చేసే టైం లేకపోయింది. పైగా తను చావు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ, ఇప్పుడు నా పరిస్థితి అలా కాదు... కచ్చితంగా ఆలోచిస్తున్నాను. వాళ్లు ఎదిగి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేదాకా జాగ్రత్తగా ఉంటా! వాళ్లకోసం ప్లానింగ్ చేయాల్సింది చాలా ఉందని తెలుసు. అందుకే ఇప్పటినుంచే మొదలెట్టాను. నాకేదైనా అయినా నా పిల్లల జీవితాలే కాదు, మనవలు, మనవరాళ్ల జీవితాలు కూడా సాఫీగా గడిచిపోయేలా ప్లాన్ చేస్తున్నాను. ఇందిర: పిల్లలు ఉన్నట్టుండి మెచ్యూర్డ్గానో, బాధ్యతగానో అయినట్టు ఏమైనా అనిపించిందా? శాంతి: పెద్దోడు చాలా అండర్స్టాండింగ్! సందర్భాన్ని బట్టి... ఓదారుస్తాడు, నవ్విస్తాడు! చిన్నవాడికి ఇంకా అంత తెలీదు. కానీ వాడు కూడా ఇప్పుడిప్పుడు... తిన్నానా లేదా? నిద్రపోయానా లేదా? అని కనుక్కుంటుంటాడు. నేను తినకపోతే ఒక్కోసారి పిల్లలు కూడా తినరు. అలానే నిద్రపోతారు. అప్పుడు మాత్రం బాధనిపిస్తుంది. అందుకే మర్నాడు వాళ్లకోసమైనా తింటుంటాను. నేను పైకి బెడ్రూంలోకి వెళ్లకపోతే, రాత్రి ఒంటిగంటైనా, రెండయినా వాళ్లు కూడా నాతోపాటే కూర్చుంటారు. అప్పుడప్పుడు బెడ్రూం తలుపు తీసి చూసి, నేను పడుకున్నాను అనుకున్నాక పడుకుంటారు. నేను ఎప్పుడూ ఏడుస్తుంటాననో ఏమో కానీ, నా ముందు ఒక్కసారి కూడా వాళ్లు కంట నీరు పెట్టలేదు. దే కేర్ ఫర్ మి సోమచ్! అయామ్ వెరీ లక్కీ దట్ వే! ఇందిర: ఇప్పుడు పరిస్థితి ఇంతకుముందులా కాదుకదా! జీవితానికి సంబంధించి ఏమైనా నేర్పిస్తున్నారా? శాంతి: యాజ్ సచ్... పిల్లలు చాలా మెచ్యూర్డ్ అండ్ స్మార్ట్! దే కెన్ లుక్ ఆప్టర్ దెమ్సెల్వ్స్ వెల్! దానికితోడు ఇప్పుడిప్పుడు నేను ఇంటి ఖర్చులన్నీ పెద్దోడి చేతుల మీదుగా చేయిస్తున్నాను... డబ్బు విలువ తెలియాలని! ఉల్లిపాయ రేట్ల నుంచీ బియ్యం రేట్ల దాకా అన్నీ చెప్తున్నాను. ఒకవైపు బాధ్యత నేర్పుతూనే, బావ లేని లోటు లేకుండా వాళ్లను ‘శ్రీహరి పిల్లలు’గానే పెంచుతున్నాను! వాళ్లకోసం ఎంతయినా కష్టపడతాను! ఇందిర: పిల్లలు ఏం కావాలని ఆయనకుండేది? శాంతి: ఇద్దరూ ఆయనలా ఇండస్ట్రీలోకి రావాలని! నాకు మాత్రం వాళ్లు చదువుకోవాలని! ఇక పిల్లల విషయానికి వస్తే... పెద్దవాడికి డెరైక్టర్ అవ్వాలని (ఇప్పటికే షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాడు), చిన్నోడికి యాక్టర్ అవ్వాలని (చైల్డ్ యాక్టర్‌గా చేశాడు అవార్డు కూడా వచ్చింది)! బావ కలగన్నదీ, పిల్లలకు నచ్చింది నెరవేర్చడం నా బాధ్యత... అయితే, ఇద్దరు పిల్లలూ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాకే! ఇందిర: అసలు ఆయనకి ఫ్యూచర్ ప్లాన్స్ ఏముండేవి? శాంతి: బావకు ఎప్పుడూ జనాలతో ఉండాలని, వాళ్లకు చేతనైనంత సాయం చేయాలని, అందుకోసం మినిస్టర్ అవ్వాలని కోరిక ఉండేది. 2009లో రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వచ్చినా రెండు పడవల మీద కాళ్లు పెట్టొద్దని నేనే తనను వెనక్కి లాగా! ఫ్యామిలీ పరంగా చూస్తే పిల్లలు చిన్నవాళ్లు, నేనూ తనను చూడకుండా ఉండలేను... పైగా తన కెరీర్ కూడా అప్పుడు చాలా బాగుంది. ఇటు ఇండస్ట్రీపరంగా చూసినా, తను రాజకీయాల్లోకి వెళ్తే ప్రొడ్యూసర్లు ఇబ్బందులు పడతారని ససేమిరా అన్నాను. అందుకే తను 2014 కల్లా అన్ని కమిట్మెంట్లు పూర్తిచేసుకుని, పూర్తిగా రాజకీయాల్లోకి వస్తానన్నాడు. కానీ, ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయాడు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది... బావకోసమైనా నేను రాజకీయాల్లోకి రావాలని, తను ప్రజలకు చేయాలనుకున్న మంచి నేను చేయాలని! ఇందిర: ఈ రెండున్నర నెలల్లో ... ‘అసలు మనుషులు ఇలా ఉంటారా?’ అని అనిపించిన సందర్భాలున్నాయా? శాంతి: నాకు ముందే తెలుసు... మనుషులు ‘ఇలానే’ ఉంటారని! నాకేదీ షాకింగ్ కాదు. ఎందుకంటే, జీవితంలో ఢక్కామొక్కిలు తిని వచ్చినదాన్ని! అప్ప (నాన్న ఆనందన్ - తమిళ్లో పెద్ద యాక్టర్) బతికి ఉండగానే అప్స్ అండ్ డౌన్స్ చూసినదాన్ని! ఇక నాన్న పోయాక చెప్పనక్కర్లేదు! ఒక్క జీవితంలో ఎన్నో జీవితాల్ని చూసినదాన్ని కాబట్టి ఈరోజు ఎలాగైనా బతకగలుగుతున్నాను. అయితే, మనుషులం కదా... చిన్న ఆశ ఉంటుంది. ఇన్నాళ్లు నన్ను అక్క, చెల్లి, అమ్మ, వదిన అని పిలిచినవాళ్లు, బావకు అతిదగ్గరగా ఉన్న కొందరు ఈరోజు అసలు కనిపించకపోవడంతో, ఆ ఆప్యాయతను మిస్సవుతున్నాను. అదొక్కటే కొంచెం బాధనిపిస్తుంది. ఎందుకంటే, నేనే కాదు... నా పిల్లలకు కూడా వాళ్లు చాలా క్లోజ్. అయినా మేం కోరుకునేదేంటని? కాస్తంత ఓదార్పు... మాటసాయం! అది కూడా వాళ్లకు అంత కష్టంగా ఉంటే మనమేం చేయగలం! ఇందిర: ఎందుకంటారు? శాంతి: (నిర్వేదంగా నవ్వుతూ) నా దగ్గర డబ్బు లేదు... నేనేమైనా అడుగుతాననుకుంటున్నారేమో! వాళ్లకు తెలీదు... నేను చచ్చేంతవరకు నా చేయి పైన ఉండాల్సిందే కాని, కింద ఉండదని! చిన్నప్పుడు అంత కష్టంలో ఉన్నప్పుడే ఒకరి దగ్గర చేయి చాచలేదు... ఇప్పుడు చేస్తానా! అవసరమైతే తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి వస్తా... సినిమాలు పొడ్యూస్ చేస్తా... సీరియల్స్ తీస్తా... ఏదైనా చేస్తాను, ఎంతైనా కష్టపడతాను కానీ, ఒకరి నుంచి ఆశించను! ఇందిర: రివర్స్‌లో... మీ దగ్గరికి డబ్బుకోసం (సాయం) వచ్చినవాళ్లు, డబ్బు ఇవ్వాలని (అప్పులు) వచ్చినవాళ్లు ఉన్నారా? శాంతి: ఉన్నారు. సాయంకోసం వచ్చిన ఎవ్వరినీ బావ కాదనేవాడు కాదు. నమ్ముతారో లేదో ‘మన దగ్గర 10 వేలే ఉన్నాయి బావా’ అన్న రోజున కూడా ‘ఇచ్చెయ్వే... వాళ్లేదో కష్టంలో ఉన్నారు’ అని ఇచ్చేసేవాడు. అటువంటి మనిషి బావ! తనలా నేనెప్పటికీ చేయలేను... అయితే ఇప్పటికీ కుదిరినంత చేస్తున్నాను. ఇక డబ్బులు ఇవ్వాలని వచ్చినవాళ్ల గురించి అంటారా... సరైన డాక్యుమెంట్లు, ప్రూఫ్‌లు చూపిస్తే తప్ప ఇవ్వనని కరాఖండిగా చెప్పేస్తున్నాను. లేకపోతే ప్రతివాళ్లూ మోసం చేస్తారు. ఇందిర: ఆయన ఉండగా ఇల్లంతా సందడిగా, హడావిడిగా ఉండేదేమో కదా? ఇప్పుడు..? మీ సంగతి? శాంతి: బావను తలుచుకుంటూ, గతాన్ని గుర్తుచేసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటా. రోజుకో గంటసేపు మాత్రం బావ సమాధి దగ్గర కూర్చుని వస్తా. సాయంత్రం పిల్లలు ఇంటికొచ్చాక, వాళ్లకి కావలసినవి చూసుకుని, ఓ గంటసేపు నిద్రపోతా... ఎందుకంటే, నాకు రాత్రిపూట నిద్రపట్టడం లేదు. బాగా దగ్గరివాళ్లను తప్ప ఎవ్వర్నీ పెద్దగా కలవాలని కూడా ఉండట్లేదు. ఓ వారం నుంచే కాస్తంత బయటికెళ్తున్నా. రికవర్ కావడానికి, దీన్నుంచి బైటికి రావడానికి ట్రై చేస్తున్నాను. ఇందిర: ‘మళ్లీ తెల్లారుతోందా?’ అని భయపడిన సందర్భాలున్నాయా? శాంతి: (నిర్లిప్తంగా) అసలు నిద్రపోతేగా! ఇందిర: బావ విషయంలో బాగా మిస్సయ్యే క్షణాలు..? శాంతి: భోజనం టైం! తను తిని లేచాక కబుర్లు చెబుతూ అదే ప్లేట్లో భోంచేయడం! అది అలవాటయ్యే ఇప్పుడు ఏమీ తినాలనిపించట్లేదు! ఇందిర: మీరు ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు... ఆయన మిమ్మల్ని కనుపాపలా చూసుకున్నారు. ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులంటారు? శాంతి: (నవ్వుతూ) నేను ఆయన్ని అనేదాన్ని... ఆయన నన్ను అనేవారు! అది పక్కనపెడితే ఇప్పుడూ, ఎప్పుడూ నేను ఒక్కటే అంటాను... అలాంటి భర్త దొరకడం నా అదృష్టమని! ఎందుకంటే - ఆయన ఒక ట్రెడిషనల్‌గా ఉండే చదువుకున్న అమ్మాయిని చేసుకోలేదు... ఒక ఆర్టిస్ట్‌ని, అందులోనూ గ్లామర్ ఆర్టిస్ట్‌గా ఉన్న నన్ను పెళ్లి చేసుకుని, ఇంతగా నెత్తినపెట్టుకుని చూసుకున్నాడు. అందుకే ఏ జన్మయినా నాకు ఆయనే భర్తగా కావాలనుకుంటున్నాను! ఇందిర: గతంలో డిసెంబర్ 31 అంటే ఎలా ఉండేది? ఈ సంవత్సరం..? శాంతి: ప్రతి ఏడాది డిసెంబర్ 31న ఇంట్లో విపరీతమైన సందడి! ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేవారు. బయట ఈయన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటే, నేను వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌తో సరదాగా గడిపేదాన్ని! ఈ సంవత్సరం ముగ్గురం (నేను, పిల్లలు) బావ సమాధి దగ్గర గడుపుతాం! మొదట్లో బావ యాక్టింగ్ నాకు నచ్చేది కాదు మొదట్లో ఈయన యాక్టింగ్ నాకు అసలు నచ్చేది కాదు. ‘నీకసలు యాక్టింగ్ రాదు... ఎలా యాక్టర్‌వి అయ్యావు బావా’ అని ఎప్పుడూ ఏడిపించేదాన్ని! కాని ‘సాంబయ్య’, ‘అయోధ్య రాముడు’ చూశాక మాత్రం ‘చాలా బాగా యాక్ట్ చేశావు బావా’ అని మెచ్చుకున్నా! నా అభిప్రాయానికి చాలా విలువ ఇచ్చేవాడు బావ! ప్రివ్యూ అవగానే నా వంకే చూసేవాడు... ఏమంటానా అని! నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పేదాన్ని... తన యాక్టింగ్ గురించే కాదు, మొత్తం సినిమా గురించి! అందుకే మొదట్లో ప్రివ్యూకి తీసుకువెళ్ళేవాడు కాస్తా తరువాత తరువాత ఫస్ట్ కాపీకి తీసుకెళ్లడం మొదలు పెట్టాడు. ‘ఇక్కడ ఇక్కడ ఈ తప్పులు ఉన్నాయి.... ఈ షాట్స్ మార్చాలి’ అని చెబితే మార్పించేవాడు. బావ ఎప్పుడూ అనేవాడు - ‘నీ నాలుక మీద నల్లమచ్చలు ఉన్నాయి... నువ్వు ఏమి చెబితే అదే జరుగుతుంది’ అని! నిజంగానే అన్నట్టే జరిగేది... సినిమా రిజల్ట్! ఆయన భార్యగా నేనెప్పుడూ ఆయన్ని హీరోగా చూడడానికే ఇష్టపడేదాన్ని. అందుకే క్యారెక్టర్ రోల్స్‌కి షిఫ్ట్ అవుతానన్నప్పుడు వద్దని గొడవ చేశాను. కానీ వాటిలో తన యాక్టింగ్ చూశాక మాత్రం గర్వంగా ఫీలయ్యాను... ముఖ్యంగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఢీ, మగధీర...’లలో... హీరోలకు సమానంగా తననీ గుర్తుంచుకునేలా యాక్ట్ చేశాడు! బావ - నేను 1991... నా కెరియర్ పీక్‌లో ఉంది... ఎంతోమంది ‘ఐ లవ్ యూ’ చెప్పారు కానీ, ఈయన ఒక్కరే నన్ను ‘పెళ్లి చేసుకుంటాను’ అన్నారు. అది నచ్చే, వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాను. చెల్లెళ్లు, తమ్ముళ్ల పెళ్లిళ్లు అయితే కానీ పెళ్లి చేసుకోనని చెప్పినా, నాకోసం ఎన్నాళ్లయినా వెయిట్ చేస్తానన్నాడు. 1993లోగా పెళ్లి చేసుకోకపోతే తనకు పెళ్లి యోగం లేదని ఎవరో జాతకం చెప్పడంతో, మా తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలో బయటెవ్వరికీ చెప్పకుండా, అదే సంవత్సరం నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. నా తోబుట్టువులందరి పెళ్లిళ్లు అయిపోయాక 1996లో అందరి సమక్షంలో మళ్లీ చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నా ఇంటి నుంచి నన్ను కట్టుబట్టలతో తీసుకెళ్లి, తనే అన్నీ (పెళ్లి నగలు, చీరలు, ఫ్లాట్, కారు..) సమకూర్చి, పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు. నాకు కోరికలు చాలా తక్కువ. బావను ఎక్కువ ఏదీ అడిగేదాన్ని కాదు. కానీ నా నోటి నుంచి ‘బాగుంది’ అన్న పదం వచ్చినా సాయంత్రంకల్లా అది ఇంటికి రావలసిందే... కారైనా, నగైనా! అది కూడా సర్ప్రైజ్ చేస్తూ! ఇద్దరం చాలా పొసెసివ్! టీవీలో ఒక అమ్మాయి వైపు ఇంట్రస్ట్‌తో చూసినా నేను ఊరుకునేదాన్ని కాదు. ఎక్కడున్నా ప్రతి పది నిమిషాలకు కాల్ చేసేదాన్ని. బావ కూడా ఏం తక్కువ కాదు... తను లేకుండా నన్ను ఎక్కడికీ ఒంటరిగా వెళ్లనిచ్చేవాడు కాదు. బావకు ఎప్పుడైనా పిల్లలకన్నా నేనే ఎక్కువ. నేనెలా ఉన్నాను... తిన్నానా లేదా? అని ఎప్పుడూ కనుక్కుంటూనే ఉంటాడు... ఆఖరికి పోయే ముందు కూడా! హోటల్ నుంచి హాస్పిటల్‌కు వెళ్తూ రిసెప్షన్లో ఉన్న అబ్బాయితో ‘మేడమ్ గారు బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు... తినమని చెప్పండి’ అని చెప్పి మరీ వెళ్లాడు! ఎప్పుడూ ‘నేనున్నాను... నీకేంటే?’ అనే బావ ఈరోజు నన్ను ఇలా వదిలేసి వెళ్లినందుకు చాలా కోపంగా ఉంది!