'వెల్ కమ్ టూ మిస్టర్ అంజలీ టెండూల్కర్'
'వెల్ కమ్ టూ మిస్టర్ అంజలీ టెండూల్కర్'
Published Wed, Nov 6 2013 2:47 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
'వెల్ కమ్ టూ మిస్టర్ అంజలీ టెండూల్కర్' అదేంటి తప్పుగా రాసారా అనుకుంటున్నారా.. ఈ తప్పుకు బెంగాల్ క్రికెట్ అధికారులు ఆస్కారమిచ్చారు.
ఈడెన్ గార్డెన్ లోని హోర్డింగ్ పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరును తప్పుగా రాసి అభాసుపాలైన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్).. ఈసారి మరో తప్పుకు పూనుకున్నారు. బుధవారం భారత-విండీస్ జట్ల మధ్య ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా స్కోర్ బోర్డుపై మాస్టర్ సతీమణి అంజలీ టెండూల్కర్ ను మిస్టర్ అని సంబోధించడం వివాదమైంది.
ఎలక్ట్రానిక్ స్కోర్ బోర్డుపై 'వెల్ కమ్ టూ మిస్టర్ అంజలి టెండూల్కర్' అని ఫ్లాష్ కావడంతో ప్రేక్షకులతోపాటు, క్రికెట్ ఆటగాళ్లు కూడా కంగుతిన్నారు. తొలి రోజు ఆట ప్రారంభం కావడానికి ముందు సచిన్ కుటుంబాన్ని ఆహ్వానించే సమయంలో ఈ తప్పు దొర్లింది.
వెస్టిండీస్ తో జరుగనున్న టెస్ట్ మ్యాచ్ కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముందు సచిన్ పేరును తప్పుగా రాసిన అధికారులపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోపల Sachin కు బదులు Sachine అని పేరును సరిగా రాయనిదెవరో ముందు చెప్పాలని స్కోర్ బోర్డును చూపిస్తూ ధోని సమావేశంలో మండిపడిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement