ఈడెన్లో 'టెన్'డూల్కర్ వీడ్కోలు
కోల్కతా: ఈడెన్ మైదానంలో చివరి టెస్టు ఆడిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. వెస్టిండీస్తో తొలి టెస్టు ముగిసిన తర్వాత మాస్టర్ బ్లాస్టర్కు ఘన సన్మానం జరిగింది. సచిన్ శాలువా కప్పి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్మానించారు. ప్రత్యేక జ్ఞాపిక బహూకరించారు. బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ.. సచిన్కు టోపీ అలంకరించాడు. జగన్మోహన్ దాల్మియా కూడా సచిన్కు జ్ఞాపిక బహూకరించారు. కోల్కతా పోలీసుల తరపున ప్రత్యేక జ్ఞాపిక అందజేశారు.
అనంతరం సచిన్ ఈడెన్ మైదానంలో తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో సచిన్ కేవలం 10 పరుగులకే అవుటవడంతో నిరాశ చెందిన అభిమానులు రెండో ఇన్నింగ్స్లో మళ్లీ మాస్టర్ బ్యాటింగ్ చూడాలనుకున్నారు. అయితే విండీస్ ఇన్నింగ్స్ 51 తేడాతో ఓడిపోవడంతో రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం లేకపోయింది. ఈనెల 14 నుంచి జరగనున్న ముంబై టెస్టు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 200 టెస్టులో సచిన్ అలరిస్తాడని ఆశిస్తున్నారు. భారీ ఇన్నింగ్స్తో మాస్టర్ ముగిస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.