PC: Wasim Jaffer
T20 World Cup 2021: Wasim Jaffer Shares Funny Memes About Final Goes Viral: పాకిస్తాన్‌పై మెరుపు ఇన్నింగ్స్‌తో అద్భుత విజయం సాధించి టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్‌కు దూసుకువెళ్లింది ఆస్ట్రేలియా. గ్రూపు-2లో ఐదుకు ఐదు మ్యాచ్‌లు గెలిచి టాపర్‌గా నిలిచిన బాబర్ ఆజమ్ బృందాన్ని 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి టైటిల్ గెలుపునకు ఒక అడుగు దూరంలో నిలిచింది. నవంబరు 11 నాటి రెండో సెమీ ఫైనల్‌లో మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను ఫైనల్‌కు చేర్చారు.
మరోవైపు.. తొలి సెమీ ఫైనల్‌లో భాగంగా గ్రూపు-1 టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించి తుదిపోరుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. మోర్గాన్ బృందంపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారిగా పొట్టి ఫార్మాట్ ఫైనల్‌కు చేరి తమ కలను నెరవేర్చుకుంది. ఇలా ఇరు గ్రూపుల టాపర్లకు కివీస్, ఆస్ట్రేలియాలు షాకిచ్చి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు. అదిరిపోయే మీమ్‌తో ఇంగ్లండ్, పాకిస్తాన్‌కు కౌంటర్ వేశాడు.
దీవానా మస్తానా(తెలుగులో అల్లరి నరేశ్- శర్వానంద్ సినిమా నువ్వా నేనా) క్లైమాక్స్‌ను ప్రతిబింబించే ఫొటోను షేర్ చేసిన వసీం జాఫర్... ‘‘ఐసీసీ ఈవెంట్లలో ఈ వరల్డ్‌కప్ దీవానా మస్తానాలా మారింది. ఇంటర్వెల్ వరకు ఫేవరెట్లుగా ఉన్న వాళ్లు... ఆఖర్లో ప్రేక్షకులుగా మిగిలిపోతారు మరి’’ అంటూ కామెంట్ చేశాడు. కాగా దీవానా మస్తానా సినిమాలో అనిల్ కపూర్, గోవిందా జూహీ చావ్లాతో స్నేహం చేస్తూ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తారు.
అయితే, వాళ్లతో కేవలం ఫ్రెండ్‌షిప్ వరకే పరిమితమైన హీరోయిన్.. ఆఖరికి సల్మాన్ ఖాన్‌ను పరిచయం చేసి.. అతడితో తన పెళ్లికి సాక్షి సంతకాలు పెట్టాల్సిందిగా కోరుతుంది. ఈ ప్రపంచకప్‌లో ఆది నుంచి ఫేవరెట్లుగా భావించిన ఇంగ్లండ్, పాకిస్తాన్‌ను ఉద్దేశించి... ఈ సీన్‌కు అన్వయిస్తూ వసీం జాఫర్ ఈ మేరకు ట్వీట్ చేశాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. రెండో సెమీ ఫైనల్ ఫలితాన్ని ఉద్దేశించి.. ‘‘ఇప్పటికే నేల మీదకు దిగి వస్తారా’’ అంటూ పాకిస్తాన్ జట్టు గురించి కామెంట్లు చేస్తున్నారు.
This World Cup has been the 'Deewana Mastana' of ICC events 😂 The favourites at intermission ended up as spectators for climax 😛#AUSvPAK #AusvNZ #T20WorldCup pic.twitter.com/PdUhcXM5lA
— Wasim Jaffer (@WasimJaffer14) November 12, 2021
Comments
Please login to add a commentAdd a comment