నిరాశ పరిచిన సచిన్
కోల్ కతా క్రికెట్ అభిమానులతోపాటు, ప్రపంచ క్రికెట్ అభిమానులను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిరాశ పరిచారు. 57 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోవడంతో సచిన్ ఆటను చూడవచ్చన్న ఆనందంలో క్రికెట్ అభిమానులు మునిగిపోయారు. అయితే భారీ స్కోరుతో సచిన్ ఆలరిస్తారని ఊహించిన అభిమానులు.. సచిన్ తక్కువ స్కోరుకే అవుట్ కావడం దిగ్భ్రాంతికి గురి చేసింది. పూర్తి స్థాయిలో క్రికెట్ అభిమానులు స్టేడియంలోకి రాక ముందే సచిన్ అవుట్ కావడం నిరాశకు గురిచేసింది.
24 బంతులు ఆడిన సచిన్ రెండు ఫోర్లతో 10 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. నిజానికి అది వివాదాస్పద ఎల్బీడబ్ల్యూ నిర్ణయం. బౌలర్ షిల్లింగ్‌ఫోర్డ్ వేసిన బంతి చాలా ఎత్తులో సచిన్ వెనకాల తొడకు తగిలింది. బాల్ పయనిస్తున్న దృశ్యం సైడ్ యాంగిల్‌లో చూస్తే స్టంప్స్‌పై నుండి వెళ్లేదని తెలుస్తోంది. అందుకే సచిన్ అసంతృప్తితో ముఖం అడ్డంగా ఆడిస్తూ పెవిలియన్ దారి పట్టాడు.
సచిన్‌కు ముందు చటేశ్వర పూజారా, సచిన్ తర్వాత యువ సంచలనం విరాట్ కోహ్లి మూడు పరుగలకే ఔటయ్యాడు. దాంతో 87 పరుగులకే ఇండియా సగం టీమ్‌ను కోల్పోయింది. భారత్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం కెప్టెన్ ధోని, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు.