అంజలీ టెండూల్కర్ అలా కోరుకోలేదా?
అంజలీ టెండూల్కర్ అలా కోరుకోలేదా?
Published Thu, Nov 7 2013 11:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ కు చివరి రెండు టెస్ట్ మ్యాచ్ లు కావడంతో అభిమానులతో, మాస్టర్ కుటుంబ సభ్యుల్లోనూ ఆసక్తిని పెంచింది. మ్యాచ్ చూడటానికి వచ్చిన సచిన్ సతీమణి అంజలీ టెండూల్కర్, కుమారుడు అర్జున్ లు కోల్ కతా చేరుకున్నారు. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలిటెస్ట్ తొలి రోజు ఆటలో అంజలీ అనుకున్నట్టే అన్ని జరిగాయి.
తొలి టెస్ట్ తొలి రోజు ఆటలో టీ విరామానికి 15 నిమిషాల ముందు మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు బోర్ కొట్టే విధంగా ఉన్న సమయంలో సచిన్ కు కెప్టెన్ ధోని బంతి అందించి బౌలింగ్ కు దింపితే పెద్ద ఎత్తున్న ప్రేక్షకులకు జోష్ వస్తుంది అని అంజలి అనుకున్నారట. అంతే టీ విరామానికి ముందు ఓవర్ సచిన్ కు ధోని బంతి అందించి బౌలింగ్ చేయాలని కోరడంతో ఆనందంతో ఉప్పొంగి పోవడం అంజలితోపాటు అభిమానుల వంతైంది.
ఇక సచిన్ బౌలింగ్ చేపట్టాక అప్పటికే మంచి భాగస్వామ్యం నెలకొల్పిన ఇద్దరు ఆటగాళ్లను విడదీస్తే అద్బుతంగా ఉంటుంది అనుకుందంట. తను తలుచుకున్న కొద్ది సేపటికే సచిన్ వికెట్ పడగొట్టడంతో అంజలీ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. సచిన్ కూడా థ్రిల్లింగ్ ఫీల్ అవడంతో అభిమానుల కూడా ఆనందంలో పాలుపంచుకున్నారు.
తొలిరోజే వెస్టిండీస్ ఆలౌట్ కావడంతో భారత్ బ్యాటింగ్ చేపట్టింది. అంజలి అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంటే.. పక్కనే ఉన్న జగ్ మోహన్ దాల్మియా.. సచిన్ బ్యాటింగ్ వస్తాడా అని అడిగాడట. అందుకు సమాధానంగా సచిన్ బ్యాటింగ్ కు రాడు అని చెప్పిందట. సచిన బ్యాటింగ్ చేస్తుంటే చూడటం తన మరింత ఒత్తిడికి గురి చేస్తుందని.. అందుకే తాను ముంబై వెళ్లిపోతున్నాను అని అంజలి చెప్పింది.
అయితే రెండవ రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్ రెండు వికెట్లు కోల్పోవడం.. సచిన్ బ్యాటింగ్ రావడంతో అభిమానులు సంతోషం కలిగింది. అయితే తక్కువ స్కోరుకే సచిన్ వివాదస్పదంగా అవుట్ కావడం అందర్ని బాధించింది. నిన్నటి ఆటలో అంజలీ కోరుకున్న విధంగా జరిగింది.. నేటి ఆటలో అంజలీ స్టేడియంలో ఉండి.. సచిన్ పెద్ద స్కోరు చేయాలంటే కోరుకుంటే బాగుండని అభిమానులు అనుకుంటున్నారు. సచిన్ భారీ స్కోరు కోరుకుందా లేదా అనేది పక్కన పెడితే.. కనీసం రెండో ఇన్నింగ్స్ లోనైనా.. లేదా సొంత గడ్డ ముంబైలోనైనా భారీ స్కోరు సాధించి.. ఘనంగా సచిన్ క్రికెట్ ముగింపు పలుకాలని అంజలీతోపాటు మనం కోరుకుందాం!
Advertisement
Advertisement