
దేశ ప్రజలను కరోనా ఇళ్లకే పరిమితం చేసింది. లాక్‌డౌన్ కొత్త విషయాలను అనుభవంలోకి తెచ్చింది. ఇంటర్‌నెట్ ప్రధానస్రవంతిలో భాగమైంది. నీల్సన్, బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్‌సీ)విడుదల చేసిన డేటాని బట్టి గత నెల రోజులుగా నగరాల్లో ఇంటర్‌నెట్ వాడుతోన్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగి 54 శాతానికి చేరింది. ఇంకా చెప్పాలంటే నగరాల్లో నివసించే ప్రతి ఇద్దరిలో ఒకరు ఇంటర్‌నెట్ ఉపయోగిస్తున్నట్టు అధ్యయనం వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ వినియోగిస్తోన్న వారు 32 శాతానికి పెరిగారు.
ఇంటర్‌నెట్ వినియోగం జాతీయ సగటు 40 శాతంగా ఉంది. ఇంటర్‌నెట్ వినియోగానికి స్మార్ట్ ఫోన్‌లనే సాధనంగా ఉపయోగిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభించక ముందు రోజుకి మూడు గంటల 22 నిమిషాలపాటు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్‌నెట్ వినియోగించేవారు. అయితే కరోనా లాక్‌డౌన్ కాలంలో రోజుకి నాలుగు గంటలపాటు స్మార్ట్‌ఫోన్‌లపైనే సమయాన్ని వెచ్చిస్తున్నట్టు అధ్యయనం పేర్కొంది. చాటింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌లకోసం ప్రధానంగా మొబైల్ ఫోన్‌లను వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment