కోల్ కతాలో టెండూల్కర్ కార్నివాల్ ప్రారంభం! | 'Sachin Tendulkar Carnival' starts in Kolkata | Sakshi
Sakshi News home page

కోల్ కతాలో టెండూల్కర్ కార్నివాల్ ప్రారంభం!

Published Sun, Nov 3 2013 8:23 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

కోల్ కతాలో టెండూల్కర్ కార్నివాల్ ప్రారంభం!

కోల్ కతాలో టెండూల్కర్ కార్నివాల్ ప్రారంభం!

'సిటి ఆఫ్ జాయ్' కోల్ కతాలో మాస్టర్ బ్లాస్టర్ 'సచిన్ టెండూల్కర్' కార్నివాల్ ప్రారంభమైంది. నవంబర్ 6 నుంచి 10 వరకు  జరిగే మ్యాచ్ లో సచిన్ ఈడెన్ గార్డెన్ లో చివరిసారిగా టెస్ట్ ను ఆడనున్న నేపథ్యంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ భారీ ఏర్పాట్లలో తలమునకలైంది. 
 
గౌరవ సభ్యత్వంతోపాటు, స్టేడియంలోని ఓ గ్యాలరీకి సచిన్ పేరును పెట్టేందుకు బెంగాల్ క్రికెట్ అధికారులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. కోల్ కతాలో ఎప్పుడూ మ్యాచ్ జరిగినా సచిన్ కాళీమాత ఆలయంలో పూజలు నిర్వహించే వారని అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా సచిన్ సతీమణి అంజలీకి ఓ చీరను బహుకరించేందుకు అధికారులు సిద్దమయ్యారు. 
 
అదే సమయంలో కోల్ కతా చలన చిత్రోత్సవంలో పాల్గొనే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ లను కూడా ఆహ్వనించనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement