మా బావకు నేను చేస్తున్న ఆఖరి పెద్ద ఉత్సవమిది : శాంతి | Dr Srihari First Death Anniversary -Disco Shanti | Sakshi
Sakshi News home page

మా బావకు నేను చేస్తున్న ఆఖరి పెద్ద ఉత్సవమిది : శాంతి

Published Thu, Oct 9 2014 11:07 PM | Last Updated on Fri, Oct 5 2018 9:08 PM

మా బావకు నేను చేస్తున్న ఆఖరి పెద్ద ఉత్సవమిది : శాంతి - Sakshi

మా బావకు నేను చేస్తున్న ఆఖరి పెద్ద ఉత్సవమిది : శాంతి

‘‘పిల్లలు కూడా సినిమాల్లోనే స్థిరపడాలని కోరుకునేవారు బావ. నాకు మాత్రం వాళ్లు బాగా చదువుకుని మంచి స్థానాల్లో స్థిరపడాలని ఉండేది. అయితే... పిల్లలు వాళ్ల నాన్న వైపే మొగ్గు చూపారు. వాళ్లు కూడా సినిమాల్లోనే స్థిరపడాలనుకుంటున్నారు. మా బావకు నేను చేస్తున్న ఆఖరి పెద్ద ఉత్సవం ఇది. ఇక నుంచి అంతా మా పిల్లలు చూసుకుంటారు. ఎప్పటిలాగే ఇక నుంచి కూడా అభిమానులతో, శ్రేయోభిలాషులతో సత్సంబంధాలను కొనసాగిస్తాం’’ అని శాంతి శ్రీహరి అన్నారు.
 
  గురువారం నటుడు శ్రీహరి ప్రథమ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని శ్రీహరి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతి శ్రీహరి మాట్లాడారు. తాను దర్శకునిగా మారతానని, తమ్ముడు హీరోగా నిలబడతాడని, ఇద్దరం కలిసి సేవాకార్యక్రమాలను కొనసాగిస్తామని శ్రీహరి పెద్ద కుమారుడు శశాంక్ నమ్మకం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సి. కల్యాణ్, దర్శకులు వీరశంకర్, దేవి ప్రసాద్, బాబీ, జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement