నెల్సన్ (సాక్సటన్ ఓవల్) | Nelson oval stadium | Sakshi
Sakshi News home page

నెల్సన్ (సాక్సటన్ ఓవల్)

Published Thu, Feb 5 2015 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM

నెల్సన్ (సాక్సటన్ ఓవల్)

నెల్సన్ (సాక్సటన్ ఓవల్)

 సాక్సటన్ ఫీల్డ్ కాంప్లెక్స్‌లో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. నెల్సన్ సిటీ కౌన్సిల్, టాస్మాన్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, నెల్సన్ క్రికెట్ సంఘం సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హాకీ, సాఫ్ట్‌బాల్‌లకు కూడా ఈ స్టేడియాన్ని ఉపయోగిస్తారు. అసలు స్టాండ్స్ లేని ఈ మైదానాన్ని ఓ పార్క్‌లో రూపొందించారు. బౌండరీ బయట కూర్చుని మ్యాచ్ చూడటమే తప్ప కుర్చీలు ఉండవు.  

2011లో కొత్తగా పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. మైదానంలో రెండు వైపుల స్థూపాకార రూపంలో ఉన్న బిల్డింగ్‌లు అదనపు ఆకర్షణ. దీని కెపాసిటీ కేవలం 5 వేలు మాత్రమే. టాస్మాన్ నది ఒడ్డున 1841లో నిర్మించిన ఈ నగరం భౌగోళికంగా న్యూజిలాండ్‌కు మధ్యలో ఉంటుంది. సుదీర్ఘమైన గోల్డెన్ బీచ్‌లు, పెద్దపెద్ద అడవులు, ఎత్తై పర్వతాలు నెల్సన్‌కు ప్రత్యేక ఆకర్షణ.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement