న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టు వేదిక మారనుంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పీసీఏ)కు చెందిన ఈ మైదానంలో అసంపూర్తి పనులవల్ల మ్యాచ్ వేదికను మార్చాల్సి వస్తుందని బీసీసీఐ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ధర్మశాల స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ సహా పిచ్‌పై పచ్చికను కొత్తగా పరిచారు.
పిచ్‌ను ఇంకా పరీక్షించలేదు. అక్కడక్కడ పనులు ఇంకా పూర్తవలేదు. ప్యాచ్ వర్క్ అలాగే మిగిలిపోయింది. అందువల్లే ఐదు రోజుల ఆట (టెస్టు మ్యాచ్)ను అసంపూర్ణమైన మైదానంలో నిర్వహించడం సమంజసం కాదని బీసీసీఐ భావిస్తోంది. మూడో టెస్టుకు ప్రత్యామ్నాయ వేదికలుగా వైజాగ్, బెంగళూరు, ఇండోర్, రాజ్‌కోట్‌లను బోర్డు పరిశీలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment