సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ప్రధాన టోర్నీ అయిన ‘ఎ’ డివిజన్ 3 రోజుల లీగ్ టైటిల్‌ను ఆంధ్రా బ్యాంక్ జట్టు గెలుచుకుంది. ఇదే లీగ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) రన్నరప్‌గా నిలిచింది. ‘ఎ’ డివిజన్ 2 రోజుల లీగ్ (ఎలైట్)లో కేంబ్రిడ్జ్ ఎలెవన్, కాంటినెంటల్ తొలి రెండు స్థానాలు దక్కించుకున్నాయి. 2013-2014 సీజన్‌కు సంబంధించి హెచ్‌సీఏ వార్షిక అవార్డుల కార్యక్రమం శనివారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగింది.
ఈ ఏడాది వివిధ లీగ్‌లు, టోర్నీలలో విజేతలుగా నిలిచిన జట్లకు ఈ సందర్భంగా ట్రోఫీలు, నగదు పురస్కారాలు అందజేశారు. వీటితో పాటు వేర్వేరు విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినవారికి హెచ్‌సీఏ ప్రత్యేక బహుమతులు కూడా ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సీవీ మిలింద్ (అండర్-19 ప్రపంచకప్), స్రవంతి నాయుడు (టి20 మహిళల ప్రపంచ కప్), షంషుద్దీన్ (ఉత్తమ దేశవాళీ అంపైర్), బి. అనిరుధ్, రచనా కుమార్ (వర్ధమాన క్రికెటర్లు)లు ఈ ప్రత్యేక పురస్కారాలు సొంతం చేసుకున్నారు.
విజేతల వివరాలు (2013-14 సీజన్)
‘ఎ’ డివిజన్ 3 డే లీగ్: 1. ఆంధ్రా బ్యాంక్ ,
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
‘ఎ’ డివిజన్ 2 డే లీగ్ (ఎలైట్): 1. కేంబ్రిడ్జ్
ఎలెవన్, 2. కాంటినెంటల్
‘ఎ’ డివిజన్ 2 డే లీగ్ (పూల్ ఎ): 1. చార్మినార్ సీసీ, 2. వీనస్ సైబర్‌టెక్
‘ఎ’ డివిజన్ 2 డే లీగ్ (పూల్ బి): 1.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2. మెగా సిటీ
‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ4): 1. అపెక్స్ సీసీ,
2. ఆర్కే పురమ్ సీసీ/ ఎంపీ యంగ్‌మెన్
‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ5): 1. క్లాసిక్ సీసీ,
2. అంబర్‌పేట్
‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ6): 1. మాంచెస్టర్,
2. తిరుమల
‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ7): 1. టీమ్ కున్,
2. మయూర్
‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ8): 1. బాయ్స్‌టౌన్, 2. లాల్‌బహదూర్
‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ9): 1. ఎలిగెంట్,
2. గ్రీన్‌ల్యాండ్స్
‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ10): 1. హెచ్‌సీఏ అకాడమీ, 2. కల్నల్ సీకే అక్రిలిక్
‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ (ఎ11): 1. టైమ్ సీసీ, 2. హైదరాబాద్ వాండరర్స్
అండర్-25 అంతర్ జిల్లా లీగ్: 1. వరంగల్, 2. నిజామాబాద్
‘ఎ’ ఇన్‌స్టిట్యూషన్ వన్డే లీగ్ (పూల్ ఎ): 1. ఏపీసీఎస్, 2. ఐఏసీ/ఐఏఎఫ్/ఎంసీహెచ్
‘ఎ’ ఇన్‌స్టిట్యూషన్ వన్డే లీగ్ (పూల్ బి): 1. పోస్టల్, 2. ఎన్‌ఎఫ్‌సీ
నాకౌట్ టోర్నమెంట్‌లు
సీనియర్ ‘ఎ’ డివిజన్ వన్డే: 1. ఆంధ్రా బ్యాంక్, 2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
ఎ3 డివిజన్ వన్డే: 1. ఎస్‌ఏ అంబర్‌పేట్, 2. కాంటినెంటల్
కిషన్‌ప్రసాద్ వన్డే: 1. పోస్టల్, 2. బాయ్స్‌టౌన్
ఎడీ ఐబరా హెచ్‌సీఏ అండర్-19: 1. వెస్లీ జూనియర్ కాలేజ్, 2. భవాన్స్ ‘ఎ’
జూనియర్ కాలేజ్
బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14: 1.
ఆల్ సెయింట్స్ హైస్కూల్, 2. గౌతమ్ మోడల్ హైస్కూల్
అంతర్ జిల్లా అండర్-14 వన్డే: 1.
నిజామాబాద్, 2. మెదక్
అంతర్ జిల్లా అండర్-16 వన్డే: 1.
నిజామాబాద్, 2. మెదక్
అంతర్ జిల్లా అండర్-19 వన్డే: 1.
నిజామాబాద్, 2. మెదక్
అంతర్ జిల్లా సీనియర్ ఉమెన్ నాకౌట్
టోర్నమెంట్: 1. ఖమ్మం, 2. నిజామాబాద్
‘ఎ’ డివిజన్ 3 డే విజేత ఆంధ్రాబ్యాంక్
Published Sun, Jun 15 2014 11:17 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement