ముంబై: భారత్‌లో తొలి సారి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించాలన్న బీసీసీఐ ఆలోచనను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వాగతించాడు. అయితే కోల్‌కతాలో సాయంత్రం వేళ మంచు ప్రభావం లేకపోతేనే టెస్టు విజయవంతం అవుతుందని అతను అభిప్రాయ పడ్డాడు. ‘మంచు వల్ల ఒక్కసారి బంతి తడిగా మారిపోతే పేసర్లు ఏమీ చేయలేరు. స్పిన్నర్ల పరిస్థితి అలాగే ఉంటుంది. బ్యాట్స్‌మెన్ చెలరేగిపోతే బౌలర్లకు పరీక్ష ఎదురవుతుంది. వాతావరణ పరిస్థితులు మ్యాచ్ గతిని మార్చరాదు. భారత క్రికెటర్లు ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. గతంలో పింక్ బాల్‌తో ఆడిన సహచరుల అనుభవాలను తెలుసుకుంటే మంచిది’ అని సచిన్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment