గంగూలీ నామినేషన్ దాఖలు | Club files Sourav Ganguly nomination as CAB joint secretary | Sakshi
Sakshi News home page

గంగూలీ నామినేషన్ దాఖలు

Published Sat, Jul 19 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

గంగూలీ నామినేషన్ దాఖలు

గంగూలీ నామినేషన్ దాఖలు

కోల్‌కతా: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇప్పుడు నేరుగా క్రికెట్ పరిపాలనా వ్యవహారాల్లో  అడుగు పెట్టనున్నాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ఎన్నికల్లో అతను సంయుక్త కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నాడు.
 
 ఇందుకు  సంబంధించి గంగూలీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశాడు.  బరీషా స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శిగా ప్రస్తుతం ‘క్యాబ్’లో సౌరవ్‌కు హోదా ఉంది. అసోసియేషన్‌లోకి దాదా ఆగమనాన్ని అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా స్వాగతించారు. అలాంటి వ్యక్తుల అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ నెల 27న క్యాబ్ ఎన్నికలు జరగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement