నటి మేనకోడలు ఆచూకీ దొరికింది! | Disco Shanti daughter in law is safe now | Sakshi
Sakshi News home page

నటి మేనకోడలు ఆచూకీ దొరికింది!

Published Sun, Sep 17 2017 9:37 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

నటి మేనకోడలు ఆచూకీ దొరికింది!

నటి మేనకోడలు ఆచూకీ దొరికింది!

డిస్కోశాంతి సోదరుడి కుమార్తె క్షేమం
సాక్షి, పెరంబూరు (చెన్నై): నటి డిస్కోశాంతి సోదరుడి కూతురు క్షేమంగా ఉన్నట్టు సమాచారం. పలు భాషా చిత్రాల్లో నటించి ప్రాచుర్యం పొందిన డిస్కోశాంతికి సోదరి లలితాకుమారి, సోదరుడు అరుణ్‌ ఉన్నారు. లలితా కుమారి నటుడు ప్రకాశ్‌రాజ్‌ మాజీ భార్య అన్న విషయం తెలిసిందే. కాగా వీరి సోదరుడు అరుణ్‌ సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. అరుణ్, సెర్లీ దంపతుల పెద్ద కుమార్తె అప్రినా ప్లస్‌ టూ చదువుతోంది. ఈ అమ్మాయి గత 8వ తేదీన పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు.

దీంతో ఆమె తల్లిదండ్రులు టీ.నగర్, పాండిబజార్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, మీడియాను ఆశ్రయించారు. దీంతో పోలీసులు అప్రినా ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నా, మరో వైపు ఆమె కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ప్రకాశ్‌రాజ్‌ తన ట్విట్టర్‌లో అప్రినా ఆచూకీ లభించిందని, క్షేమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ విషయమై డిస్కోశాంతి సోదరి లలితాకుమారి కుటుంబ సభ్యులను సంప్రదించగా అప్రినా ఆచూకీ తెలిసిందని త్వరలోనే తను ఇంటికి రానున్నట్టు తెలిపారు. అప్రినా ఎక్కడికి వెళ్లింది. ఇన్ని రోజులు ఎక్కడ ఉంది లాంటి వివరాలను చెప్పడానికి వారు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement