day night test match
-
ఆసీస్ భారీ విజయం
పెర్త్: స్వదేశంలో డే నైట్ టెస్టుల్లో అజేయ రికార్డును కొనసాగిస్తూ ఆస్ట్రేలియా జట్టు మరో విజయం నమోదు చేసింది. న్యూజిలాండ్‌తో నాలుగో రోజే ముగిసిన డే నైట్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. దాంతో ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు జరిగిన ఏడు డే నైట్ టెస్టుల్లో ఆసీస్‌నే విజయం వరించింది. 468 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 65.3 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టార్క్ (4/45), లయన్ (4/63), కమిన్స్ (2/31) న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 167/6తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా 9 వికెట్లకు 217 పరుగులవద్ద డిక్లేర్ చేసి న్యూజిలాండ్‌కు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యం సంపాదించింది. రెండో టెస్టు ఈనెల 26న మెల్బోర్న్లో మొదలవుతుంది. -
లబ్ షేన్ హ్యాట్రిక్ శతకం
పెర్త్: ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న ఆ్రస్టేలియా ఆటగాడు లబ్ షేన్ (202 బంతుల్లో 110 బ్యాటింగ్; 14 ఫోర్లు, సిక్స్) వరుసగా మూడో టెస్టులో శతకం బాదాడు. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ సెంచరీలు చేసిన లబ్‌షేన్... న్యూజిలాండ్‌తో గురువారం ఇక్కడ ఆరంభమైన డే నైట్ టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. లబ్‌షేన్ మెరిపించడంతో కివీస్‌తో టెస్టులో ఆసీస్ భారీ స్కోరుపై కన్నేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఆ్రస్టేలియా ఓపెనర్ బర్న్స్ (9) విఫలమయ్యాడు. వార్నర్ (43; 4 ఫోర్లు), స్మిత్ (43; 4 ఫోర్లు) రాణించారు. సాన్‌ట్నర్ వేసిన 74వ ఓవర్ రెండో బంతిని లాంగాన్ మీదుగా సిక్సర్ కొట్టిన లబ్‌షేన్ తన కెరీర్లో మూడో శతకాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం లబ్షేన్తోపాటు హెడ్ (20 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. -
పింక్‌బాల్.. అడిలైడ్ టూ కోల్‌కతా
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం టీమిండియా- బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే రెండో టెస్టుపైనే దృష్టిని కేంద్రీకరించింది.ఎందుకంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదటిసారి పింక్‌బాల్‌తో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు అభిమానులతో పాటు ఇరుదేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 22న ప్రారంభం కానున్న డే- నైట్ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్జెన్స్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.పింక్ బాల్‌కు సంబంధించి మొదటి డై నైట్ టెస్టు మ్యాచ్ 2015లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మధ్య అడిలైడ్‌లో జరిగింది. దీంతో అడిలైడ్‌లో మొదలైన పింక్ బాల్ కథ ఇప్పుడు కోల్‌కతాకి చేరింది. అయితే ఇది ఇండియాలోకి అడుగుపెట్టడానికి మాత్రం నాలుగేళ్లు పట్టింది. అయితే ఐసీసీ 2015లోనే డై నైట్ టెస్టులకు అనుమతినిచ్చినా బీసీసీఐ, టీమిండియా వ్యతిరేకించడంతో ఉపఖండంలో పింక్ బాల్ కల నెరవేరలేదు. తాజాగా సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడంతో మరోసారి డే నైట్ టెస్టు ప్రతిపాదన ముందుకు వచ్చింది. కాగా కోహ్లి- గంగూలీ కలిసిన మొదటి భేటీలోనే గంగూలీ డే నైట్ టెస్టును ప్రతిపాదించడం, కోహ్లి అందుకు ఒప్పుకోవడం చకచకా జరిగిపోయింది. అడిలైడ్ టు కోల్‌కతా ఇప్పటివరకు టెస్టు చరిత్రలో 11 డే నైట్ టెస్టులు జరగగా ఆస్ట్రేలియా అత్యధికంగా 5 డే నైట్ టెస్టులు ఆడింది. తర్వాతి స్థానాల్లో శ్రీలంక(3), వెస్టిండీస్(3), శ్రీలంక (3), ఇంగ్లండ్ (3), పాకిస్తాన్(2), దక్షిణాఫ్రికా ( 2), జింబాబ్వే(1)ఘాడాయి. తాజాగా ఇప్పుడు 12వ డే పైట్ టెస్టు టీమిండియా, బంగ్లాదేశ్‌ల మధ్య జరగనుంది. కాగా, 11 డే నైట్ టెస్టులు జరిగిన వేదికలను ఒకసారి చూస్తే.. అడిలైడ్ , దుబాయ్, అడిలైడ్ , బ్రిస్బేన్, బర్మింగ్ హమ్,దుబాయ్, అడిలైడ్, పోర్ట్ ఎలిజెబెత్(సెంట్ జార్జ్ పార్క్), ఆక్లాండ్, బ్రిడ్జ్‌టౌన్, బ్రిస్బేన్ నగరాలు ఆతిథ్యమిచ్చాయి. ఇప్పుడు 12వ డే నైట్ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా మ్యాచ్‌కు సంబంధించి పలు విశేషాలు ఉన్నాయి. మ్యాచ్‌లో టాస్కు ముందు ఆర్మీ బలగాలు పారాట్రూపర్స్‌లో వచ్చి ఇరు కెప్టెన్లకు రెండు పింక్ బాల్స్‌ను అందజేయనున్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలిసి ఈడెన్గార్డెన్లోని సంప్రదాయ బెల్‌ను మోగించి మ్యాచ్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మ్యాచ్‌కు తరలిరానున్న సచిన్ టెండూల్కర్, ఒలింపియన్ అభినవ్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, 6 సార్లు మహిళల బాక్సింగ్ చాంపియన్ మేరీకోమ్‌లను ఘనంగా సత్కరించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) సెక్రటరీ అవిషేక్ దాల్మియా తెలిపారు. -
‘మంచు’ లేకుంటే బాగుంటుంది!
ముంబై: భారత్‌లో తొలి సారి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించాలన్న బీసీసీఐ ఆలోచనను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వాగతించాడు. అయితే కోల్‌కతాలో సాయంత్రం వేళ మంచు ప్రభావం లేకపోతేనే టెస్టు విజయవంతం అవుతుందని అతను అభిప్రాయ పడ్డాడు. ‘మంచు వల్ల ఒక్కసారి బంతి తడిగా మారిపోతే పేసర్లు ఏమీ చేయలేరు. స్పిన్నర్ల పరిస్థితి అలాగే ఉంటుంది. బ్యాట్స్‌మెన్ చెలరేగిపోతే బౌలర్లకు పరీక్ష ఎదురవుతుంది. వాతావరణ పరిస్థితులు మ్యాచ్ గతిని మార్చరాదు. భారత క్రికెటర్లు ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. గతంలో పింక్ బాల్‌తో ఆడిన సహచరుల అనుభవాలను తెలుసుకుంటే మంచిది’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. -
విజయం దిశగా ఆస్ట్రేలియా
అడిలైడ్: తొలిసారి ప్రయోగాత్మకంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న డేనైట్ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసే అవకాశం కన్పిస్తోంది. 116/5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 208 పరుగులకు ఆలౌటయింది. హాజిల్‌వుడ్ 6 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ కు కివీస్ 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకెళుతోంది. 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 202, ఆస్ట్రేలియా 224 పరుగులు సాధించాయి.