Cricket Association of Bengal
-
గంగూలీ సంచలన నిర్ణయం.. క్యాబ్ అధ్యక్షుడిగా మళ్లీ!
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గంగూలీ.. ఇప్పుడు మళ్లీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాగా గతంలో 2015 నుంచి 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ పనిచేశాడు. "నేను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఆక్టోబర్ 22న నా నామినేషన్ దాఖలు చేయాలనుకుంటున్నాను. ఐదేళ్లపాటు తాను క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేశానని, లోధా నిబంధనల ప్రకారం మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. ఈ నెల 20న తన ప్యానెల్‌ను ఖరారు చేస్తానని, ఏం జరుగుతుందో చూద్దామని" పిటీఐతో దాదా పేర్కొన్నాడు. కాగా అంతకుముందు గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ కూడా క్యాబ్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup 2022: శ్రీలంకకు భారీ షాక్.. యువ బౌలర్ దూరం -
బెంగాల్ క్రికెట్లో టీమిండియా సీనియర్ పేసర్‌కు కీలక పదవి
టీమిండియా సీనియర్ బౌలర్ ఝులన్ గోస్వామి బెంగాల్ క్రికెట్లో కొత్త పదవి చేపట్టనుంది. బెంగాల్ మహిళల జట్టు ఆటగాళ్లకు మెంటార్ కమ్ ప్లేయర్‌గా వ్యవహరించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) పేర్కొంది. టీమిండియా సీనియర్ పేసర్‌గా సేవలందిస్తున్న ఝులన్ గోస్వామి బెంగాల్ వుమెన్స్ టీమ్‌లో అన్ని ఫార్మాట్లకు మెంటార్‌గా వ్యవహరిస్తుందని క్యాబ్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా పేర్కొన్నారు. గురువారం సాయంత్రంజరిగిన అధ్యక్షత సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.ఇక అండర్-16 కోచ్‌గా అరిన్దామ్ దాస్ బాధ్యతలు చేపట్టనున్నాడని.. అతనికి అసిస్టెంట్ కోచ్ ఎవరనేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. కాగా అండర్-25 కోచ్‌గా ఉన్న ప్రణబ్ రాయ్‌కు పార్థసారథి భట్టాచార్య అసిస్టెంట్‌గా వ్యవహరిస్తాడని స్పష్టం చేశాడు. ఇక అండర్-19 కోచ్‌గా ఉన్న దెవాంగ్ గాంధీకి సంజీబ్ సన్యాల్ అసిస్టెంట్‌గా ఉండనున్నాడు. 39 ఏళ్ల ఝులన్ గోస్వామి 2018లో టి20 క్రికెట్ నుంచి తప్పుకొని కేవలం వన్డేలకు పరిమితమైంది. మహిళా క్రికెట్లో వన్డే ఫార్మాట్లో 200, 250 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. 2007లో ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన ఝులన్ గోస్వామి 2008 నుంచి 2011 వరకు టీమిండియా మహిళా జట్టుకు నాయకత్వం వహించింది. ఇక ఝులన్ గోస్వామి టీమిండియా తరపున 12 టెస్టుల్లో 291 పరుగులు.. 44 వికెట్లు, 199 వన్డేల్లో 1226 పరుగులు.. 250 వికెట్లు.. 68 టి20ల్లో 405 పరుగులు.. 56 వికెట్లు పడగొట్టింది. చదవండి: Washington Sundar: సుందర్ 'నమ్మశక్యం కాని బౌలింగ్'.. నోరెళ్లబెట్టిన ప్రత్యర్థి బ్యాటర్ -
బెంగాల్ జట్టు కొత్త కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్
బెంగాల్ జట్టు కొత్త కోచ్ ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లాను బెంగాల్ జట్టు కోచ్‌గా ఎంపిక చేస్తూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్( క్యాబ్) మంగళవారం రాత్రి నిర్ణయం తీసుకుంది.బెంగాల్ జట్టు కోచ్ అరుణ్ లాల్ కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కోచ్ భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే 41 ఏళ్ల లక్ష్మీ రతన్ శుక్లా ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యారు. అలాగే బ్యాటింగ్ కోచ్‌గా వి రామన్‌ను నియమించారు. బెంగాల్ క్రికెట్ జట్టుకు విజయవంతమైన కోచ్‌గా అరుణ్ లాల్ గుర్తింపు పొందాడు. అతని పదవీకాలంలో, జట్టు 2019-20 రంజీ ట్రోఫీలో ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ మధ్యప్రదేశ్‌తో జరిగిన ఫైనల్లో బెంగాల్ జట్టు ఓడిపోయింది. అయితే గత నెల వరకు అరుణ్ లాల్ జట్టు కోచ్‌గా కొనసాగాడు. అయితే తాజాగా రెండో పెళ్లి చేసుకుని కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కొత్త కోచ్ కోసం వెతుకుతోంది. అయితే కొత్తగా ఎంపికైన లక్ష్మీరతన్ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ రావాల్సింది. కానీ ఆయన బంగ్లాదేశ్ అండర్-19 క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ తర్వాత అభిషేక్ నాయర్‌ను నియమించడంపై చర్చ జరిగింది. ఎట్టకేలకు బెంగాల్ క్రికెట్ జట్టు కోచ్‌గా లక్ష్మీ రతన్ శుక్లా నియమితులయ్యారు. లక్ష్మీ రతన్ శుక్లా భారత్ తరఫున 3 వన్డేలు ఆడి ఈసారి 18 పరుగులు చేశాడు. అలాగే 137 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 141 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు. శుక్లా బెంగాల్ అండర్-23 జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్ 47 మ్యాచ్‌లాడిన శుక్లా 405 పరుగులు చేశాడు. -
త్రిపుర జట్టుకు మెంటార్‌గా వృద్ధిమాన్ సాహా..!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా.. త్రిపుర జట్టుకు ప్లేయర్ కమ్ మెంటార్‌గా సేవలు అందించాడనికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాహా త్రిపుర క్రికెట్ అసోసియేషన్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఏడాది శ్రీలంకతో స్వదేశంతో జరిగిన టెస్టు సిరీస్‌కు సాహాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో బ్యాకప్ వికెట్ కీపర్‌గా కెఎస్ భరత్‌ను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. అప్పటి నుంచి సాహాను సెలక్టర్లు పక్కన పెట్టారు. తాజాగా ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు కూడా సాహాను ఎంపిక చేయలేదు. కాగా జట్టు నుంచి ఉద్వాసన తర్వాత ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారిస్తాని గతంలో సాహా తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడిన షా అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 317 పరుగులు చేశాడు. ఇక త్రిపుర తరపున షా ఆడాలనుకుంటే 'క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్' నుంచి ఖఛ్చితంగా నో-ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలి.ఘీపై ఈ విషయాన్ని త్రిపుర క్రికెట్ అసోసియేషన్‌తో బీసీసీఐ చర్చిస్తుంది. "వృద్ధిమాన్ సాహా త్రిపురకు ప్లేయర్-కమ్-మెంటర్‌గా వ్యవహరించాలని అనుకుంటున్నాడు. అతడు త్రిపుర అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో చర్చలు జరుపుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఇంకా ఏమీ ఖరారు కాలేదు" అని ఎన్డీటీవీతో బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం.. 9 ఏళ్ల తర్వాత..! -
హోం క్వారంటైన్లో గంగూలీ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రస్తుతం హోం క్వారంటైన్లోకి వెళ్లారు. దాదా సోదరుడు, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(సీఏబీ) జాయింట్ సెక్రటరీ స్నేహాశీష్ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. బెంగాల్ మాజీ ఫస్ట్ క్లాస్ ఆటగాడు స్నేహాశీష్ గంగూలీ చికిత్సం కోసం ప్రస్తుతం బెల్లె వి ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దాదా హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ‘స్నేహాశీష్ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ రోజు అతడికి కరోనా పాజిటివ్‌గా తెలిసింది. ప్రస్తుతం అతడు బెల్లె వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు’ అని సీఏబీ అధికారి ఒకరు తెలిపారు. ‘రిపోర్ట్స్ బుధవారం సాయంత్రం వచ్చాయి. హెల్త్ ప్రొటోకాల్స్ ప్రకారం సౌరవ్ కూడా కొద్ది రోజులు హోం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది’ అని గంగూలీ సన్నిహితుడొకరు చెప్పారు. -
క్యాబ్ హెడ్ క్వార్టర్స్ మూసివేత
కోల్‌కతా: నగరంలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఉన్న క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) హెడ్ క్వార్టర్ వారం రోజుల పాటు మూతబడనుంది. ఈడెన్ గార్డెన్‌లోని సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ సోకడంతో క్యాబ్ ఆఫీస్‌ను ఆదివారం మూసేశారు. సుమారు వారం రోజుల పాటు క్యాబ్ హెడ్ క్వార్టర్‌కు తాళాలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈడెన్ గార్డెన్లో కరోనా సోకిన వ్యక్తి తాత్కాలిక ఉద్యోగిగా తేలింది. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చందదాస్ అనే అతను తాత్కాలిక సర్వీస్‌పై పని చేయడానికి రాగా కరోనా బారిన పడినట్లు క్యాబ్ ప్రెసిడెంట్ అవిషేక్ దాల్మియా తెలిపారు. (‘గంగూలీ అంటే అసహ్యం పుట్టేది’) అతన్ని చార్నోక్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతనితో సాన్నిహిత్యంగా మెలిగిన వారిని సైతం కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. ముందు వీరంతా హోమ్ క్వారంటైన్‌కు వెళ్లగా కరోనా టెస్టులు చేయనున్నారు. మొత్తం ఆఫీస్‌ను శానిటైజ్ చేయనున్నట్లు అవిషేక్ దాల్మియా తెలిపారు. పశ్చిమ బెంగాల్లో శనివారం రికార్డు స్థాయిలో 743 కేసులు నమోదు కాగా, కోల్‌కతాలో నగరంలో 242లో కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ దాదాపు ఏడువేల కేసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నమోదయ్యాయి. (నీ బుగ్గలు ఇష్టం.. వాటిని పట్టుకోనా?) -
దాదా మరో నిర్ణయం: మోదీ, షేక్ హసీనాలకు ఆహ్వానం!
కోల్‌కతా: అన్నీ కుదిరితే భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలు ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉంది. వచ్చే నెలలో బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌లో పర్యటించనుంది. దీనిలో భాగంగా నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో ఆతిథ్యమివ్వనుంది. అయితే చారిత్రాత్మక మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్టు. దీంతో ఈ టెస్టుకు ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్న ఈ టెస్టును వీక్షించాల్సిందింగా ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనాలకు ఆహ్వానం పంపాలని క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిర్ణయించాడు. దీనిలో భాగంగా క్యాబ్ తరుపున ఇరు దేశాల ప్రధానులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక సౌరవ్ గంగూలీ క్యాబ్ అధ్యక్షుడయ్యాక వినూత్న ఆలోచనలతో ఈడెన్ గార్డెన్స్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. లార్డ్స్ మాదిరిగా ఈడెన్‌లోను గంట కొట్టి మ్యాచ్ ప్రారంభించే ఆనవాయితీని గంగూలీ ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా 2016లో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన క్యాబ్ ఆయన చేత జాతీయ గీతం పాడించింది. ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా క్యాబ్ ఆహ్వానం మేరకు మ్యాచ్‌కు హాజరయ్యాడు. చివరగా మొహాలీ వేదికగా ప్రపంచకప్-2011 సెమీఫైనల్లో భాగంగా భారత్-పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ను అప్పటి ఇరు దేశాల ప్రధానులు మన్మోహన్ సింగ్, యూసఫ్ రజా గిలానీలు ప్రత్యక్షంగా తిలకించారు. -
సీఓఏకు విజ్ఞప్తి చేసినా వినలేదు: గంగూలీ
కోల్‌కతా: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా తన నియామకం దాదాపు ఖరారైన తరుణంలో భవిష్య కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై మాజీ కెప్టెన్, క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుని రేసులో ముందంజలో ఉన్న గంగూలీ.. తన తొలి ప్రాధాన్యత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కేనంటూ స్పష్టం చేశాడు. ఫస్ట్‌క్లాస్ ఆధారంగా క్రికెటర్లను జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తే అప్పుడు మరింత బలోపేతం అవ్వడానికి ఆస్కారం ఉందన్నాడు. ఈ విషయాన్ని గతంలో క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ)కు చెప్పినా, దాన్ని పెడచెవిన పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు ప్రాధాన్యత అనేది ఒక్క రూల్. దానిపైనే ప్రధానంగా దృష్టి పెడతా. నా తొలి ప్రాముఖ్యత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకే. ఇదే విషయాన్ని సీఓఏకు విజ్ఞప్తి చేశా.. కానీ వారు పట్టించుకోలేదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రంజీ ట్రోఫీ అనేది చాలా కీలకం. ఆర్థికపరమైన ఆసక్తి ఎక్కువ ఉన్న క్రికెటర్లు జాగ్రత్తగా ఉండాలి’ అని గంగూలీ పేర్కొన్నాడు.తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా చేయడానికి బీసీసీఐ మెజారిటీ రాష్ట్ర యూనిట్లు మద్దతు తెలపడాన్ని పెద్ద బాధ్యతగా గంగూలీ పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ సంస్థ అయిన బీసీసీఐ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టానికి తాను సిద్ధంగా ఉండటమే కాకుండా, చాలా సంతోషంగా కూడా ఉన్నానని తెలిపాడు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైంది. ఢిల్లీలో శనివారం అమిత్ షాను గంగూలీ కలవడంతోనే గంగూలీ బోర్డు అధ్యక్షుడు ఖాయమని వినిపించింది. అయితే 2021 బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని షా కోరగా... గంగూలీ హామీ ఇవ్వలేదని తెలిసింది. దాంతో శ్రీనివాసన్ వర్గానికి చెందిన బ్రిజేష్ పటేల్ పేరు అధ్యక్షుడిగా తెరపైకి వచ్చింది. అయితే చివరకు ఎక్కువ సంఘాలు బ్రిజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో గంగూలీకి మార్గం సుగమమైంది. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్... బోర్డు అధ్యక్షుడిగా 2020 సెప్టెంబర్ వరకూ మాత్రమే కొనసాగగలడు. కొత్త నిబంధనల ప్రకారం అతను విరామం తీసుకోవాల్సి ఉంటుంది. -
బంతి తగిలి విలవిల్లాడిన దిండా
కోల్‌కతా: ప్రాక్టీస్ మ్యాచ్‌లో బెంగాల్ పేసర్ అశోక్ దిండా తీవ్రంగా గాయపడ్డాడు. ఈడెన్ గార్డెన్ వేదికగా బెంగాల్ జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి బౌలింగ్ చేస్తున్న దిండా తలకు బలంగా తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దిండాకు ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలించారు. వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో బెంగాల్ జట్టు ఈడెన్ గార్డెన్లో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలోనే దిండా వేసిన ఒక ఓవర్లో బెంగాల్ ఆటగాడు బిరిందర్ వివేక్ సింగ్ స్ట్రయిట్ డ్రైవ్ కొట్టాడు. ఆ బంతిని తప్పించుకునే ప్రయత్నంలో దిండా తలకు బలంగా తగిలింది. దాంతో దిండా తల పట్టుకుని మైదానంలోనే కూలిపోయాడు. అతనికి అక్కడే చికిత్స చేసిన అనంతరం ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్ చేసిన తర్వాత అతనికి ఎటువంటి ప్రమాదం లేదని తేలడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) ఊపిరిపీల్చుకుంది. అతనికి రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. -
బెంగాల్ పేసర్ అశోక్ దిండాకు తీవ్రంగా గాయాలు
-
వార్మప్ చేస్తూ యువ క్రికెటర్ మృతి
కోల్‌కతా : క్రీడా రంగంలో మరో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ గుండెపోటు రావడంతో ఓ యువ క్రికెటర్ ఆకస్మికంగా మృతి చెందాడు. ఈ విషాద ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. స్థానిక పైక్పారా స్పోర్ట్స్ క్లబ్ క్రికెటర్ అనికెత్ శర్మ (21) మంగళవారం ప్రాక్టీస్ చేస్తుండగా అనికెత్ శర్మ ఛాతీలో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు. దీంతో సహచర క్రికెటర్లు దగ్గర్లోని సిటీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. గతేడాదే క్లబ్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అనికేత్ మంచి బ్యాట్స్‌మన్, బెస్ట్ ఫీల్డర్ అని కోచ్ తెలిపారు. ఇక అనికేత్ మృతిపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) విచారం వ్యక్తం చేసింది. క్యాబ్ సెక్రటరీ అవిషేక్ దాల్మియా మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరమన్నారు. అంకిత్ మృతితో రేపు జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధకరమన్నారు. కష్టపడేతత్వం గల క్రికెటరని, భవిష్యత్‌లో గొప్ప క్రికెటర్ అవుతాడని అందరం భావించామన్నారు. అనికేత్ మరణ వార్త విని ఒక్కసారి షాక్‌కు గురయ్యాయని పైక్పారా స్పోర్ట్స్ క్లబ్ సారథి సంబ్రాన్ బెనర్జీ అన్నారు. -
ఈడెన్ గార్డెన్స్ లో గంగూలీ పేరిట స్టాండ్
కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు పెట్టనున్నారు. స్టేడియం ఉన్న ప్రాంతం ఆర్మీ ఆధీనంలో ఉండడంతో ఇన్నాళ్లూ వారి అనుమతి కోసం బెంగాల్ క్రికెట్ సంఘం ఎదురు చూడాల్సి వచ్చింది. తాజాగా లైన్ క్లియర్ కావడంతో మొత్తం ఆరు స్టాండ్లకు దాదాతో పాటు దాల్మియా, పంకజ్ రాయ్, బీఎన్ దత్, ఎఎన్ ఘోష్, స్నేహాన్షు ఆచార్య పేర్లు పెట్టనున్నారు. కెరీర్లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన సౌరవ్ గంగూలీ, భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా తనదైన ముద్ర వేశారు. -
గల్లీ క్రికెట్లో గాయపడిన గంగూలీ!
-
మళ్లీ బ్యాటు పట్టిన గంగూలీ!
కోల్‌కతా: క్రికెట్ నుంచి రిటైరయి.. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరీ తీరిక దొరికినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు గంగూలీ ఏం చేస్తాడో తెలుసా? తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి దూరిపోతాడు. సరదాగా బ్యాటు పట్టుకొని గల్లీ క్రికెట్ ఆడుతాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి దాదా రిటైరయిపోయి అప్పుడే ఎనిమిదేళ్లు అవుతోంది. అయినా గంగూలీకి క్రికెట్ అంటే మక్కువ తగ్గలేదు. అందుకే ఈడెన్ గార్డెన్స్‌లోనే కాదు తీరిక దొరికితే ఉత్తర కోల్‌కతాలోని ఇరుకు సందుల్లోనూ దాదా క్రికెట్ ఆడుతూ కనిపిస్తాడు. తాజాగా ఇలాగే గల్లీ క్రికెట్ ఆడుతూ గంగూలీ కనిపించాడు. పిల్లలతో కలిసి దాదా ఆడిన ఈ గల్లీ క్రికెట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గల్లీ క్రికెట్లోనూ గంగూలీ తన ట్రేడ్‌మార్క్ షాట్లు కొట్టాడు. ఇంతలో ఓ బాల్ దూసుకొచ్చి ఆయన భుజానికి గట్టిగా తాకింది. మామూలు టెన్నిస్ బంతి కావడంతో పెద్దగా గాయమేమీ కాలేదు. కాసేపు చేయి రాసుకొని మళ్లీ గంగూలీ క్రికెట్ కొనసాగించాడు. -
812 పరుగులతో విజయం!
కోల్‌కతా: వినడానికి విడ్డూరంగా ఉన్నా బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఇంటర్ స్కూల్ లీగ్ టోర్నీలో ఇది చోటు చేసుకుంది. మేయర్ కప్ ట్రోఫీలో భాగంగా జ్ఞాన్ భారతి విద్యాపీఠ్‌తో జరిగిన మ్యాచ్‌లో నవ నలంద హైస్కూల్ 38 ఓవర్లలో 2 వికెట్లకు 617 పరుగులు చేసింది. అయితే జ్ఞాన్ భారతి జట్టు నిర్ణీత 45 ఓవర్లు పూర్తి చేయకపోవడంతో మిగిలిన 7 ఓవర్లకు పెనాల్టీగా 227 పరుగులు విధించారు! దాంతో నలంద స్కోరు 844 పరుగులకు చేరింది. ఆ తర్వాత జ్ఞాన్ భారతి 11.3 ఓవర్లలో 32 పరుగులకే కుప్పకూలింది. -
ఫ్రెంచ్ పతాకం రంగుల్లో ఈడెన్ గార్డెన్స్
కోల్‌కతా: ఉగ్రవాదుల దాడులతో నష్టపోయిన ఫ్రాన్స్‌కు సంఘీభావంగా ఈడెన్ గార్డెన్స్ ఆ దేశ త్రివర్ణ పతాక రంగులద్దుకుంది. నీలం, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన లైట్స్‌ను ఈడెన్ ముఖద్వారంపై ప్రదర్శించారు. ఇది ఈ నెలంతా కొనసాగుతుందని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి అవిశేక్ దాల్మియా తెలిపారు. ‘దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి తెలిపేందుకు మా ప్రయత్నమిది. ప్రతీ రోజు రాత్రి 10 గంటల వరకు మూడు రంగుల విద్యుత్ వెలుగులు ప్రకాశిస్తాయి’ అని దాల్మియా చెప్పారు. -
మనోహర్‌కు గంగూలీ మద్దతు!
బోర్డు అధ్యక్ష పదవికి పేరు ప్రతిపాదించే అవకాశం కోల్‌కతా: బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పేరు దాదాపు ఖాయమైంది. ఈమేరకు ఈస్ట్‌జోన్ నుంచి తమ అభ్యర్థిగా మనోహర్ పేరును బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడి హోదాలో సౌరవ్ గంగూలీ ప్రతిపాదించనున్నారు. క్యాబ్‌తో పాటు ఎన్సీసీ, త్రిపుర, జార్ఖండ్ క్రికెట్ సంఘాలు మనోహర్‌కు పూర్తి మద్దతునిస్తున్నాయి. ముందుగా సౌరవ్ తమ క్రికెట్ సంఘం ఎస్‌జీఎంను ఏర్పాటు చేసి... ఇప్పటిదాకా ఉన్న సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేయనున్నారు. బీసీసీఐ ఏజీఎంలో పాల్గొనడానికి ముందే క్యాబ్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు. క్యాబ్ ఏజీఎం ఎప్పుడనేది అక్టోబర్ 1న ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు బీసీసీఐ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం బోర్డు ఎస్జీఎం ఎప్పుడనేది రాష్ట్ర యూనిట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం ఖాళీ అయిన అధ్యక్ష స్థానానికి ఎన్నిక కోసం 15 రోజుల్లోగా ఎస్జీఎం ఏర్పాటును వెల్లడించాలి. ఈనెల 20న దాల్మియా మరణించాడు కాబట్టి వచ్చేనెల 5 వరకు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌కు సమయం ఉంది. -
‘ఐఎస్ఎల్కు గంగూలీ దూరం కారు’
కోల్‌కతా : బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) నూతన అధ్యక్షుడిగా నియమితులైనా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)కి సౌరవ్ గంగూలీ దూరమయ్యే ప్రసక్తే లేదని అట్లెటికో డి కోల్‌కతా సహ యజమాని సంజీవ్ గోయెంకా తేల్చారు. ఈ ఫ్రాంచైజీలో గంగూలీ కూడా భాగస్వామి అనే విషయం తెలిసిందే. వచ్చే నెల 3 నుంచి ప్రారంభమయ్యే రెండో సీజన్లో దాదా పాత్ర ఉండదేమో అనే అనుమానాలను గోయెంకా తోసిపుచ్చారు. ‘గతేడాది కన్నా ఈసారి గంగూలీ ప్రాతినిథ్యం తగ్గుతుందని మీరు భావిస్తున్నారా? అట్లెటికో జట్టుకు ఆయన సేవలు ఎప్పటిలాగే అందుతాయి. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు’ అని గోయెంకా అన్నారు. కోల్‌కతా మ్యాచ్‌కు పీలే ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే అక్టోబర్ 12న భారత్‌కు రానున్నారు. మర్నాడు జరిగే అట్లెటికో డి కోల్‌కతా తొలి హోమ్ మ్యాచ్‌ను ఆయన ప్రత్యక్షంగా వీక్షిస్తారు.ఈమేరకు ఆయన వీడియో సందేశాన్ని పంపారు. ‘కోల్‌కతా తొలి హోమ్ మ్యాచ్ కోసం రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సాల్ట్‌లేక్ స్టేడియంలో అభిమానులు, ఆటగాళ్లను కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాను’ అని పీలే అన్నారు. 38 ఏళ్ల అనంతరం పీలే భారత్ వస్తుండటం విశేషం. -
క్రికెట్ కు శుభసూచకం
గంగూలీ ఎంపికపై లక్ష్మణ్ కోల్‌కతా : బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా సౌరవ్గంగూలీ నియామకం క్రికెట్ క్రీడకు శుభసూచకమని మాజీ టెస్టు ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ‘బెంగాల్ క్రికెట్ ఇప్పుడు గంగూలీ చేతుల్లో ఉంది. గత ఏడాది కాలంగా ఆయన్ని క్రీడా పరిపాలకుడిగా చూస్తున్నాను. ఇదో అద్భుత ఎంపిక. భారత క్రికెట్‌కు శుభసూచకం. తమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తారు’ అని బెంగాల్ రంజీ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న లక్ష్మణ్ తెలిపారు. -
‘క్యాబ్’ అధ్యక్షుడిగా గంగూలీ
సంయుక్త కార్యదర్శిగా అవిషేక్ దాల్మియా కోల్‌కతా: బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) కొత్త అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని నియమించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో క్యాబ్ సీనియర్ అధికారులతోపాటు రాష్ర్ట మంత్రులతో జరిగిన సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేశారు. దివంగత అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కుమారుడు అవిషేక్ దాల్మియాకు సంయుక్త కార్యదర్శి పదవి ఖరారైంది. మరో కార్యదర్శి పదవిలో సుబీర్ గంగూలీ, కోశాధికారిగా బిశ్వరూప్ డే కొనసాగుతున్నారు. గంగూలీ నియమాక నిర్ణయం పూర్తిగా క్యాబ్ అధికారులు తీసుకున్నదేనని, కేవలం దానికి తాను మద్దతిచ్చానని మమత స్పష్టం చేశారు. ‘దాల్మియా మరణం తర్వాత క్యాబ్‌లో పెద్ద లోటు ఏర్పడింది. ఎవరో ఒకరు క్యాబ్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలి. క్రికెట్ అంటే దాల్మియాకు చాలా ఆసక్తి. అందుకని ఆయనకు దగ్గరైన వ్యక్తి, క్రికెట్‌తో సంబంధం ఉన్న వారు అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని భావించాం. గంగూలీ నియామకంలో ప్రభుత్వ జోక్యం లేదు. అధికారుల నిర్ణయాన్ని సమర్థించాం. కాబట్టి మీ అందరూ కలిసికట్టుగా పని చేసి జగ్మోహన్ వారసత్వాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నా. దాదా విషయాన్ని నేను ప్రకటించాల్సింది కాదు. కానీ అందరూ విజ్ఞప్తి చేస్తే ఒప్పుకున్నా. సౌరవ్ చాలా ఏళ్లు భారత జట్టును నడిపించాడు. ఇప్పుడు మిగతా సహచరులతో కలిసి క్యాబ్‌ను తీర్చిదిద్దుతాడని భావిస్తున్నా’ అని సమావేశంలో మమతా వ్యాఖ్యానించారు. క్యాబ్ ఎన్నికలు జరిగే 2016 జూలై వరకు గంగూలీ ఈ పదవిలో కొనసాగుతారు. అవిషేక్‌కు జాక్‌పాట్ ఈ మొత్తం ఎపిసోడ్లో జూనియర్ దాల్మియా పెద్ద జాక్‌పాటే కొట్టాడు. ఎందుకంటే పరిపాలనలో ఎలాంటి అనుభవం లేకపోయినా సౌరవ్, మమత చలువతో సంయుక్త కార్యదర్శి పదవిని చేజిక్కించుకున్నాడు. ఇక బయటకు చెప్పకపోయినా అధ్యక్ష పదవిపై గంపెడాశలు పెట్టుకున్న బిశ్వరూప్, సుబీర్లు మాత్రం దాదా నియామకంతో పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయారు. ఎన్నికలు జరిగితే ఏదో రకంగా మేనేజ్ చేసుకుని క్యాబ్ పగ్గాలు చేపట్టాలని మొదట్నించి ఈ ఇద్దరు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అలాగే సచివాలయంలో ఈ ప్రకటన చేయడం, అధ్యక్ష పదవిని వివాదం చేయొద్దని సమావేశంలో మమత పదేపదే వ్యాఖ్యానించడం కూడా వీరికి మింగుడుపడటం లేదు. ఇదో కొత్త సవాలు: గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం కొత్త సవాలని గంగూలీ అన్నారు. ‘అవిషేక్ క్యాబ్లోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతనికి ఇది భావోద్వేగ సమయం. బిశ్వరూప్, సుబీర్లతో కలిసి పని చేయడంలో ఎలాంటి సమస్య లేదు. మాకు 117 సంఘాల మద్దతు ఉంది. వాళ్లతో కలిసి ముందుకెళ్తాం’ అని దాదా పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు బాధ్యతలు స్వీకరించినా వచ్చే నెల 8 నుంచి పని మొదలుపెడతానని చెప్పారు. -
మమతతో గంగూలీ భేటి
కోల్‌కతా : బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్ష పదవి చేపడతాడని వస్తున్న ఊహగానాల నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటి అయ్యారు. దివంగత అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కుమారుడు అవిషేక్‌తో కలిసి సచివాలయానికి వచ్చిన దాదా గంటపాటు సీఎంతో సమావేశమయ్యారు. అయితే సమావేశ వివరాలతో పాటు క్యాబ్ అధ్యక్ష పదవిని చేపట్టే అంశంపై మాట్లాడేందుకు గంగూలీ నిరాకరించారు. ‘దాల్మియా చనిపోయి మూడు రోజులే అయ్యింది. ఇలాంటి అంశాలపై ఇప్పుడే చర్చించడం సరైంది కాదు. అయితే ఎవరో ఒకరు మాత్రం క్యాబ్‌ను నడిపిస్తారు’ అని దాదా వ్యాఖ్యానించారు. తనకు అత్యంత ఆప్తుడిని కోల్పోయానని దాల్మియాకు నివాళులు అర్పించిన గంగూలీ... చిన్నతనం నుంచి ఆయన ముందే పెరిగానని గతాన్ని గుర్తు చేసుకున్నారు. క్యాబ్ అధ్యక్ష పీఠం దాదాకే అని కథనాలు వెలువడుతున్నా.. రేసులో చాలా మంది పెద్ద వాళ్లు బరిలో ఉన్నారు. చిత్రక్ మిత్రా, గౌతమ్ దాసుగుప్తా, టీఎంసీ సీనియర్ నాయకుడు సుబ్రతా ముఖర్జీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గంగూలీ బెంగాల్‌కు గర్వకారణమని చెప్పిన ఆ రాష్ట్ర మంత్రి ఒకరు... క్యాబ్ వ్యవహారాల్లో తమ ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. -
గంగూలీ ‘క్యాబ్’ చీఫ్ అయ్యేనా?
కోల్‌కతా : దాల్మియా మరణంతో ఇటు బీసీసీఐతో పాటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) కూడా కొత్త అధ్యక్షుడి వేటలో పడింది. ఇన్నేళ్ల పరిపాలనలో అక్కడ దాల్మియా వారసుడిగా ఎవరూ ఎదగలేకపోవడంతో పరిస్థితి సంక్లిష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా చాలా మంది భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే బాగుంటుందని భావిస్తున్నారు. అయితే ‘క్యాబ్’ సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్నా... సౌరవ్ ఇన్ని రోజులుగా పెద్దగా పరిపాలనపై దృష్టి పెట్టలేదు. అతనికి అనుభవం తక్కువ అనే అభిప్రాయం కూడా ఉంది. ఆటగాడిగా స్టార్ హోదా ఉన్నా గంగూలీని ఎంచుకోకుండా ‘క్యాబ్’లో ఇన్నేళ్లుగా పని చేస్తున్నవారినే అధ్యక్షుడిగా చేయాలనే వాదన కూడా తెరపైకి వచ్చింది. అన్నింటికి మించి రాజకీయ కారణాలతో గంగూలీపై కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది. బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు అరూప్ బిస్వాల్, సుబ్రతా ముఖర్జీ అధ్యక్ష పదవిపై కన్నేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీరికి మద్దతు ఇస్తుండటంతో ‘క్యాబ్’ అధ్యక్షుడి ఎంపిక ఆసక్తికరంగా మారింది. -
గంగూలీకే బాధ్యతలు
కోల్‌కతా : మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత జట్టు హై పెర్ఫామెన్స్ మేనేజర్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న దాదా స్వల్ప కాలిక ఒప్పందం మేరకు వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు జట్టు వెంట వెళ్లనున్నాడు. ఈ కొత్త పదవి నియమ నిబంధనల గురించి నేడు (సోమవారం) బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. సీఎల్‌టి20 స్థానంలో కొత్త టి20 ఈవెంట్‌ను ప్రవేశపెట్టేందుకు బోర్డు ఆసక్తిగా ఉంది. ఐపీఎల్ ప్లేఆఫ్‌లో ఆడిన నాలుగు జట్లతో సెప్టెంబర్‌లో యూఏఈలో టోర్నీ నిర్వహించే అవకాశాలున్నాయి. -
264 పరుగులకు రూ. 2.64 లక్షల నజరానా
కోల్ కతా: వన్డేల్లో సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నజరానా అందజేసింది. వన్డేల్లో అత్యధికంగా 264 పరుగులు చేసినందుకు అతడికి రూ. 2.64 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ఈడెన్ గార్డన్స్ లో మ్యాచ్ ముగిసిన తర్వాత అతడికి ఈ నజరానా అందజేసింది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ(264) సాధించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 153 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది రెండో ద్విశతకం. -
గంగూలీ నామినేషన్ దాఖలు
కోల్‌కతా: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇప్పుడు నేరుగా క్రికెట్ పరిపాలనా వ్యవహారాల్లో అడుగు పెట్టనున్నాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ఎన్నికల్లో అతను సంయుక్త కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి గంగూలీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశాడు. బరీషా స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శిగా ప్రస్తుతం ‘క్యాబ్’లో సౌరవ్‌కు హోదా ఉంది. అసోసియేషన్లోకి దాదా ఆగమనాన్ని అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా స్వాగతించారు. అలాంటి వ్యక్తుల అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ నెల 27న క్యాబ్ ఎన్నికలు జరగనున్నాయి. -
సచిన్ కు పశ్చిమ బెంగాల్ ఘన సన్మానం
ఈడెన్ మైదానంలో చివరి టెస్టు ఆడిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. వెస్టిండీస్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత మాస్టర్ బ్లాస్టర్‌కు ఘన సన్మానం జరిగింది. -
ఈడెన్‌లో 'టెన్'డూల్కర్ వీడ్కోలు
కోల్‌కతా: ఈడెన్ మైదానంలో చివరి టెస్టు ఆడిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. వెస్టిండీస్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత మాస్టర్ బ్లాస్టర్‌కు ఘన సన్మానం జరిగింది. సచిన్ శాలువా కప్పి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్మానించారు. ప్రత్యేక జ్ఞాపిక బహూకరించారు. బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ.. సచిన్‌కు టోపీ అలంకరించాడు. జగన్మోహన్ దాల్మియా కూడా సచిన్‌కు జ్ఞాపిక బహూకరించారు. కోల్‌కతా పోలీసుల తరపున ప్రత్యేక జ్ఞాపిక అందజేశారు. అనంతరం సచిన్ ఈడెన్ మైదానంలో తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సచిన్ కేవలం 10 పరుగులకే అవుటవడంతో నిరాశ చెందిన అభిమానులు రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ మాస్టర్ బ్యాటింగ్ చూడాలనుకున్నారు. అయితే విండీస్ ఇన్నింగ్స్ 51 తేడాతో ఓడిపోవడంతో రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం లేకపోయింది. ఈనెల 14 నుంచి జరగనున్న ముంబై టెస్టు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 200 టెస్టులో సచిన్ అలరిస్తాడని ఆశిస్తున్నారు. భారీ ఇన్నింగ్స్‌తో మాస్టర్ ముగిస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
'వెల్ కమ్ టూ మిస్టర్ అంజలీ టెండూల్కర్'
'వెల్ కమ్ టూ మిస్టర్ అంజలీ టెండూల్కర్' అదేంటి తప్పుగా రాసారా అనుకుంటున్నారా.. ఈ తప్పుకు బెంగాల్ క్రికెట్ అధికారులు ఆస్కారమిచ్చారు. ఈడెన్ గార్డెన్ లోని హోర్డింగ్ పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరును తప్పుగా రాసి అభాసుపాలైన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్).. ఈసారి మరో తప్పుకు పూనుకున్నారు. బుధవారం భారత-విండీస్ జట్ల మధ్య ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా స్కోర్ బోర్డుపై మాస్టర్ సతీమణి అంజలీ టెండూల్కర్ ను మిస్టర్ అని సంబోధించడం వివాదమైంది. ఎలక్ట్రానిక్ స్కోర్ బోర్డుపై 'వెల్ కమ్ టూ మిస్టర్ అంజలి టెండూల్కర్' అని ఫ్లాష్ కావడంతో ప్రేక్షకులతోపాటు, క్రికెట్ ఆటగాళ్లు కూడా కంగుతిన్నారు. తొలి రోజు ఆట ప్రారంభం కావడానికి ముందు సచిన్ కుటుంబాన్ని ఆహ్వానించే సమయంలో ఈ తప్పు దొర్లింది. వెస్టిండీస్ తో జరుగనున్న టెస్ట్ మ్యాచ్ కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముందు సచిన్ పేరును తప్పుగా రాసిన అధికారులపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోపల Sachin కు బదులు Sachine అని పేరును సరిగా రాయనిదెవరో ముందు చెప్పాలని స్కోర్ బోర్డును చూపిస్తూ ధోని సమావేశంలో మండిపడిన సంగతి తెలిసిందే. -
'సచిన్' పేరును తప్పుగా రాసినందుకు ధోని ఆగ్రహం!
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధికారులపై భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ కూల్ గా ఉండే ధోని ఆగ్రహించడానికి సచిన్ టెండూల్కర్ పేరు కారణమైంది. సచిన్ ఆడనున్న 199వ టెస్ట్ ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో బెంగాల్ క్రికెట్ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఈడెన్ గార్డెన్ లోని హైకోర్టు ఎండ్ లో ఉన్న ఎలక్ట్రానికి స్కోర్ బోర్డుపై సచిన్ పేరును తప్పుగా పెట్టిందెవరూ అని ధోని నిలదీశారు. వెస్టిండీస్ తో జరుగనున్న టెస్ట్ మ్యాచ్ కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముందు సచిన్ పేరును తప్పుగా రాసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోపల Sachin కు బదులు Sachine అని పేరును సరిగా రాయనిదెవరో ముందు చెప్పాలని స్కోర్ బోర్డును చూపిస్తూ సమావేశంలో మండిపడ్డారు. స్టేడియంలో చేసిన ఏర్పాట్లను చూసి సచిన్ అసంతృప్తికి గురయ్యారనే వార్తల నేపథ్యంలో బెంగాల్ అధికారుల తీరును ధోని తప్పుపట్టారు. -
కోల్ కతాలో టెండూల్కర్ కార్నివాల్ ప్రారంభం!
'సిటి ఆఫ్ జాయ్' కోల్ కతాలో మాస్టర్ బ్లాస్టర్ 'సచిన్ టెండూల్కర్' కార్నివాల్ ప్రారంభమైంది. నవంబర్ 6 నుంచి 10 వరకు జరిగే మ్యాచ్ లో సచిన్ ఈడెన్ గార్డెన్ లో చివరిసారిగా టెస్ట్ ను ఆడనున్న నేపథ్యంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ భారీ ఏర్పాట్లలో తలమునకలైంది. గౌరవ సభ్యత్వంతోపాటు, స్టేడియంలోని ఓ గ్యాలరీకి సచిన్ పేరును పెట్టేందుకు బెంగాల్ క్రికెట్ అధికారులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. కోల్ కతాలో ఎప్పుడూ మ్యాచ్ జరిగినా సచిన్ కాళీమాత ఆలయంలో పూజలు నిర్వహించే వారని అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా సచిన్ సతీమణి అంజలీకి ఓ చీరను బహుకరించేందుకు అధికారులు సిద్దమయ్యారు. అదే సమయంలో కోల్ కతా చలన చిత్రోత్సవంలో పాల్గొనే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ లను కూడా ఆహ్వనించనున్నారు.