టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గంగూలీ.. ఇప్పుడు మళ్లీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాగా గతంలో 2015 నుంచి 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ పనిచేశాడు.
"నేను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఆక్టోబర్ 22న నా నామినేషన్ దాఖలు చేయాలనుకుంటున్నాను. ఐదేళ్లపాటు తాను క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేశానని, లోధా నిబంధనల ప్రకారం మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగవచ్చు.
ఈ నెల 20న తన ప్యానెల్‌ను ఖరారు చేస్తానని, ఏం జరుగుతుందో చూద్దామని" పిటీఐతో దాదా పేర్కొన్నాడు. కాగా అంతకుముందు గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ కూడా క్యాబ్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించిన సంగతి తెలిసిందే.
చదవండి: T20 World Cup 2022: శ్రీలంకకు భారీ షాక్.. యువ బౌలర్ దూరం
Comments
Please login to add a commentAdd a comment