అడిలైడ్: తొలిసారి ప్రయోగాత్మకంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న డేనైట్ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసే అవకాశం కన్పిస్తోంది. 116/5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 208 పరుగులకు ఆలౌటయింది. హాజిల్‌వుడ్ 6 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ కు కివీస్ 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకెళుతోంది. 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 202, ఆస్ట్రేలియా 224 పరుగులు సాధించాయి.
విజయం దిశగా ఆస్ట్రేలియా
Published Sun, Nov 29 2015 12:19 PM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM
Advertisement
Advertisement