శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెద్ద దెబ్బ. అనుకోని విధంగా తొలి వన్డే మ్యాచ్‌లో ఘోర పరాజయం. అంతే రోహిత్‌పై వచ్చిన కామెంట్లు అన్నీ ఇన్నీ కాదు. కెప్టెన్‌గా పనికిరాడని కొందరు, ఇదేమైనా ముంబై ఇండియన్స్ టీం అనుకున్నావా అంటూ రోహిత్‌పై సటైర్లూ పడ్డాయి. అయినా రోహిత్ నోరు మెదపలేదు. డిసెంబర్ 13 రెండో వన్డే రోజు రానే వచ్చింది.
మొదటి వన్డేలో ఓడిపోయామే అన్న పగనో, కామెంట్లు ఎదుర్కోవాల్సి వచ్చిందనే కోపమో తెలీదు కానీ రోహిత్ రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దు అన్నట్లుగా డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇప్పటి వరకూ ఎవరకీ సాధ్యం కానీ, తన పేరు మీదే ఉన్న డబుల్ సెంచరీల రికార్దును తిరగరాశాడు. అయితే రోహిత్ డబుల్ సెంచరీని పొగుడ్తూ ఐసీసీ సోషల్‌మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.
అంతే రోహిత్‌ను అభినందిస్తూ 17 రోజుల్లో ఆపోస్టుకు దాదాపు 2లక్షల98 వేల లైకులు వచ్చాయి. 2017లో ఐసీసీ పెట్టిన పోస్టులన్నింటిలోకి రోహిత్ పోస్టుకే ఎక్కువ లైకులు వచ్చాయి.
A historic third ODI double century from @ImRo45 was the most liked moment of 2017 on ICC instagram with over 298,000 likes! ❤️
— ICC (@ICC) December 31, 2017
Make sure you follow for all of the best photos from the world of cricket! 🏏
➡️ https://t.co/GI2Z1V2WRP pic.twitter.com/BAfYjV4N7R
Comments
Please login to add a commentAdd a comment