
ప్రతాప్ పార్థివదేహం వద్ద నివాళుర్పిస్తున్న స్పీకర్ మధుసూదనాచారి
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ గుజ్జారి ప్రతాప్(54) గుండెపోటుతో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండెనొప్పితో భాదపడుతున్న ప్రతాప్‌ను ఈనెల 16న ఉదయం 5గంటలకు ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అడ్మిట్ చేసుకున్న వైద్యులు చికిత్స అందిస్తుండగా మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు మరోసారి గుండెనొప్పి వచ్చి మృతి చెందినట్లు తెలిపారు.
ప్రతాప్ మృతదేహాన్ని హన్మకొండ రెడ్డికాలనీలో గల ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు. మృతుడు ప్రతాప్‌కు భార్య లక్ష్మి ప్రసన్న, కుమారుడు సిద్దార్థ, కూతురు శ్రీహిత ఉన్నారు. ప్రతాప్ అంతక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, ప్రతాప్ తల్లి ప్రమీల ఐదు రోజుల క్రితమే మృతి చెందింది. అతని తల్లి మరణించిన నాటి నుంచి మనోవేధనకు గురై గుండెపోటుతో మృతి చెందడం స్థానికులను కలిచివేసింది.
ప్రముఖుల నివాళులు..
ప్రతాప్ మరణవార్త తెలుసుకున్న స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్ తదితరులు ప్రతాప్ ఇంటికి చేరుకుని పార్థీవదేహం వద్ద నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment