పెర్త్: స్వదేశంలో డే నైట్ టెస్టుల్లో అజేయ రికార్డును కొనసాగిస్తూ ఆస్ట్రేలియా జట్టు మరో విజయం నమోదు చేసింది. న్యూజిలాండ్‌తో నాలుగో రోజే ముగిసిన డే నైట్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. దాంతో ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు జరిగిన ఏడు డే నైట్ టెస్టుల్లో ఆసీస్‌నే విజయం వరించింది. 468 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 65.3 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టార్క్ (4/45), లయన్ (4/63), కమిన్స్ (2/31) న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 167/6తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా 9 వికెట్లకు 217 పరుగులవద్ద డిక్లేర్ చేసి న్యూజిలాండ్‌కు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యం సంపాదించింది. రెండో టెస్టు ఈనెల 26న మెల్‌బోర్న్‌లో మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment