కోల్‌కతా: వినడానికి విడ్డూరంగా ఉన్నా బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఇంటర్ స్కూల్ లీగ్ టోర్నీలో ఇది చోటు చేసుకుంది. మేయర్ కప్ ట్రోఫీలో భాగంగా జ్ఞాన్ భారతి విద్యాపీఠ్‌తో జరిగిన మ్యాచ్‌లో నవ నలంద హైస్కూల్ 38 ఓవర్లలో 2 వికెట్లకు 617 పరుగులు చేసింది. అయితే జ్ఞాన్ భారతి జట్టు నిర్ణీత 45 ఓవర్లు పూర్తి చేయకపోవడంతో మిగిలిన 7 ఓవర్లకు పెనాల్టీగా 227 పరుగులు విధించారు! దాంతో నలంద స్కోరు 844 పరుగులకు చేరింది. ఆ తర్వాత జ్ఞాన్ భారతి 11.3 ఓవర్లలో 32 పరుగులకే కుప్పకూలింది.