'సచిన్ ఫేర్వెల్ టిక్కెట్' బ్లాక్లో రూ.5వేలు | Sachin Tendulkar's farewell test match: Rs 500 tickets sold for Rs 5000 | Sakshi
Sakshi News home page

'సచిన్ ఫేర్వెల్ టిక్కెట్' బ్లాక్లో రూ.5వేలు

Published Wed, Nov 6 2013 2:29 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM

'సచిన్ ఫేర్వెల్ టిక్కెట్' బ్లాక్లో రూ.5వేలు

'సచిన్ ఫేర్వెల్ టిక్కెట్' బ్లాక్లో రూ.5వేలు

కోల్కతా : క్రికెట్‌ దేవుడి చివరి మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులు ఎక్కడలేని ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. కోల్‌కతాలో సచిన్‌ ఆడుతున్న 199వ మ్యాచ్‌ టికెట్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈ మ్యాచ్ టికెట్లు 500, 1000, 1500 రూపాయల ధరల్లో అమ్ముతున్నారు. ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియం కెపాసిటీ 67 వేలు.  అయితే  ఇది ప్రత్యేక మ్యాచ్‌ కావడంతో క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులకు టికెట్లు కేటాయించాల్సి వస్తోంది.

ఫలితంగా సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండే టికెట్లు తగ్గాయి. దాంతో అభిమానులు.. బ్లాక్‌లో 5 వేల రూపాయల దాకా కొనుగోలు చేసి మరీ మ్యాచ్‌కు వెళుతున్నారు.  ముఖ్యంగా రెండో రోజు, మూడో రోజు జరిగే మ్యాచ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఒకవేళ సచిన్‌ గనుక  అర్థ సెంచరీ....లేక సెంచురీ గానీ చేస్తే టికెట్‌ ధర బ్లాక్‌లో 5 వేలు మించిపోయే అవకాశముందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement