Anjali Tendulkar
-
సచిన్ ఆస్తుల విలువ ఎంతంటే..?
-
సినిమా రేంజ్ లో సచిన్ - అంజలి లవ్ స్టోరీ...!
-
ప్రేమ విషయం పేరెంట్స్‌కు చెప్పలేనన్న సచిన్! అంజలి అంతటి త్యాగం చేసిందా?
Sachin- Anjali Love Story In telugu: తొలి చూపులోనే ప్రేమ.. ప్రణయంలో ఐదేళ్ల ప్రయాణం.. వయసులో ఐదేళ్ల వ్యత్యాసం... అతడు ఆమె కంటే చిన్నవాడు కావడం వల్లపెద్దల నుంచి నో అనే మాట వినాల్సి వస్తుందేమోనన్న భయం.. అతడు మొహమాటపడ్డాడు.. ఆమె బాధ్యతను తన భుజాల మీద వేసుకుంది.. మనసిచ్చిన వాడితో కలిసి జీవితాంతం నడవాలన్న కలను నెరవేర్చుకునేందుకు తనే ముందుడుగు వేసింది.. పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పింది.. వాళ్లు అర్థం చేసుకున్నారు.. ఆ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.. ఆటలో రికార్డుల రారాజే అయినా.. ఇంట్లో ప్రతి చిన్న విషయానికి తనపై ఆధారపడే భర్త కోసం ఆమె తన కెరీర్‌ను త్యాగం చేసింది.. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు.. ముచ్చటైన కుటుంబం.. అదే ఆమె ప్రపంచం.. నిజానికి ఆమె లేకుంటే అతడు లేడు.. తను క్రికెట్ దేవుడిగా ఎదగడంలో ఆమెది కూడా కీలక పాత్రే.. అలాంటి భార్యను పొందడం తన అదృష్టం అంటాడతడు.. నిజమే.. సంపన్న కుటుంబంలో పుట్టి.. ఏకైక సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెరిగి.. డాక్టర్ అయినప్పటికీ కుటుంబం కోసం బంగారం లాంటి కెరీర్‌ను పణంగా పెట్టిన ఆ మహిళ పేరు అంజలి. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సతీమణి. సచిన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా కపుల్ గోల్స్ సెట్ చేసిన అంజలి- సచిన్ ప్రేమకథ. తొలి చూపులోనే ప్రేమ 17 ఏళ్ల వయసులో 1989లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు సచిన్ టెండుల్కర్. పాకిస్తాన్ పర్యటనలో టెస్టు సిరీస్‌లో భాగంగా అరంగేట్రం చేసిన అతడు తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు.. కానీ రెండో మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరిశాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ముగించుకుని జట్టుతో పాటు భారత్‌కు పయనమయ్యాడు. స్వదేశానికి చేరుకుని స్వస్థలానికి పయనమయ్యే క్రమంలో ఎయిర్‌పోర్టులో తొలిసారి అంజలిని చూశాడు. తన తల్లిని తీసుకువెళ్లేందుకు అక్కడికి వచ్చిన అంజలి కూడా తొలి చూపులోనే ప్రేమలో పడింది. ఆమె డాక్టర్ తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరూ మరోసారి కలుసుకున్నారు. స్నేహం పెరిగి.. ప్రేమగా మారింది. అప్పుడప్పుడే క్రికెటర్‌గా ఎదుగుతున్నాడు సచిన్.. మరోవైపు అంజలి మెడిసిన్ చదువుతోంది.. ప్రేమలో ఉన్నా సచిన్ ఆటను, అంజలి చదువును నిర్లక్ష్యం చేయకుండా కెరీర్‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. చదువులో చురుకైన అంజలికి క్రికెట్ గురించి పెద్దగా తెలియదు.. అయితే, ఎప్పుడైతే సచిన్‌ను ఇష్టపడటం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆటపై కూడా ఆసక్తి పెంచుకుంది.. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలుపెట్టారు.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జర్నలిస్టు అని చెప్పు సరేనా! అంజలిని తన తల్లిదండ్రులకు పరిచయం చేయాలనుకున్న సచిన్.. ఆమెను ఓ రోజు ఇంటికి ఆహ్వానించాడు. అయితే, ఇంట్లో వాళ్లందరికీ ముందే విషయం తెలిసిపోతే బాగుండదని భావించి తనను తాను జర్నలిస్టుగా పరిచయం చేసుకోమని అంజలికి చెప్పాడు. నువ్వు ఎలా అంటే అలా! సరే అంది అంజలి. సల్వార్ కమీజ్‌లో డ్రెస్సప్ అయి సచిన్ ఇంటికి వెళ్లింది. కాబోయే అత్తామామలను పరిచయం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఫోన్ బిల్స్ కట్టలేక 1990లలో మొబైల్ ఫోన్స్ ఉనికి పెద్దగా లేదు. కాబట్టి సచిన్‌తో మాట్లాడాలంటే అంజలి ఎంతో విశాలమైన కాలేజీ క్యాంపస్ దాటి టెలిఫోన్ బూత్‌కు వెళ్లి అక్కడ నుంచి కాల్ చేసేదట. అయితే, సచిన్ తరచూ విదేశీ టూర్లకు వెళ్తున్న కారణంగా బిల్ ఎక్కువగా వస్తుందని భావించి లెటర్స్ రాయడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అంజలి స్వయంగా చెప్పింది. 1994లో నిశ్చితార్థం.. మరుసటి ఏడాది పెళ్లి తమ ప్రేమ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పేందుకు సచిన్ మొహమాట పడటంతో అంజలినే స్వయంగా వారితో మాట్లాడి ఒప్పించింది. అలా సచిన్- అంజలిల నిశ్చితార్థం 1994లో న్యూజిలాండ్ టూర్లో ఉన్న సమయంలో జరిగింది. ఆ మరుసటి ఏడాది మే 24న వీరి వివాహం జరిగింది. 1997లో తొలి సంతానంగా కుమార్తె సారా జన్మించగా, 1999లో కుమారుడు అర్జున్ జన్మించాడు. సారా మోడల్‌గా, అర్జున్ క్రికెటర్‌గా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కుటుంబం కోసం త్యాగం పిడియాట్రిషియన్గా ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం పొందిన అంజలి.. భార్యగా, డాక్టర్‌గా రెండు పడవల మీద ప్రయాణం చేయలేకపోయింది. సచిన్ తన కెరీర్లో బిజీ కావడంతో పిల్లల కోసం గృహిణిగా మారిపోయింది. ఎవరినీ ఊహించుకోలేను ‘‘సచిన్ కాకుండా నా జీవితంలో మరో వ్యక్తికి చోటు లేదు. తనని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నేను తన గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్నప్పుడైనా.. భార్యగా మారిన తర్వాతైనా మా బంధంలో ఎలాంటి మార్పు లేదు. తను కాకుండా నా జీవితంలో వేరే వ్యక్తిని అసలు ఊహించుకోలేను. తను ఆడే ప్రతి మ్యాచ్‌ను నేను తప్పకచూసేదాన్ని. స్టేడియానికి వెళ్లడం పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే ఇంట్లోనే టీవీలో తన బ్యాటింగ్ చూసేదాన్ని. మా ఇంట్లో ఇందుకోసమే ప్రత్యేకంగా ఓ టీవీ ఉంది. దాని పక్కనే గణేషుడి విగ్రహం కూడా! సచిన్ క్రీజులో ఉన్నంత సేపు అలా చూస్తూ ఉండిపోతా. ఆ సమయంలో కనీసం తినడానికి కూడా అక్కడి నుంచి కదలను. కనీసం నీళ్లు కూడా ముట్టను. ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లకు ఆన్సర్ కూడా చేయను’’ అంటూ సచిన్‌తో పాటు తన ఆటను కూడా అంతే ప్రేమిస్తానని అంజలి ఒక సందర్భంలో చెప్పింది. అంజలి గురించి ఆసక్తికర విశేషాలు ►గుజరాతీ కుటుంబంలో జన్మించిన అంజలి ముంబైలో పెరిగింది. ►అంజలి తండ్రి ఆనంద్ మెహతా గుజరాతీ పారిశ్రామికవేత్త. ఆమె తల్లి అన్నాబెల్ బ్రిటిష్ సంతతికి చెందినవారు. అప్నాలయ పేరుతో ఎన్జీవో స్థాపించారు. ►అంజలి తాతయ్య భూస్వామి. ఆమె కుటుంబానికి బ్రీచ్‌కాండీ ఏరియాలో అత్యంత విలాసమైన రెసిడెన్షియల్ బంగ్లాలు ఉన్నాయి. ►అంజలి కజిన్లలో చాలా మంది మెక్సికన్ మూలాలు ఉన్నవారు ఉన్నారు. ►అంజలి కుటుంబానికి నెహ్రూ- గాంధీ కుటుంబంతో సత్సంబంధాలు ఉండేవట. చదవండి: #HBD Sachin: సచిన్ క్రికెట్‌కి దేవుడైతే.. ఆ భక్తుడు ప్రత్యక్షం కావాల్సిందే! గతంలో ఎప్పుడూ చూడలేదు.. పర్పుల్ క్యాప్ పొందేందుకు అర్హుడు: కోహ్లి -
సచిన్ నాకు 12 ఏళ్ల పిల్లాడిలా, క్యూట్‌గా కనిపించాడు.. అందుకే వెంటపడ్డా
ముంబై: క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను తొలిసారి చూసిన మధుర క్షణాలను అతని సతీమణి అంజలి గుర్తు చేసుకున్నారు. 1990 ఇంగ్లండ్ పర్యటన అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన సచిన్‌ను మొదటిసారిగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చూశానని, అప్పటికీ సచిన్ ఎవరో తనకు తెలీదని, క్యూట్‌గా ఉండడం వల్ల అతని వెంట పడ్డానని అంజలీ వెల్లడించారు. అప్పుటికి సచిన్ వయసు 17 ఏళ్లని, అయినా తనకి 12 ఏళ్ల పిల్లాడిలా కనిపించాడని ఆమె తెలిపారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సచిన్‌తో తన తొలి పరిచయానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అంజలీ వెల్లడించారు. సచిన్‌ను తొలిసారి ఎయిర్‌పోర్ట్‌లో చూసినప్పుడు నా ఫ్రెండ్అపర్ణ నాతో ఉందని, తనే నాకు సచిన్ గురించి చెప్పిందని అంజలీ గుర్తు చేసుకున్నారు. క్రికెట్లో సచిన్ ఒక అద్భుతమని.. అతి చిన్న వయసులో సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన ఆటగాడని అపర్ణ తనతో తెలిపిందన్నారు. అప్పట్లో క్రికెట్ పట్ల తనకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, అందుకే అతడెవరైతే నాకేంటని అనుకున్నానని ఆమె నవ్వుతూ చెప్పారు. అయితే సచిన్ క్యూట్‌నెస్‌ని చూసి తాను ఫిదా అయ్యానని, అందుకే అతని వెంట పరుగెత్తానని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంలో నేను వెంటపడుతున్నానని తెలిసి సచిన్ చాలా ఇబ్బంది పడ్డాడని, కనీసం నా వైపు చూసే సాహసంకూడా చేయలేకపోయాడని చెప్పుకొచ్చారు. కాగా, 1995లో సచిన్,అంజలి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి సారా, అర్జున్అనే ఇద్దరు పిల్లలున్నారు. సచిన్ సతీమణి అంజలి వృత్తిరిత్యా డాక్టర్. ఆమె సచిన్ కంటే 5 ఏళ్లు పెద్దవారు. ప్రస్తుతం సచిన్ వయసు 48 కాగా.. అంజలికి 53. ఇదిలా ఉంటే, 1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్‌ను కొనసాగించిన సచిన్.. అంతర్జాతీయ క్రికెట్లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకాని మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్-3'కి ప్రిపేర్ అవుతున్నావా బ్రో.. -
అమ్మ వాళ్ల ఊరేదంటే..!
వీళ్లందరూ మనకు బాగా తెలిసిన వాళ్లు, మనోళ్లు. అయితే వీళ్ల నేపథ్యం మాత్రం ఆసక్తికరమైనది. ఎల్లలు లేని, మతాలు, జాతుల అంతరాలు లేని వివాహబంధాలకు ప్రతిరూపాలు వీళ్లంతా. భారతీయతతో పాటు మరో దేశం మూలాలను కూడా కలిగిన వారు వీళ్లు... వైవిధ్యమైన నేపథ్యంతో పుట్టి పెరిగారు. భిన్న రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. సన్నీ లియోన్ కురెన్జిత్ కౌర్ వొహ్రా.. ఈ పేరుతో గుర్తు పట్టడం కష్టం. ‘సన్నీ లియోన్’ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేయవచ్చు. మూలాలను బట్టి చూస్తే సన్నీ సగం భారతీయురాలు. సన్నీ తల్లి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మహిళ. తండ్రి టిబెట్ వ్యక్తి. వాళ్లిద్దరి ప్రేమకు ప్రతీక సన్నీ. వాళ్లు కెనడాలో సెటిలయ్యారు. పుట్టుకతోనే సన్నీకి ఆ దేశ పౌరసత్వం లభించింది. ఈ విధంగా సన్నీకి మూడు దేశాలతో అనుబంధం ఉంది. కత్రినాకైఫ్ ఈ బ్యూటీ పుట్టి పెరిగింది హాంకాంగ్‌లో. అప్పట్లో హాంకాంగ్ బ్రిటీష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేది. కత్రినా తండ్రి మహ్మద్ కైఫ్ కాశ్మీర్‌కు చెందిన వ్యక్తి. దశాబ్దాలకు పూర్వమే ఆయన బ్రిటన్ వెళ్లాడు. అక్కడ సుసన అనే బ్రిటీష్ మహిళను వివాహం చేసుకున్నాడు. వాళ్ల ఏడుగురి సంతానంలో కత్రినా ఒకరు. ఆ మధ్య ఒకసారి తనను ‘హాఫ్ ఇండియన్’గా చెప్పుకుంది కత్రినా. అంజలి టెండూల్కర్ అంజలి టెండూల్కర్.. పెళ్లికి ముందు అంజలి మెహతా. వృత్తిరీత్యా డాక్టర్ అయిన అంజలి గుజరాతీ కుటుంబానికి చెందిన వ్యక్తి. తండ్రి గుజరాతీ వ్యాపారవేత్త. అంజలి తల్లి మాత్రం బ్రిటిషర్. వాళ్లిద్దరిదీ ప్రేమ వివాహం. ఈ విధంగా అంజలిలో బ్రిటిష్ మూలాలున్నాయి. గుత్తాజ్వాలా బ్యాడ్మింటన్ గేమ్‌లో చైనా ఆధిపత్య స్థాయిలో ఉంటుంది. ఇప్పుడి ప్పుడే భారత్ నుంచి వస్తున్న బ్యాడ్మింటన్ ప్లేయర్లు చైనా ప్లేయర్లకు సవాలు విసరుతున్నారు. ఇలాంటి పోటీ ఉన్న రెండు దేశాల మూలాలను కలిగి బ్యాడ్మింటన్‌లోనే ప్రతిభను కనబరుస్తున్న షట్లర్ గుత్తాజ్వాలా. తండ్రి తెలుగు వ్యక్తి... తల్లి చైనా మహిళ. ఇలా భిన్నమైన మూలాలున్నాయి ఈ బ్యాడ్మింటన్ స్టార్‌కి. లీసారే నటిగా, మోడల్‌గా, సామాజిక ఉద్యమకారిణిగా గుర్తింపు ఉన్న వ్యక్తి లీసారే. ప్రస్తుతానికి కొంత ప్రభ తగ్గినా గ్లామర్ ఫీల్డ్‌లో లీసారే గుర్తుండి పోతుంది. ఈమె కూడా రెండు దేశాల మూలాలున్న, మూడు దేశాలతో అనుబంధం ఉన్న వ్యక్తి. తండ్రి బెంగాలీ హిందూ, తల్లి ఒక పోలిష్ మహిళ. కెనడాలో స్థిరపడిన ఆ ఇద్దరి గారాల పట్టి లీసారే. -
పసిపిల్లల ఆస్పత్రికి సచిన్ 10 లక్షల విరాళం
హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న పిల్లలను ఆదుకోవడానికి బాయ్ జెర్భాయ్ వాడియా ఆస్పత్రికి పది లక్షల విరాళాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం చేపట్టనున్న 'లిటిల్ హార్ట్స్ మారథాన్' కార్యక్రమం సందర్భంగా ఆస్పత్రికి పది లక్షలు విరాళాన్ని ప్రకటిస్తున్నాను అని సచిన్ తెలిపారు. హృదయ సంబంధమైన వ్యాధికి గురయ్యే పిల్లలకు అవగాహన కల్పించడానికి ముంబైలోని సిద్ధివినాయక్ ఆలయం నుంచి వాడియా ఆస్పత్రి వరకు మారథాన్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 9 తేదిన నిర్వహించనున్నారు. బాయ్ జెర్భాయ్ వాడియా పిల్లల ఆస్పత్రి కృషిని, డాక్టర్ యశ్వంత్ అంబేద్కర్ సేవలను సచిన్ కొనియాడారు. లిటిల్ హార్ట్స్ మారథాన్ కార్యక్రమం అవగాహన కల్పించడానికి, నిధుల సేకరణ కోసం చేపట్టామని సచిన్ వెల్లడించారు. తనకు తన గురువు అచ్రేకర్ ఎలానో.. భార్య అంజలికి అంబేద్కర్ కూడా గురువులాంటి వారని సచిన్ తెలిపారు. తన భార్య అంజలి డాక్టర్ రాణించడానికి అంబేద్కర్ సర్ చాలా తోడ్పాటును అందించారని సచిన్ తెలిపారు. ఈ ఆస్పత్రికి అంజలి వెంటిలేటర్ ను విరాళంగా అందించనున్నారు. ఓసారి ఈ ఆస్పత్రిని సందర్శించినపుడు ఓ అమ్మాయి వైద్య చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిందని.. అయితే డబ్బులు లేని కారణంగా ఆమె వైద్యం చేయించుకోలేకపోవడం తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని సచిన్ తెలిపారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం అమ్మాయికి డబ్బులున్నా.. వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో వ్యాధి ఉందన్నారు. వ్యాధితో బాధపడుతున్న పిల్లలను దక్కించుకోలేకపోవడం ఎంత దుర్భరమో ఓ తండ్రిగా తనకు జీర్ణించుకోలేనిదని సచిన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అంజలీ టెండూల్కర్ అలా కోరుకోలేదా?
అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ కు చివరి రెండు టెస్ట్ మ్యాచ్ లు కావడంతో అభిమానులతో, మాస్టర్ కుటుంబ సభ్యుల్లోనూ ఆసక్తిని పెంచింది. మ్యాచ్ చూడటానికి వచ్చిన సచిన్ సతీమణి అంజలీ టెండూల్కర్, కుమారుడు అర్జున్ లు కోల్ కతా చేరుకున్నారు. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలిటెస్ట్ తొలి రోజు ఆటలో అంజలీ అనుకున్నట్టే అన్ని జరిగాయి. తొలి టెస్ట్ తొలి రోజు ఆటలో టీ విరామానికి 15 నిమిషాల ముందు మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు బోర్ కొట్టే విధంగా ఉన్న సమయంలో సచిన్ కు కెప్టెన్ ధోని బంతి అందించి బౌలింగ్ కు దింపితే పెద్ద ఎత్తున్న ప్రేక్షకులకు జోష్ వస్తుంది అని అంజలి అనుకున్నారట. అంతే టీ విరామానికి ముందు ఓవర్ సచిన్ కు ధోని బంతి అందించి బౌలింగ్ చేయాలని కోరడంతో ఆనందంతో ఉప్పొంగి పోవడం అంజలితోపాటు అభిమానుల వంతైంది. ఇక సచిన్ బౌలింగ్ చేపట్టాక అప్పటికే మంచి భాగస్వామ్యం నెలకొల్పిన ఇద్దరు ఆటగాళ్లను విడదీస్తే అద్బుతంగా ఉంటుంది అనుకుందంట. తను తలుచుకున్న కొద్ది సేపటికే సచిన్ వికెట్ పడగొట్టడంతో అంజలీ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. సచిన్ కూడా థ్రిల్లింగ్ ఫీల్ అవడంతో అభిమానుల కూడా ఆనందంలో పాలుపంచుకున్నారు. తొలిరోజే వెస్టిండీస్ ఆలౌట్ కావడంతో భారత్ బ్యాటింగ్ చేపట్టింది. అంజలి అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంటే.. పక్కనే ఉన్న జగ్ మోహన్ దాల్మియా.. సచిన్ బ్యాటింగ్ వస్తాడా అని అడిగాడట. అందుకు సమాధానంగా సచిన్ బ్యాటింగ్ కు రాడు అని చెప్పిందట. సచిన బ్యాటింగ్ చేస్తుంటే చూడటం తన మరింత ఒత్తిడికి గురి చేస్తుందని.. అందుకే తాను ముంబై వెళ్లిపోతున్నాను అని అంజలి చెప్పింది. అయితే రెండవ రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్ రెండు వికెట్లు కోల్పోవడం.. సచిన్ బ్యాటింగ్ రావడంతో అభిమానులు సంతోషం కలిగింది. అయితే తక్కువ స్కోరుకే సచిన్ వివాదస్పదంగా అవుట్ కావడం అందర్ని బాధించింది. నిన్నటి ఆటలో అంజలీ కోరుకున్న విధంగా జరిగింది.. నేటి ఆటలో అంజలీ స్టేడియంలో ఉండి.. సచిన్ పెద్ద స్కోరు చేయాలంటే కోరుకుంటే బాగుండని అభిమానులు అనుకుంటున్నారు. సచిన్ భారీ స్కోరు కోరుకుందా లేదా అనేది పక్కన పెడితే.. కనీసం రెండో ఇన్నింగ్స్ లోనైనా.. లేదా సొంత గడ్డ ముంబైలోనైనా భారీ స్కోరు సాధించి.. ఘనంగా సచిన్ క్రికెట్ ముగింపు పలుకాలని అంజలీతోపాటు మనం కోరుకుందాం! -
'వెల్ కమ్ టూ మిస్టర్ అంజలీ టెండూల్కర్'
'వెల్ కమ్ టూ మిస్టర్ అంజలీ టెండూల్కర్' అదేంటి తప్పుగా రాసారా అనుకుంటున్నారా.. ఈ తప్పుకు బెంగాల్ క్రికెట్ అధికారులు ఆస్కారమిచ్చారు. ఈడెన్ గార్డెన్ లోని హోర్డింగ్ పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరును తప్పుగా రాసి అభాసుపాలైన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్).. ఈసారి మరో తప్పుకు పూనుకున్నారు. బుధవారం భారత-విండీస్ జట్ల మధ్య ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా స్కోర్ బోర్డుపై మాస్టర్ సతీమణి అంజలీ టెండూల్కర్ ను మిస్టర్ అని సంబోధించడం వివాదమైంది. ఎలక్ట్రానిక్ స్కోర్ బోర్డుపై 'వెల్ కమ్ టూ మిస్టర్ అంజలి టెండూల్కర్' అని ఫ్లాష్ కావడంతో ప్రేక్షకులతోపాటు, క్రికెట్ ఆటగాళ్లు కూడా కంగుతిన్నారు. తొలి రోజు ఆట ప్రారంభం కావడానికి ముందు సచిన్ కుటుంబాన్ని ఆహ్వానించే సమయంలో ఈ తప్పు దొర్లింది. వెస్టిండీస్ తో జరుగనున్న టెస్ట్ మ్యాచ్ కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముందు సచిన్ పేరును తప్పుగా రాసిన అధికారులపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోపల Sachin కు బదులు Sachine అని పేరును సరిగా రాయనిదెవరో ముందు చెప్పాలని స్కోర్ బోర్డును చూపిస్తూ ధోని సమావేశంలో మండిపడిన సంగతి తెలిసిందే.