కోల్‌కతా: సచిన్ టెండూల్కర్ 199వ టెస్టు కోసం భారీ హంగామా చేస్తున్న క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) చిన్న అక్షరంతో పెద్ద తప్పిదం చేసింది. భారత అభిమానులు దేవుడిగా భావిస్తున్న మాస్టర్ పేరును తప్పుగా రాసి అభాసుపాలైంది. ఈ తప్పిదాన్ని గుర్తించిన టీమిండియా కెప్టెన్ ధోని దీనిపై విమర్శలు గుప్పించాడు. వివరాల్లోకి వెళ్తే... హైకోర్టు ఎండ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ స్కోరు బోర్డు పక్కన ఓ భారీ స్థాయి బిల్‌బోర్డ్‌ను క్యాబ్ ఏర్పాటు చేసింది. దీనిపై జోగెన్ చౌదరీ గీసిన చిత్ర పటం కింద ట్చఛిజిజీ (సచిన్) అనే రాయడానికి బదులు ట్చఛిజిజీజీ (సచిని) అని రాసింది.
దీన్ని గుర్తించిన మహీ గురువారం జరిగిన మీడియా సమావేశంలో దుమ్ముదులిపాడు. ‘సచిన్ పేరు తప్పుగా రాసింది ఎవరో ముందు చెప్పండి. ఇది చాలా పెద్ద తప్పిదం. ఇది స్టేడియం లోపల ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి ఎలా ఉంటుంది’ అని ధోని ప్రశ్నించాడు. అయితే దీనిపై క్యాబ్ భిన్నంగా స్పందించింది. తప్పిదం గురించి తమతో చెప్పాల్సిందిపోయి, దాన్ని రాద్దాంతం చేయడం తగదని వ్యాఖ్యానించింది. ఇలాంటివి పట్టించుకోవడం కెప్టెన్ పని కాదని పేర్కొంది.
మ్యాచ్‌పైనే దృష్టి: ధోని
సచిన్ ఫేర్‌వెల్ కంటే తాము మ్యాచ్‌పైనే ఎక్కువగా దృష్టిపెట్టామని ధోని వెల్లడించాడు. ‘ఇలాంటి హంగామా ఉంటుందని ముందే ఊహించాం. కాబట్టి వీటన్నింటిని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధమయ్యాం. ఒకసారి మ్యాచ్ మొదలైందంటే ఏ ఒక్కర్నీ జట్టు ఎంటర్‌టైన్ చేయదు. సన్నాహకాల్లోగానీ, ఇతర అంశాల్లోగానీ ఎలాంటి మార్పు లేదు. వన్డే సిరీస్‌లో ఎలా ఆడామో అలాగే ఆడతాం. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా అలాగే ఉంది. క్రికెట్ కాకుండా ఇతర ఏ అంశాలపై దృష్టిలేదు.
పదేళ్ల నుంచి ఏదో అంశాన్ని గుర్తిస్తూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు సచిన్ రిటైర్మెంట్ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది’ అని ధోని పేర్కొన్నాడు. సచిన్‌కు అంకితమివ్వడానికి ఈ సిరీస్‌ను గెలుస్తామని మహీ ధీమా వ్యక్తం చేశాడు. యువకులకు నిర్దేశనం చేయడానికి అతను ఎప్పుడూ ముందుంటాడన్నాడు. మాస్టర్‌కు ఇవ్వబోయే ఫేర్‌వెల్‌ను రహస్యంగా ఉంచుతున్నామన్నాడు. ఇది బయటకు తెలియాలంటే మరో టెస్టు దాకా ఆగాల్సిందేనని చెప్పాడు.
సచిన్ పేరు తప్పు రాసిన క్యాబ్
Published Wed, Nov 6 2013 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement
Advertisement