హోం క్వారంటైన్‌లో గంగూలీ | Sourav Ganguly in Home Quarantine Brother Tests Positive Covid19 | Sakshi
Sakshi News home page

సోదరుడికి కరోనా‌.. క్వారంటైన్‌లోకి వెళ్లిన దాదా

Published Thu, Jul 16 2020 10:26 AM | Last Updated on Thu, Jul 16 2020 10:31 AM

Sourav Ganguly in Home Quarantine Brother Tests Positive Covid19 - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. దాదా సోదరుడు, క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(సీఏబీ) జాయింట్‌ సెక్రటరీ స్నేహాశీష్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. బెంగాల్ మాజీ ఫస్ట్ క్లాస్ ఆటగాడు స్నేహాశీష్‌ గంగూలీ చికిత్సం కోసం ప్రస్తుతం బెల్లె వి ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దాదా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.

‘స్నేహాశీష్‌ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ రోజు అతడికి కరోనా పాజిటివ్‌గా తెలిసింది. ప్రస్తుతం అతడు బెల్లె వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు’ అని సీఏబీ అధికారి ఒకరు తెలిపారు. ‘రిపోర్ట్స్‌ బుధవారం సాయంత్రం వచ్చాయి. హెల్త్‌ ప్రొటోకాల్స్‌ ప్రకారం సౌరవ్‌‌ కూడా కొద్ది రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది’ అని గంగూలీ సన్నిహితుడొకరు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement