ఫ్రెంచ్ పతాకం రంగుల్లో ఈడెన్ గార్డెన్స్ | Eden Gardens lit up in colours of French flag | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్ పతాకం రంగుల్లో ఈడెన్ గార్డెన్స్

Published Mon, Nov 23 2015 3:47 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

ఫ్రెంచ్ పతాకం రంగుల్లో ఈడెన్ గార్డెన్స్

ఫ్రెంచ్ పతాకం రంగుల్లో ఈడెన్ గార్డెన్స్

కోల్‌కతా: ఉగ్రవాదుల దాడులతో నష్టపోయిన ఫ్రాన్స్‌కు సంఘీభావంగా ఈడెన్ గార్డెన్స్ ఆ దేశ త్రివర్ణ పతాక రంగులద్దుకుంది. నీలం, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన లైట్స్‌ను ఈడెన్ ముఖద్వారంపై ప్రదర్శించారు. ఇది ఈ నెలంతా కొనసాగుతుందని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి అవిశేక్ దాల్మియా తెలిపారు. ‘దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి తెలిపేందుకు మా ప్రయత్నమిది. ప్రతీ రోజు రాత్రి 10 గంటల వరకు మూడు రంగుల విద్యుత్ వెలుగులు ప్రకాశిస్తాయి’ అని దాల్మియా చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement