cricket association
-
మనీలాండరింగ్ కేసు: ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ:నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ మఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో విచారించేందుకు ఈడీ సోమవారం సమన్లు ఇచ్చింది. రేపు (మంగళవారం) తమ ముందు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. గత నెల జనవరి 11న కూడా ఈడీ ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేయటం గమనార్హం. దేశంలో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫరూక్ అబ్దుల్లాకు రెండో సారి ఈడీ సమన్లు రావటంపై పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరగటం గమనార్హం. ఇక.. 2004 నుంచి 2009 వరకు జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించి నిధులు పక్కదారి పట్టాయని ఫరూక్ అబ్దుల్లాపై ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ క్రమంలో సీబీఐ రంగంలోకి దిగి.. ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ అంశం కావడంతో సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. క్రికెట్ అసోసియేషన్‌లోని కొందరు ఆఫీస్ బేరర్లతో పాటు ఇతరుల బ్యాంకు నిధులు మళ్లినట్లు ఈడీ గుర్తించింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ చెందిన బ్యాంకు అకౌంట్ల నుంచి నగదు విత్‌డ్రా అయినట్లు ఈడీ విచారణలో నిర్ధారించింది. దీంతో 2022లో ఫరూక్‌పై సీబీఐ అభియోగాలు మోపింది. శ్రీనగర్ లోక్‌సభ ఎంపీ ఉన్న సమయంలో ఫరూక్ అబ్దుల్లా ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు 2001 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. అదే సమయంలో ఫరూక్ అబ్దుల్లా.. తన అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బీసీసీఐ స్పాన్సర్‌గా ఉన్న ఈ అసోసియేషన్‌లో నిధులు పక్కదారి పట్టేలా నియమకాలు జరిగాయని కూడా ఈడీ వెల్లడించింది. చదవండి: Money Laundering Case: ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు -
క్రికెట్ వరల్డ్‌కప్ రోజున ఉచిత వసతి! ఎక్కడంటే..
ప్రపంచకప్ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరిగబోయే అహ్మదాబాద్‌లో రద్దీ నెలకొంది. ప్రధానంగా మ్యాచ్ జరిగే నరేంద్రమోదీ స్టేడియం పరిసరాల్లోని హోటళ్లు మ్యాచ్ వీక్షకులతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి వసతి కష్టంగా మారింది. ఈ తరుణంలో తాజాగా అహ్మదాబాద్‌లోని వేక్‌ఫిట్ మ్యాట్రెస్ సొల్యూషన్స్ కంపెనీ తమ స్టోర్‌లో ఉచిత బసను పొందేందుకు క్రికెట్ అభిమానులకు అవకాశం కల్పిస్తోంది. క్రికెట్ అభిమానుల కోసం అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్-గాంధీనగర్‌లో ఉన్న బోడక్‌దేవ్ అవుట్‌లెట్‌లో ప్రపంచ కప్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఉచిత బస ఏర్పాటు చేసినట్లు వేక్ఫీట్ ప్రకటించింది. అయితే ఇందుకోసం అభిమానులు ముందుగా తమ వెబ్సైట్లో మ్యాచ్ టికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పేరు, చిరునామా వంటి ప్రాథమిక వివరాలను కంపెనీకి ఈమెయిల్ చేయాలి. నవంబర్ 19, ఉదయం 11లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంస్థ తెలిపింది. క్రికెట్ అభిమానులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ అయిన వేక్‌ఫిట్ మ్యాట్రెస్‌ను తయారుచేస్తోంది. 2016లో స్థాపించిన ఈ కంపెనీ ఈ రంగంలో 30-40 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకుందని సమాచారం. -
హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి రంగం సిద్ధం
-
Zahara Begum: చూపున్న మనసు
మనసుకు చూపు ఉంటే ఎదుటి వారి కష్టం కనపడుతుంది. మనసుకు స్పందన ఉంటే ఎదుటివారి సాయం కోసం మార్గం వేస్తుంది. జహారా బేగంకు అలాంటి మనసు ఉంది. అందుకే ఆమె అంధుల కోసం పని చేస్తూ ఉంది. అంధుల క్రికెట్‌కు ప్రోత్సాహం అందిస్తోంది. వారి మేచ్‌లు నిర్వహిస్తోంది. ఆ సేవకు ‘క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’కు చైర్ పర్సన్‌గా నియమితురాలైంది. జహారా పరిచయం. ‘మనలో ఎవరైనా ఎప్పుడైనా అంధులు కావచ్చు. దృష్టి పోతే జీవితం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అందుకే దృష్టి లేని వారి గురించి ఎవరికి తోచినంత వారు పని చేయాలి’ అంటుంది జహారా బేగం. తెనాలికి చెందిన జహారా తన తల్లి తాహెరా పేరున ‘తాహెరా ఫౌండేషన్’ స్థాపించి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అలాగే బెంగళూరు, హైదరాబాద్‌లలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ‘నేను నాలుగో క్లాస్‌లో ఉండగా నా క్లాస్మేట్ ఒకమ్మాయి మధ్యాహ్నం పూట ప్రసాదం తెచ్చుకుని తినేది. అన్నం ఉండేది కాదు. ఆ అమ్మాయి కోసం నేను మా అమ్మతో చెప్పి బాక్స్ తీసుకెళ్లేదాన్ని. చిన్నప్పటి నుంచి ఎందుకో ఎదుటివారికి సాయం చేయాలనే గుణం నాలో ఉంది. ఆ గుణాన్ని వయసు పెరిగే కొద్దీ కాపాడుకున్నాను’ అంటుంది జహారా. ఆటలంటే ఇష్టం ‘మాది గుంటూరు. చిన్నతనం నుంచి ఆటలంటే ఇష్టం. బాస్కెట్‌బాల్ జాతీయస్థాయి ప్లేయర్‌గా ఆడాను. గుంటూరు మహిళా బాస్కెట్‌బాల్ జట్టు మాతోనే మొదలైంది. అయితే చదువులో కూడా చురుగ్గా ఉండి బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను. ఆ తర్వాత అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసి పీహెచ్డీ కోసం జర్మనీలో కొంత రీసెర్చి చేశాను. అక్కడి నుంచి తిరిగొచ్చాక నా మాతృమూర్తి పేరుతో తాహెరా ట్రస్ట్ ప్రారంభించి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవల్లో మమేకమయ్యాను. ఆ సమయంలోనే బెంగళూరులోని ‘సమర్థనం ట్రస్ట్ ఫర్ బ్లైండ్’ చేస్తున్న పని నాకు నచ్చింది. వారితో కలిసి అంధుల కోసం పని చేయసాగాను. బెంగళూరులో విమెన్ బ్లైండ్ క్రికెట్ వర్క్‌షాపును నిర్వహించాను’ అని తెలిపిందామె. అంధుల కోసం ‘అంధుల క్రీడలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చేవారు చాలా తక్కువ. అంధుల క్రికెట్‌కు ప్రోత్సాహం అందించేవారూ తక్కువే. వారికోసం నేనెందుకు ఏదైనా చేయకూడదు అనుకున్నాను. అప్పటినుంచి నా చేయూత నిరవధికంగా సాగింది. అంతేకాదు, ‘క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా’ (సీఏబీఐ)లోనూ, ‘టి20 వరల్డ్ కఫ్ క్రికెట్ ఫర్ బ్లైండ్–2017’ పోటీల సమయంలోనూ చురుగ్గా పని చేసే అవకాశం కలిగింది. దాంతో ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీబీబీఏపీ) ఛైర్‌పర్సన్‌గా నియమితురాలినయ్యాను. ఇది నాకు సంతోషంగా ఉంది’ అని తెలిపిందామె. అంధుల టి20 ‘2017లో దేశంలోని మెట్రో నగరాల్లో 2వ అంధుల టి20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలను సీఏబీఐ నిర్వహించింది. పది దేశాల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్గనైజింగ్ కమిటీ ఇన్చార్జ్గా నేను రెండు మ్యాచ్‌లను ఆంధ్ర, తెలంగాణలో నిర్వహించేందుకు చొరవ చూపాను. అలాగే ‘తొలి విమెన్స్ నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ బ్లైండ్ – 2019’ న్యూఢిల్లీలో జరిగింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ (సీఏబీఏపీ)కి నిధుల కొరత, స్పాన్సర్లు లేకపోవటం, క్రీడాకారిణుల లేమి గమనించాను. దాంతో ఆంధ్రప్రదేశ్ అంధ మహిళల క్రికెట్ జట్టు రూపకల్పనకు పూనుకున్నా. అనంతపురంలో రాష్ట్రస్థాయి అంధ మహిళల క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంధ మహిళల క్రికెట్ జట్టు ఎంపికకు సహకారం అందించాను.. ఇటీవల యూకేలో జరిగిన ఐబీఎస్ఏ టోర్నమెంటులో విజేతగా నిలిచిన ఇండియా జట్టులో మా శిక్షణలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపిందామె. అంధుల క్రికెట్ గురించి.... ‘అంధుల క్రికెట్ ఢిపరెంట్‌గా ఉంటుంది. బ్యాట్, వికెట్లు అన్నీ ఒకలాగే ఉంటాయి. బంతి మాత్రం వైవిధ్యంగా తయారు చేస్తారు. ఇందులో ఉండే బేరింగ్స్ చేసే శబ్దాన్ని ఆధారంగా బాట్స్మెన్ ఆడతారు. బౌలింగ్ సాధారణ క్రికెట్లోలా భుజంపైనుంచి కాకుండా దిగువ నుంచి వేస్తారు. క్రికెట్ జట్టులో బీ1, బీ2, బీ3 అనే మూడు కేటగిరీల వారుంటారు. బౌలరు, బ్యాట్స్‌మెన్ పూర్తిగా అంధులై ఉంటారు. మిగిలినవారు పాక్షికంగా అంధులు. వీరు ఆడే మైదానం 50 గజాలు మాత్రమే. నిబంధనలన్నీ మామూలే. సీఏబీఐలో 25 వేల మంది సభ్యులున్నారు’ అని తెలిపిందామె. తన సేవా కార్యక్రమాలను అమెరికాకు కూడా విస్తరించిన జహారా అక్కడ చిన జీయర్ నేత్రాలయం కోసం నిధులు సేకరించడంతో తనవంతు సహకారం అందించారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి. -
ధర్మశాల టెస్టు వైజాగ్‌లో?
న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టు వేదిక మారనుంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ)కు చెందిన ఈ మైదానంలో అసంపూర్తి పనులవల్ల మ్యాచ్ వేదికను మార్చాల్సి వస్తుందని బీసీసీఐ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ధర్మశాల స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ సహా పిచ్‌పై పచ్చికను కొత్తగా పరిచారు. పిచ్‌ను ఇంకా పరీక్షించలేదు. అక్కడక్కడ పనులు ఇంకా పూర్తవలేదు. ప్యాచ్ వర్క్ అలాగే మిగిలిపోయింది. అందువల్లే ఐదు రోజుల ఆట (టెస్టు మ్యాచ్)ను అసంపూర్ణమైన మైదానంలో నిర్వహించడం సమంజసం కాదని బీసీసీఐ భావిస్తోంది. మూడో టెస్టుకు ప్రత్యామ్నాయ వేదికలుగా వైజాగ్, బెంగళూరు, ఇండోర్, రాజ్కోట్లను బోర్డు పరిశీలిస్తోంది. -
అరటిపండ్లకు 35 లక్షల బిల్లు?.. చంపుతామంటూ బెదిరింపులు
ఉత్తరాఖండ్ రంజీ క్రికెట్ అసోసియేషన్‌లో చోటుచేసుకుంటున్న అక్రమాల గురించి కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కోవిడ్-19 తర్వాత క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఉత్తరాఖండ్(సీఏయూ) తప్పుడు రిపోర్టులు అందిస్తూ వచ్చింది. తమ రంజీ ఆటగాళ్లకు రోజు దినసరి కూలి కింద రూ.వంద ఇవ్వడం సంచలనం రేపింది. సీఏయూ రిపోర్ట్ ప్రకారం రూ.1.74 కోట్లు కేవలం ఫుడ్, ఇతర క్యాటరింగ్ సేవలకు ఉపయోగించినట్లు పేర్కింది. కేవలం ఆటగాళ్లకు అందించే అరటిపండ్లకు రూ. 35 లక్షల దొంగ బిల్లులను చూపించింది. ఇక రూ.49.5 లక్షలు రోజూవారి అలెవన్స్‌ల కింద తప్పుడు లెక్కలు సమర్పించింది. ఇలాంటి తప్పుడు బిల్లులకు తోడూ ఆటగాళ్లకు చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. తమ బిల్లులు చెల్లించాలని ఎవరైనా ఫోన్ చేస్తే చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని మాజీ అండర్-19 క్రికెటర్ ఆర్య సేతీ పేర్కొన్నాడు.ఈ విషయమై అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీఎయూ సెక్రటరీ మహిమ్ వర్మ, హెడ్‌కోచ్ మనీష్ జా, అసోసియేషన్ అధికార ప్రతినిధి సంజయ్ గుసెన్‌లను విచారించగా.. క్రికెటర్లకు బెదిరింపులు నిజమేనని పేర్కొన్నారు. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక రంజీ క్రికెటర్‌కు రోజువారీ వేతనంలో ఒక క్రికెటర్‌కు రూ. 1000-1500 నుంచి అందుకుంటారు. అదే ఒక సీనియర్ క్రికెటర్‌కు రూ. 2వేల వరకు పొందుతారు. కానీ ఈ నిబంధనలను గాలికొదిలేసిన ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ గత 12 నెలలుగా సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా కేవలం వంద రూపాయాలను మాత్రమే రోజూవారీ వేతనంగా ఇస్తుండడం శోచనీయం. గత మార్చి 20న 'టోర్నమెంట్ అండ్ ట్రయల్ క్యాంప్ ఎక్స్పెన్సెస్' పేరిట తయారు చేసిన ఆడిట్ రిపోర్టులో మాత్రం సదరు క్రికెట్ అసోసియేషన్ ఘనంగానే లెక్కలు చూపించింది. ఆటగాళ్ల జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులతో కలిపి రూ.1,74,07,346 ఖర్చు చేస్తున్నట్లు చూపించింది. ఇందులో రూ.49,58,750లను ఆటగాళ్లకిస్తున్న రోజువారీ వేతనం కింద లెక్క చూపించింది. అంతేగాక మరో 35 లక్షలతో ఆటగాళ్లకు అరటిపండ్లు, రూ.22 లక్షలతో వాటర్ బాటిల్స్ అందిస్తున్నట్లుగా రిపోర్ట్‌లో చూపించింది. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
-
మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఎదుట ఫరూఖ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కి సంబంధించిన 40 కోట్ల రూపాయల మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాని ఆరు గంటలపాటు విచారించింది. రాజ్‌బాగ్‌లోని తమ కార్యాలయంలో ఫరూఖ్‌ను ఈడీ విచారించింది. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులోని వాస్తవాలను కోర్టులు నిర్ణయిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఫరూఖ్ బతికున్నా, లేదా చనిపోయినా, 370 ఆర్టికల్ కోసం మన పోరాటం కొనసాగుతుంది. నన్ను ఉరితీసినా మన నిర్ణయం మారదు’ అని అన్నారు. అబ్దుల్లాపై ఈడీ విచారణ చేపట్టడం రాజకీయ వేధింపుల్లో భాగమేనని, జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలతో కొత్తగా ఏర్పడిన పీపుల్స్ అలయెన్స్ భాగస్వామ్య పక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రభుత్వంపై అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వం సహించే స్థితిలో లేదని వారు విమర్శించారు. -
గుండెపోటుతో క్రికెట్ సంఘం జిల్లా అధ్యక్షుడు మృతి
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ గుజ్జారి ప్రతాప్(54) గుండెపోటుతో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండెనొప్పితో భాదపడుతున్న ప్రతాప్‌ను ఈనెల 16న ఉదయం 5గంటలకు ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అడ్మిట్ చేసుకున్న వైద్యులు చికిత్స అందిస్తుండగా మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు మరోసారి గుండెనొప్పి వచ్చి మృతి చెందినట్లు తెలిపారు. ప్రతాప్ మృతదేహాన్ని హన్మకొండ రెడ్డికాలనీలో గల ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు. మృతుడు ప్రతాప్‌కు భార్య లక్ష్మి ప్రసన్న, కుమారుడు సిద్దార్థ, కూతురు శ్రీహిత ఉన్నారు. ప్రతాప్ అంతక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, ప్రతాప్ తల్లి ప్రమీల ఐదు రోజుల క్రితమే మృతి చెందింది. అతని తల్లి మరణించిన నాటి నుంచి మనోవేధనకు గురై గుండెపోటుతో మృతి చెందడం స్థానికులను కలిచివేసింది. ప్రముఖుల నివాళులు.. ప్రతాప్ మరణవార్త తెలుసుకున్న స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్ తదితరులు ప్రతాప్ ఇంటికి చేరుకుని పార్థీవదేహం వద్ద నివాళులర్పించారు. -
మా జీతాలు మాకివ్వండి
హెచ్‌సీఏ సిబ్బంది అభ్యర్థన సాక్షి, హైదరాబాద్: తమకు బకాయి పడిన జీతాలను ఇవ్వాలంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సిబ్బంది తమ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ శనివారం తమ సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని హెచ్‌సీఏ అధ్యక్షులు, కార్యదర్శులకు సమర్పిం చారు. జనవరి, ఫిబ్రవరి మాసాలకు చెందిన 45 రోజుల జీతాన్ని తమకు ఇంకా చెల్లించలేదని లేఖలో పేర్కొన్నారు. జీతాలతో పాటు తమకు రావాల్సిన ప్రోత్సాహకాలను ఇవ్వాలని కోరారు. 2016లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఇన్సెంటివ్స్తో పాటు, బెస్ట్ గ్రౌండ్ రివార్డు, ఇండియా–బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ బోనస్‌తో పాటు అదనపు సమయం పనిచేసినందుకు తమకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వాలని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా హెచ్‌సీఏ సరైన సమయానికి నిధులను విడుదల చేయకపోవడంతో తాము తీవ్రంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సిబ్బంది తెలిపారు. -
వివేకానంద్‌కు అర్హత ఉంది
హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని... కానీ పోటీ చేసేందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని వాటి ప్రకారం పోటీ చేయవచ్చు అని హెచ్సీఎ కార్యదర్శి బరిలో ఉన్న శేష్‌నారాయణ్ అన్నారు. ఆయన హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీపడే ముందు ఓటర్‌గా నమోదు చేసుకోలేదని గుర్తు చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీగల్ అడ్వైజర్ మసూద్ ఖాన్‌తో కలిసి మాట్లాడుతూ... వివేకానంద్‌కు కేబినెట్ ర్యాంక్ ఉంది కాని ఆయన కేబినెట్ మంత్రి కాదని, అందుకు ఆయనకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉందని తెలిపారు. మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ హెచ్సీఎను పూర్తిగా భ్రష్టుపట్టించారని... తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పూర్తి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాము తెలంగాణలోని అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎలాంటి అవినీతికి, పైరవీలకు వీలు లేకుండా నడుస్తామని హామీ ఇచ్చారు. లోధా కమిటీ సిఫార్సులు, కోర్టు పరిధిలోనే ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు హన్మంత్‌రెడ్డి, అనిల్ కుమార్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధి
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రణాళిక హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రికెటర్లను గుర్తించి వారిని తగిన విధంగా ప్రోత్సహిస్తామని తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) ప్రకటించింది. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టీసీఏ వెల్లడించింది. టీసీఏ ఏర్పాటైన తర్వాత గత రెండున్నరేళ్ల కాలంలో తాము నిర్వహించిన వివిధ టోర్నీలు, కోచింగ్ క్యాంప్‌ల వివరాలను టీసీఏ వైస్ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. ‘అత్యంత ప్రజాదరణ ఉన్న క్రికెట్లో భారత్ తరఫున ఒక్క తెలంగాణ ఆటగాడు కూడా లేకపోవడం బాధగా ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి, వివాదాలే అందుకు కారణం. హైదరాబాద్ మినహా గ్రామాలను వారు నిర్లక్ష్యం చేశారు. అందుకే ప్రతిభను వెలికి తీసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’ అని విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సత్తా ఉన్నవారు పెద్ద స్థారుుకి ఎదిగే విధంగా తమ సంఘం సహకరిస్తుందని ఆయన చెప్పా రు. బీసీసీఐ గుర్తింపు కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే తమకు గుర్తింపు లభిస్తుందని టీసీఏ అధ్యక్షుడు యెండ్ల లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు కలవల విశ్వేశ్వర్ రెడ్డి, టీసీఏ కార్యదర్శి గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'అనంత' క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలు జరుగలేదు
అనంతపురం: అనంతపురం క్రికెట్ అసోసియేషన్‌లో ఎలాంటి అక్రమాలు జరుగలేదని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మాంచూ ఫెర్రర్ తెలిపారు. కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రా క్రికెట్ సంఘం నిధులతో పాటు స్వచ్ఛంద సంస్థ నగదు కూడా వెచ్చిస్తున్నామన్నారు. త్వరలో మరో ఐదుగురు మహిళలను సభ్యులుగా తీసుకుంటామని మాంచూ ఫెర్రర్ చెప్పారు. -
ఉప్పల్ స్టేడియం సీజ్ ఖాయం!
-
నెల్సన్ (సాక్సటన్ ఓవల్)
సాక్సటన్ ఫీల్డ్ కాంప్లెక్స్‌లో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. నెల్సన్ సిటీ కౌన్సిల్, టాస్మాన్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, నెల్సన్ క్రికెట్ సంఘం సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హాకీ, సాఫ్ట్బాల్లకు కూడా ఈ స్టేడియాన్ని ఉపయోగిస్తారు. అసలు స్టాండ్స్ లేని ఈ మైదానాన్ని ఓ పార్క్‌లో రూపొందించారు. బౌండరీ బయట కూర్చుని మ్యాచ్ చూడటమే తప్ప కుర్చీలు ఉండవు. 2011లో కొత్తగా పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. మైదానంలో రెండు వైపుల స్థూపాకార రూపంలో ఉన్న బిల్డింగ్లు అదనపు ఆకర్షణ. దీని కెపాసిటీ కేవలం 5 వేలు మాత్రమే. టాస్మాన్ నది ఒడ్డున 1841లో నిర్మించిన ఈ నగరం భౌగోళికంగా న్యూజిలాండ్‌కు మధ్యలో ఉంటుంది. సుదీర్ఘమైన గోల్డెన్ బీచ్‌లు, పెద్దపెద్ద అడవులు, ఎత్తై పర్వతాలు నెల్సన్‌కు ప్రత్యేక ఆకర్షణ. -
‘ఎ’ డివిజన్ 3 డే విజేత ఆంధ్రాబ్యాంక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ప్రధాన టోర్నీ అయిన ‘ఎ’ డివిజన్ 3 రోజుల లీగ్ టైటిల్‌ను ఆంధ్రా బ్యాంక్ జట్టు గెలుచుకుంది. ఇదే లీగ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) రన్నరప్‌గా నిలిచింది. ‘ఎ’ డివిజన్ 2 రోజుల లీగ్ (ఎలైట్)లో కేంబ్రిడ్జ్ ఎలెవన్, కాంటినెంటల్ తొలి రెండు స్థానాలు దక్కించుకున్నాయి. 2013-2014 సీజన్‌కు సంబంధించి హెచ్‌సీఏ వార్షిక అవార్డుల కార్యక్రమం శనివారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగింది. ఈ ఏడాది వివిధ లీగ్‌లు, టోర్నీలలో విజేతలుగా నిలిచిన జట్లకు ఈ సందర్భంగా ట్రోఫీలు, నగదు పురస్కారాలు అందజేశారు. వీటితో పాటు వేర్వేరు విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినవారికి హెచ్‌సీఏ ప్రత్యేక బహుమతులు కూడా ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సీవీ మిలింద్ (అండర్-19 ప్రపంచకప్), స్రవంతి నాయుడు (టి20 మహిళల ప్రపంచ కప్), షంషుద్దీన్ (ఉత్తమ దేశవాళీ అంపైర్), బి. అనిరుధ్, రచనా కుమార్ (వర్ధమాన క్రికెటర్లు)లు ఈ ప్రత్యేక పురస్కారాలు సొంతం చేసుకున్నారు. విజేతల వివరాలు (2013-14 సీజన్) ‘ఎ’ డివిజన్ 3 డే లీగ్: 1. ఆంధ్రా బ్యాంక్ , 2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ‘ఎ’ డివిజన్ 2 డే లీగ్ (ఎలైట్): 1. కేంబ్రిడ్జ్ ఎలెవన్, 2. కాంటినెంటల్ ‘ఎ’ డివిజన్ 2 డే లీగ్ (పూల్ ఎ): 1. చార్మినార్ సీసీ, 2. వీనస్ సైబర్‌టెక్ ‘ఎ’ డివిజన్ 2 డే లీగ్ (పూల్ బి): 1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2. మెగా సిటీ ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ4): 1. అపెక్స్ సీసీ, 2. ఆర్కే పురమ్ సీసీ/ ఎంపీ యంగ్‌మెన్ ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ5): 1. క్లాసిక్ సీసీ, 2. అంబర్పేట్ ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ6): 1. మాంచెస్టర్, 2. తిరుమల ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ7): 1. టీమ్ కున్, 2. మయూర్ ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ8): 1. బాయ్స్టౌన్, 2. లాల్‌బహదూర్ ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ9): 1. ఎలిగెంట్, 2. గ్రీన్‌ల్యాండ్స్ ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ10): 1. హెచ్‌సీఏ అకాడమీ, 2. కల్నల్ సీకే అక్రిలిక్ ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ11): 1. టైమ్ సీసీ, 2. హైదరాబాద్ వాండరర్స్ అండర్-25 అంతర్ జిల్లా లీగ్: 1. వరంగల్, 2. నిజామాబాద్ ‘ఎ’ ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్ (పూల్ ఎ): 1. ఏపీసీఎస్, 2. ఐఏసీ/ఐఏఎఫ్/ఎంసీహెచ్ ‘ఎ’ ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్ (పూల్ బి): 1. పోస్టల్, 2. ఎన్ఎఫ్సీ నాకౌట్ టోర్నమెంట్లు సీనియర్ ‘ఎ’ డివిజన్ వన్డే: 1. ఆంధ్రా బ్యాంక్, 2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎ3 డివిజన్ వన్డే: 1. ఎస్ఏ అంబర్పేట్, 2. కాంటినెంటల్ కిషన్‌ప్రసాద్ వన్డే: 1. పోస్టల్, 2. బాయ్స్టౌన్ ఎడీ ఐబరా హెచ్‌సీఏ అండర్-19: 1. వెస్లీ జూనియర్ కాలేజ్, 2. భవాన్స్ ‘ఎ’ జూనియర్ కాలేజ్ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14: 1. ఆల్ సెయింట్స్ హైస్కూల్, 2. గౌతమ్ మోడల్ హైస్కూల్ అంతర్ జిల్లా అండర్-14 వన్డే: 1. నిజామాబాద్, 2. మెదక్ అంతర్ జిల్లా అండర్-16 వన్డే: 1. నిజామాబాద్, 2. మెదక్ అంతర్ జిల్లా అండర్-19 వన్డే: 1. నిజామాబాద్, 2. మెదక్ అంతర్ జిల్లా సీనియర్ ఉమెన్ నాకౌట్ టోర్నమెంట్: 1. ఖమ్మం, 2. నిజామాబాద్ -
ఒకటే లక్ష్యం..!
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కఠోర సాధన, క్రమశిక్షణతో పాటు క్రీడల్లో రాణించాలన్న తపన ఉన్న వారికి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. నగరంలోని డీఎస్ఏ క్రీడామైదానంలో మే నెల 1 వ తేదీ నుంచి క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఏసీఏ కోచ్‌ల పర్యవేక్షణలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అంశాలతో పాటు మానసిక, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకునేలా శిక్షణ ఇస్తున్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి, కార్యదర్శి డి. నాగేశ్వరరాజు ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే హాజరయ్యే క్రీడాకారులకు ఎలాంటి రుసుం లేకుండా శిక్షణ ఇస్తున్నారు. ఏఏ అంశాల్లో శిక్షణ.. ఏ క్రీడకైనా ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో ముఖ్యమన్న విషయం తెలిసిందే. ఇందుకోసం తొలుత శిక్షణ శిబిరాలకు హాజరయ్యే క్రీడాకారులతో తొలుత జాగింగ్ చేయిస్తారు. అనంతరం ఫిట్నెస్కోసం స్ట్రెచ్చింగ్, వార్మ్అప్గేమ్స్, స్ప్రింట్స్ తదితర వ్యాయామాలను చేయిస్తారు. అనంతరం వారు ఎన్నుకున్న రంగంలో అంటే బౌలింగ్, బ్యాటింగ్, కీపింగ్ ఇలా వేర్వేరు విభాగాల్లో సీనియర్స్, జూనియర్స్‌కు వేర్వేరుగా మెళకువలు నేర్పుతారు. ఇందులో క్రీడాకారులకు ఫార్వర్డ్ డిఫెన్స్, బ్యాక్వర్డ్ డిఫెన్స్, షాడో ప్రాక్టీస్, డ్రాప్బాల్స్, స్పాట్బౌలింగ్, లాంగ్ బ్యారియర్ ఫీల్డింగ్, మ్యాన్ టు మ్యాన్ క్యాచెస్ తదితర అంశాల్లో తర్ఫీదు ఇస్తారు. కష్టపడే తత్వం ఉండాలి.. క్రీడాకారుల్లో కష్టపడేతత్వం, క్రమశిక్షణ, రెగ్యులారిటీ ఉంటే క్రికెట్లో రాణించవచ్చు. ప్రతిరోజు సాధన చేయడం ద్వారా క్రీడాకారుల్లోని బలహీనతలను అధిగమించే అవకాశం ఉంటుంది. క్రికెట్లో తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నందున బాగా సాధన చేయడంతో పాటు ఫిట్నెస్ కూడా కాపాడుకోవడం ముఖ్యం. - ఖదీర్, ఏసీఏ లెవల్ 1 కోచ్ మంచి క్రీడాకారుల కోసం అన్వేషణ జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించేందుకు ఈ శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయి. ప్రతిభ కలిగిన ఏ ఒక్క క్రీడాకారుడు అవకాశం కోల్పోకూడదనే ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నాం. జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం అందిస్తోంది. శిబిరం తర్వాత కూడా రెగ్యులర్‌గా క్రీడాకారులు సాధనకు రావచ్చు. - ఖాజామైనుద్దీన్, శిక్షణ శిబిరం ఇన్చార్జి, ఏసీఏ లెవల్ ‘ఓ’ కోచ్ -
అంపైర్ కావడం ఎలా...
క్రికెట్‌పై ఆసక్తి ఉండి, ఆటతో అనుబంధం కొనసాగించాలనుకునేవారికి అంపైరింగ్‌ను ఒక మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. అంపైర్‌గా మారేందుకు విద్యార్హతల గురించి పెద్దగా పట్టింపు లేదు. కనీస పరిజ్ఞానం ఉంటే ముందుకు వెళ్ళవచ్చు. రాష్ట్ర స్థాయిలో... క్రికెట్ అసోసియేషన్లు (హెచ్‌సీఏ లేదా ఏసీఏ) ఏడాదిలో ఒకసారి రాష్ట్ర స్థాయి అంపైర్ల అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. సాధారణంగా సీజన్ ఆరంభానికి ముందు జూన్‌లో ఇది జరుగుతుంది. లీగ్ స్థాయి క్రికెట్ ఆడిన ఆటగాడు నేరుగా పరీక్షకు హాజరు కావచ్చు. లేదా సదరు సంఘంలోని ఏదైనా అనుబంధ క్లబ్ కార్యదర్శి లేదా జిల్లా సంఘం కార్యదర్శి సిఫారసు చేస్తే పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. ఇందు కోసం మార్కెట్లో లభించే ఎంసీసీ క్రికెట్ లా పుస్తకం చదివి సిద్ధం కావచ్చు. 50 ఆబ్జెక్టివ్ టైప్, 50 థియరీ టైపు ప్రశ్నలతో మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మార్కులను బట్టి గ్రేడింగ్ ఇస్తారు. బీసీసీఐ స్థాయిలో... రాష్ట్ర స్థాయి పరీక్షలో టాప్-10లో నిలిచినవారు బీసీసీఐ లెవెల్ 1 పరీక్షకు అర్హత సాధిస్తారు. దానిలో ఉత్తీర్ణులైతే లెవెల్ 2 పరీక్షకు హాజరు కావచ్చు. ఇందులోనూ పాస్ అయితే అండర్-16, మహిళల క్రికెట్... తదితర జూనియర్ స్థాయి టోర్నీలకు అంపైర్‌గా వ్యవహరించేందుకు బీసీసీఐ అవకాశం కల్పిస్తుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయడాన్ని ప్రొబేషనరీ పీరియడ్‌గా వ్యవహరిస్తారు. ఆయా మ్యాచ్‌ల్లో అంపైర్‌గా పని తీరు, మ్యాచ్ రిఫరీల నివేదికలను బట్టి కెరీర్లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. రెండేళ్లు ముగిసిన తర్వాత బోర్డు వైవా నిర్వహిస్తుంది. అందులో తమ సామర్థ్యం నిరూపించుకుంటే బీసీసీఐ ప్యానల్లో చోటు లభించి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు కూడా అవకాశం దక్కుతుంది. వారికీ అవకాశముంది... రాష్ట్ర స్థాయి పరీక్షలో టాప్-10లో రాకపోయినా ఇబ్బంది లేదు. వారికి స్థానిక మ్యాచ్‌లలో అంపైరింగ్‌కు అవకాశం కల్పిస్తారు. ముఖ్యంగా లీగ్‌లలో, వారాంతపు మ్యాచ్‌లలో పెద్ద సంఖ్యలో అంపైర్ల అవసరం ఉంటుంది కాబట్టి కనీస అర్హతలు ఉంటే ఎవరైనా చాన్స్ దక్కించుకోవచ్చు. లెవెల్ 1 పాసైతే బోర్డునుంచి అవకాశాలు దక్కుతాయి. లెవెల్ 2 పాసైతే పెద్ద స్థాయికి (ఐసీసీ వరకు) చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. లీగ్ స్థాయిలో అంపైర్‌కు ఒక రోజుకు కనీసం రూ. 500తో ప్రారంభమై, 750... 1,000... 1,500... ఇలా అంపైర్ గ్రేడ్‌ను బట్టి, మ్యాచ్ స్థాయిని బట్టి ఫీజును అందజేస్తారు. రంజీ ట్రోఫీ, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. -
మాస్టర్‌తో కలిసి ఆడతా: లారా
కోల్‌కతా: ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో టెస్టు మ్యాచ్ ఆడకపోవడం తన కెరీర్లో లోటు అని వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. అయితే భవిష్యత్‌లో సచిన్, గంగూలీతో కలిసి వెటరన్ మ్యాచ్ నిర్వహిస్తే ఇక్కడ ఆడేందుకు సిద్ధమని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధికారులకు తెలిపాడు. సచిన్ వీడ్కోలు సిరీస్‌ను తిలకించేందుకు క్యాబ్ ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చిన లారా ఆదివారం తన స్నేహితుడితో కలిసి 15 నిమిషాల పాటు ఈడెన్‌ను సందర్శించాడు. పిచ్, డ్రెస్సింగ్ రూమ్‌లను పరిశీలించి అక్కడే ఉన్న మైదానం సిబ్బందితో కలిసి ఫొటోలు దిగాడు. టెస్టు మ్యాచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సచిన్ మైనపు బొమ్మ పక్కన నిలబడి ఫొటోలకు ఫొజిచ్చాడు. తర్వాత ఏజేసీ బోస్ రోడ్లో ఉన్న మదర్ థెరిస్సా హౌస్‌ను సందర్శించి నివాళులు ఆర్పించాడు. -
సచిన్ పేరు తప్పు రాసిన క్యాబ్
కోల్‌కతా: సచిన్ టెండూల్కర్ 199వ టెస్టు కోసం భారీ హంగామా చేస్తున్న క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) చిన్న అక్షరంతో పెద్ద తప్పిదం చేసింది. భారత అభిమానులు దేవుడిగా భావిస్తున్న మాస్టర్ పేరును తప్పుగా రాసి అభాసుపాలైంది. ఈ తప్పిదాన్ని గుర్తించిన టీమిండియా కెప్టెన్ ధోని దీనిపై విమర్శలు గుప్పించాడు. వివరాల్లోకి వెళ్తే... హైకోర్టు ఎండ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ స్కోరు బోర్డు పక్కన ఓ భారీ స్థాయి బిల్‌బోర్డ్‌ను క్యాబ్ ఏర్పాటు చేసింది. దీనిపై జోగెన్ చౌదరీ గీసిన చిత్ర పటం కింద ట్చఛిజిజీ (సచిన్) అనే రాయడానికి బదులు ట్చఛిజిజీజీ (సచిని) అని రాసింది. దీన్ని గుర్తించిన మహీ గురువారం జరిగిన మీడియా సమావేశంలో దుమ్ముదులిపాడు. ‘సచిన్ పేరు తప్పుగా రాసింది ఎవరో ముందు చెప్పండి. ఇది చాలా పెద్ద తప్పిదం. ఇది స్టేడియం లోపల ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి ఎలా ఉంటుంది’ అని ధోని ప్రశ్నించాడు. అయితే దీనిపై క్యాబ్ భిన్నంగా స్పందించింది. తప్పిదం గురించి తమతో చెప్పాల్సిందిపోయి, దాన్ని రాద్దాంతం చేయడం తగదని వ్యాఖ్యానించింది. ఇలాంటివి పట్టించుకోవడం కెప్టెన్ పని కాదని పేర్కొంది. మ్యాచ్‌పైనే దృష్టి: ధోని సచిన్ ఫేర్వెల్ కంటే తాము మ్యాచ్‌పైనే ఎక్కువగా దృష్టిపెట్టామని ధోని వెల్లడించాడు. ‘ఇలాంటి హంగామా ఉంటుందని ముందే ఊహించాం. కాబట్టి వీటన్నింటిని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధమయ్యాం. ఒకసారి మ్యాచ్ మొదలైందంటే ఏ ఒక్కర్నీ జట్టు ఎంటర్టైన్ చేయదు. సన్నాహకాల్లోగానీ, ఇతర అంశాల్లోగానీ ఎలాంటి మార్పు లేదు. వన్డే సిరీస్‌లో ఎలా ఆడామో అలాగే ఆడతాం. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా అలాగే ఉంది. క్రికెట్ కాకుండా ఇతర ఏ అంశాలపై దృష్టిలేదు. పదేళ్ల నుంచి ఏదో అంశాన్ని గుర్తిస్తూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు సచిన్ రిటైర్మెంట్ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది’ అని ధోని పేర్కొన్నాడు. సచిన్‌కు అంకితమివ్వడానికి ఈ సిరీస్‌ను గెలుస్తామని మహీ ధీమా వ్యక్తం చేశాడు. యువకులకు నిర్దేశనం చేయడానికి అతను ఎప్పుడూ ముందుంటాడన్నాడు. మాస్టర్‌కు ఇవ్వబోయే ఫేర్‌వెల్‌ను రహస్యంగా ఉంచుతున్నామన్నాడు. ఇది బయటకు తెలియాలంటే మరో టెస్టు దాకా ఆగాల్సిందేనని చెప్పాడు. -
సచిన్‌ను ఎక్కడ ఉంచాలి!
రోహ్టక్: సచిన్ టెండూల్కర్ రంజీ మ్యాచ్ ఆడుతుండటంతో రోహ్టక్ జిల్లాలోని లాహ్లి స్టేడియంకు ఒక్కసారిగా కళ వచ్చింది. అయితే ఈ మ్యాచ్ ఆడేందుకు వచ్చే మాస్టర్‌కు ఎక్కడ వసతి ఏర్పాటు చేయాలో అర్ధం కాక హర్యానా క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధికారులు తలపట్టుకుంటున్నారు. క్రికెట్ దిగ్గజంతో పాటు సచిన్ పార్లమెంట్ సభ్యుడు కూడా. ఈ మైదానానికి సమీప పట్టణమైన రోహ్టక్లో ఫైవ్‌స్టార్ కాదు కదా కనీసం 2 స్టార్ హోటల్ కూడా లేదు. ఉన్న హోటల్లో కూడా ఎక్కడా 15కు మించి గదులు లేవు. ఇవి ముంబై జట్టు మొత్తం ఒక్కచోట ఉండటానికి సరిపోవు. అందుబాటులో ఉన్న రెండు హర్యానా ప్రభుత్వ రిసార్ట్‌లలో కూడా ఇదే పరిస్థితి. చివరకు రివోలీ అనే హోటల్ కాస్త మెరుగ్గా కనిపిస్తున్నా భద్రత సమస్యగా మారింది. హర్యానాకు చెందిన ఎంపీ దీపేందర్ హుడాకు రోహ్టక్లో ఇల్లు ఉండటంతో ఆయన సచిన్‌ను అక్కడ ఉండాలని కోరుతున్నా...జట్టుకు దూరంగా విడిగా ఉండటానికి మాస్టర్ ఇష్టపడటం లేదు. కలెక్టర్, పోలీసులు సహకారంతో త్వరగానే దీనిని పరిష్కారం కనుక్కుంటామని మాత్రం హెచ్‌సీఏ ప్రస్తుతానికి చెప్పింది. గతంలో సెహ్వాగ్ సహా చాలా మంది లాహ్లిలో క్రికెట్ ఆడారు. కానీ సచినా...మజాకా! -
బీసీసీఐ ఏజీఎం 29న
కోల్‌కతా: బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఎన్.శ్రీనివాసన్ అధ్యక్షత వ హిస్తాడా? లేదా? అనే సస్పెన్స్ తొలగింది. న్యాయపరంగా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఆయన స్వచ ఛందంగా వెనక్కి తగ్గారు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియానే కమిటీకి నేతృత్వం వహించారు. బోర్డు అధ్యక్షుడిగా ఉన్నా వర్కింగ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించలేని అరుదైన పరిస్థితి శ్రీనివాసన్ ఎదుర్కొన్నారు. అల్లుడు గురునాథ్ బెట్టింగ్ ఆరోపణల్లో ఇరుక్కోవడంతో ఆయన అధ్యక్షత బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు. ఈ సమావేశానికి ఆయన తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదా లో హాజరయ్యారు. అలాగే బోర్డు వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఈనెల 29న చెన్నైలో జరిపేందుకు నిర్ణయించారు. అంతవరకు బోర్డు రోజువారీ వ్యవహారాలు దాల్మియాకే అప్పగించారు. ఏజీఎంకు నేనే అధ్యక్షత వహిస్తా: శ్రీనివాసన్ ఈనెల 29న జరిగే వార్షిక సాధారణ సభ్య సమావేశానికి (ఏజీఎం) తానే అధ్యక్షత వహిస్తానని శ్రీనివాసన్ తేల్చి చెప్పారు. వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో ఈ విషయం తెలిపారు. ‘ఏజీఎంకు నేను అధ్యక్షత వహిస్తాను. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. అసలు సమస్యేమిటో నాకు అర్థం కావడం లేదు. నేనేమైనా తప్పు చే శానా? నాపైన ఏమైనా ఆరోపణలున్నాయా? లేక కేసులున్నాయా?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. అలాగే దక్షిణాఫ్రికా సిరీస్ రద్దవుతుందని చెప్పలేదని, కమిటీలో చర్చకు రాకపోయినా ఆ సిరీస్ ఉంటుందని తేల్చారు. చట్టబద్ధమైన బాధ్యతలు శ్రీనివాసన్‌కే.. బీసీసీఐ అధ్యక్షుడిగా ఇంకా పూర్తిస్థాయిలో విధులు చేపట్టకపోయినా బోర్డు రాజ్యాంగబద్ధ, న్యాయబద్ధమైన బాధ్యతలను శ్రీనివాసన్‌కు అప్పగిస్తూ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. అలాగే 29న జరిగే ఏజీఎంకు హాజరు కావాలని ఆయన్ని ఆహ్వానించారు. ‘ఏజీఎం వరకు బోర్డు అధ్యక్షుడికి ఉండే రాజ్యాంగబద్ధ, న్యాయబద్ధ బాధ్యతలను శ్రీనివాసన్‌కు అప్పగిస్తున్నట్టు తాత్కాలిక అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా సభ్యులకు తెలిపారు. అలాగే అధ్యక్షుడి హోదాలో బాధ్యతలు నిర్వర్తించేందుకు ఏజీఎంకు హాజరుకావాలనికమిటీ కోరింది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు. వచ్చే జనవరిలో కివీస్ పర్యటనను, జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇంగ్లండ్ పర్యటనను ఆమోదించారు. స్పాట్ ఫిక్సింగ్పై బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ చీఫ్ రవి సవానీ ఇచ్చిన నివేదికపై ఈనెల 13న బోర్డు క్రమశిక్షణ కమిటీ చర్చిస్తుంది. -
అంతఃపురం దాటిన యువ రాజులు...
యువరాజు... మహారాజు కుమారుడు. రాజు తర్వాత సింహాసనాన్ని అధిరోహించి అధికారం చేబట్టే అర్హత కలిగినవాడు. ఇతడికి రాజకీయం, యుద్ధకౌశలం తెలిసి ఉండాలి. అన్ని విద్యలలోనూ ఆరితేరి ఉండాలి. మహారాజు తర్వాత పరిపాలన బాధ్యతలు స్వీకరించి జనరంజకంగా పాలించాల్సిన బాధ్యత యువరాజుది... ఈ ఉపోద్ఘాతమంతా రాచరికాల నాటి యువరాజులకు. రాచరికాలు పోయినా రాజవంశాలైతే ఉన్నాయి. ఆ వంశాలకు చెందిన యువకులు యువరాజులే అయినప్పటికీ భిన్నమైన ఉద్యోగాల్లో, వృత్తుల్లో ఉన్నారు. అలా అంతఃపురాలు దాటిన యువరాజుల గురించి... క్రికెట్ అసోసియేషన్‌లో.... ఉత్తర భారతదేశంలోని మేవార్ రాజ్యాన్ని పాలించిన ప్రసిద్ధ పాలకుడు మహారాణా ప్రతాప్ కుటుంబానికి చెందినవాడు లక్ష్యరాజ్ సింగ్ మేవార్. రద్దయిపోయిన ఉదయ్‌పూర్ సంస్థానానికి యువరాజు లక్ష్యరాజ్. ఈ యువరాజు తన పేరు మీద ఒక వెబ్సైట్ పెట్టి తన అచీవ్‌మెంట్స్‌ను, తన పూర్వీకుల గొప్పతనాన్ని వివరించే పని పెట్టుకున్నారు. కుటుంబపరంగా వస్తున్న ఆస్తులను సంరక్షించడంతో పాటు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. నిరాడంబర జీవితం... జైపూర్ రాజవంశానికి చెందినవాడు దేవరాజ్ సింగ్. ఈ యువరాజుకు ఆనువంశికంగా వస్తున్న ఆస్తుల గురించి కోర్టుల చుట్టూరా తిరగడమే సరిపోతోంది. దేవ్‌రాజ్ సింగ్ నాయనమ్మ మహారాణి గాయత్రీదేవి నిలువెత్తు రాచరికానికి నిదర్శనం. ఆమెకు భిన్నంగా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు దేవ్‌రాజ్ సింగ్. పత్రిక ఎడిటర్... త్రిపురకు చెందిన ‘మాణిక్య’ రాజవంశం నుంచి వచ్చినవారు కిరీట్ ప్రద్యోత్ దేశ్ బర్మన్. వీరి తాతగారు మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ దేవ్ బర్మన్ తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశారు. ప్రస్తుతం ఒక వార్తా పత్రిక ఎడిటర్‌గా ఉన్నారు కిరీట్. ‘ది నార్త్ ఈస్ట్ టుడే’ అనే పత్రికను నడిపిస్తూ రాజకుటుంబ పెద్దగా తన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఈ యువరాజు. మోడలింగ్‌లో... ఒరిస్సాలోని బొలంగిర్ రాచకుటుంబం నుంచి వచ్చిన ఆర్కేష్ సింగ్ దేవ్‌కు నటన అంటే పిచ్చి. ఆనువంశికంగా వచ్చిన వాటిని వదులుకుని న్యూయార్క్‌లో యాక్టింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. తగిన అవకాశాలు లభించకపోవడంతో మోడలింగ్ చేస్తున్నాడు. బ్రిటిష్ ఇండియాలో అత్యంత ధనిక సంస్థానాల్లో బొలంగిర్ కూడా ఒకటి. అర్కేష్ తాతగారు మహారాజా రాజేంద్ర నారాయణ సింగ్ ఒరిస్సాకు తొలి ముఖ్యమంత్రి. కేంద్రమంత్రిగా... పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి. గ్వాలియర్ సంస్థానపు యువరాజు. తండ్రి మాధవ్‌రావ్ సింధియా కూడా ఎంపీగా పనిచేశారు. ఆయన మరణానంతరం జ్యోతిరాదిత్య సింధియా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష హోదా కూడా ఈయనదే.