'సచిన్' పేరును తప్పుగా రాసినందుకు ధోని ఆగ్రహం!
'సచిన్' పేరును తప్పుగా రాసినందుకు ధోని ఆగ్రహం!
Published Tue, Nov 5 2013 3:18 PM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధికారులపై భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ కూల్ గా ఉండే ధోని ఆగ్రహించడానికి సచిన్ టెండూల్కర్ పేరు కారణమైంది. సచిన్ ఆడనున్న 199వ టెస్ట్ ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో బెంగాల్ క్రికెట్ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఈడెన్ గార్డెన్ లోని హైకోర్టు ఎండ్ లో ఉన్న ఎలక్ట్రానికి స్కోర్ బోర్డుపై సచిన్ పేరును తప్పుగా పెట్టిందెవరూ అని ధోని నిలదీశారు.
వెస్టిండీస్ తో జరుగనున్న టెస్ట్ మ్యాచ్ కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముందు సచిన్ పేరును తప్పుగా రాసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోపల Sachin కు బదులు Sachine అని పేరును సరిగా రాయనిదెవరో ముందు చెప్పాలని స్కోర్ బోర్డును చూపిస్తూ సమావేశంలో మండిపడ్డారు. స్టేడియంలో చేసిన ఏర్పాట్లను చూసి సచిన్ అసంతృప్తికి గురయ్యారనే వార్తల నేపథ్యంలో బెంగాల్ అధికారుల తీరును ధోని తప్పుపట్టారు.
Advertisement
Advertisement