![గంగూలీకే బాధ్యతలు](/styles/webp/s3/article_images/2017/09/3/51419480779_625x300_2.jpg.webp?itok=D8i-flbs)
గంగూలీకే బాధ్యతలు
కోల్‌కతా : మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత జట్టు హై పెర్ఫామెన్స్ మేనేజర్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న దాదా స్వల్ప కాలిక ఒప్పందం మేరకు వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు జట్టు వెంట వెళ్లనున్నాడు.
ఈ కొత్త పదవి నియమ నిబంధనల గురించి నేడు (సోమవారం) బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. సీఎల్‌టి20 స్థానంలో కొత్త టి20 ఈవెంట్‌ను ప్రవేశపెట్టేందుకు బోర్డు ఆసక్తిగా ఉంది. ఐపీఎల్ ప్లేఆఫ్‌లో ఆడిన నాలుగు జట్లతో సెప్టెంబర్‌లో యూఏఈలో టోర్నీ నిర్వహించే అవకాశాలున్నాయి.