లబ్ షేన్ హ్యాట్రిక్‌ శతకం | Lubshane Hat Trick Century On New Zealand | Sakshi
Sakshi News home page

లబ్ షేన్ హ్యాట్రిక్‌ శతకం

Published Fri, Dec 13 2019 2:10 AM | Last Updated on Fri, Dec 13 2019 2:10 AM

Lubshane Hat Trick Century On New Zealand - Sakshi

పెర్త్‌: ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆ్రస్టేలియా ఆటగాడు లబ్ షేన్ (202 బంతుల్లో 110 బ్యాటింగ్‌; 14 ఫోర్లు, సిక్స్‌) వరుసగా మూడో టెస్టులో శతకం బాదాడు. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ సెంచరీలు చేసిన లబ్‌షేన్‌... న్యూజిలాండ్‌తో గురువారం ఇక్కడ ఆరంభమైన డే నైట్‌ టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. లబ్‌షేన్‌ మెరిపించడంతో కివీస్‌తో టెస్టులో ఆసీస్‌ భారీ స్కోరుపై కన్నేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఆ్రస్టేలియా ఓపెనర్‌ బర్న్స్‌ (9) విఫలమయ్యాడు. వార్నర్‌ (43; 4 ఫోర్లు), స్మిత్‌ (43; 4 ఫోర్లు) రాణించారు. సాన్‌ట్నర్‌ వేసిన 74వ ఓవర్‌ రెండో బంతిని లాంగాన్‌ మీదుగా సిక్సర్‌ కొట్టిన లబ్‌షేన్‌ తన కెరీర్‌లో మూడో శతకాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం లబ్‌షేన్‌తోపాటు హెడ్‌ (20 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement