264 పరుగులకు రూ. 2.64 లక్షల నజరానా
కోల్ కతా: వన్డేల్లో సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా బ్యాట్స్మన్ రోహిత్ శర్మకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నజరానా అందజేసింది. వన్డేల్లో అత్యధికంగా 264 పరుగులు చేసినందుకు అతడికి రూ. 2.64 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ఈడెన్ గార్డన్స్ లో మ్యాచ్ ముగిసిన తర్వాత అతడికి ఈ నజరానా అందజేసింది.
గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ(264) సాధించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 153 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది రెండో ద్విశతకం.