Internet Usage
-
జీబీలకు జీబీలు వాడేస్తున్నారు!
స్వాతి వైజాగ్‌లో ఓ ఫ్యాషన్ డిజైనర్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో తాజా ట్రెండ్స్ చూసేందుకు గంటల కొద్దీ సమయం గడుపుతుంది. ఇక రాయ్‌పూర్‌లో ఉబెర్ ఆటో డ్రైవర్ కిశోర్ సాహు అయితే సిటీలో తిరిగే 12 గంటల్లో యూట్యూబ్, ఓటీటీ కంటెంట్‌లోనే మునిగితేలుతాడు. రోజువారీ మొబైల్ డేటా లిమిట్ 1.5–2 జీబీ డేటా అయిపోతే, మళ్లీ డేటా టాపప్ కూడా చేస్తాడు. చిన్న నగరాల్లో సైతం డేటా వినియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే!4జీ.. 5జీ పుణ్యమా అని దేశంలో మొబైల్ డేటా వాడకం ఓ రేంజ్లో దూసుకుపోతోంది. ఇదేదో మెట్రోలు, బడా నగరాలకే పరిమితం అనుకుంటే పొరబాటే! ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు డేటా వాడకంలో మెట్రోలను మించిపోతుండటం విశేషం. ముఖ్యంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని చిన్న చిన్న నగరాలు ‘టాప్’లేపుతున్నాయి. ఇక్కడ యూజర్ల నెలవారీ సగటు డేటా వినియోగం 38–42 జీబీగా ఉన్నట్లు పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఇది 30–42 జీబీ మాత్రమే కావడం గమనార్హం. అప్పుడైతే పీక్స్... ఐపీఎల్ మ్యాచ్‌లు, క్రికెట్ వరల్డ్ కప్ ఇతరత్రా ముఖ్యమైన క్రీడా ఈవెంట్ల సమయంలో అయితే డేటా వాడకం పీక్స్‌కు వెళ్తోంది. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సగటు నెలవారీ వినియోగం 50–58 జీబీలను తాకుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అధిక రోజువారీ డేటా ఉండే ప్యాక్‌లను రీచార్జ్ చేసుకోవడమే కాకుండా.. డేటా టాపప్‌లు కూడా హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయట! సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలు, షోలు, గేమ్ స్ట్రీమింగ్‌తో పాటు క్రీడా ఈవెంట్లు దేశంలో డేటా వినియోగానికి బూస్ట్ ఇస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చౌక స్మార్ట్ ఫోన్లు, డేటా రేట్లు దీనికి దన్నుగా నిలుస్తున్నాయి. 2029 నాటికి మనమే టాప్... అంతర్జాతీయ టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ అంచనా ప్రకారం 2023లో భారత్‌లో ఒక్కో యూజర్ సగటు నెలవారీ డేటా విని యోగం 29 జీబీలుగా ఉంది. నోకియా మాత్రం దీన్ని 24.1 జీబీగా అంచనా వేసింది. గడిచిన ఐదేళ్లలో 21.1% వార్షిక వృద్ధి నమోదైందని పేర్కొంది. కాగా, 2029 నాటికి నెలవారీ సగటు వాడకం 68 జీబీకి చేరుతుందని, చైనాను సైతం అధిగమించి డేటా వాడకంలో భారత్ నంబర్ వన్‌గా నిలుస్తుందని ఎరిక్సన్ చెబుతోంది.జీడీపీకి దన్నుపెద్ద నగరాల్లో ఇంట్లో, ఆఫీసుల్లో వైఫై బాగా అందుబాటులో ఉంటుంది. ఫోన్లు, పీసీల్లో వైఫై డేటాతోనే పనైపోతుంది. అయితే ద్వితీయ శ్రేణి మార్కెట్ల విషయానికొస్తే యూజర్లు ఎక్కువగా డేటా ప్యాక్‌లపైనే ఆధారపడుతున్నారని, అక్కడ మొబైల్ డేటా వాడకం భారీగా పెరిగేందుకు ఇది కూడా కారణమని టెలికం కన్సల్టెంట్, నెట్వర్క్ స్పెషలిస్ట్ పరాగ్ కర్ చెప్పారు. కాగా, టెలికం కంపెనీలకు మాత్రం ఆ స్థాయిలో ఆదాయాలు పెరగడం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2020–21లో ఒక్కో జీబీ డేటాపై రూ.10.82 చొప్పున ఆదాయం లభించగా, 2023–24లో ఇది రూ.9.12గా తగ్గిందని ట్రాయ్ గణాంకాల్లో వెల్లడైంది. మరోపక్క, మొబైల్ కనెక్టివిటీ పెరగడం, బ్రాండ్‌బ్యాండ్ విస్తరణ వల్ల ఉద్యోగాల కల్పనతో పాటు ఎకానమీ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని అధ్యయనాల్లో వెల్లడైనట్లు గ్లోబల్ టీఎంటీ కన్సలి్టంగ్ సంస్థ ఎనాలిసిస్ మేసన్‌కు చెందిన అశ్విందర్ సేథి చెప్పారు.అత్యధిక మొబైల్ డేటా వినియోగ మార్కెట్లు: తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్‌లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు50-58జీబీ : గ్రామీణ, పట్టణ మార్కెట్ రెండింటిలో గరిష్ట స్థాయి (పీక్) నెలవారీ వినియోగంప్రతి 10%: బ్రాడ్‌బ్యాండ్ విస్తరణతో జీడీపీ 1% వృద్ధి చెందుతుందని అంచనా సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలు, గేమ్ స్ట్రీమింగ్: డేటా వాడకం జోరుకు ప్రధాన కారణం– సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్మార్ట్ వరల్డ్
ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతోంది. కమ్యూనికేషన్, వెబ్ బ్రౌజింగ్, నావిగేషన్, వినోదం వంటి సేవలతోపాటు ఆర్థిక లావాదేవీలు, సామాజిక అవసరాల విషయంలో విస్తృత మార్పులు రావడంతో ప్రతి వ్యక్తికి స్మార్ట్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారింది. ఒక వ్యక్తి వద్ద ఒకటి కంటే ఎక్కువ కూడా స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి. దీంతో 2023లో ప్రపంచ వ్యాప్తంగా 692 కోట్లు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. పట్టణాల్లో 83 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 78 శాతం స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.ఇదే ఒరవడి కొనసాగితే 2025 నాటికి ప్రపంచ జనాభాలో 90.33 శాతం మంది స్మార్ట్ఫోన్లు కలిగి ఉంటారని యూరప్‌కు చెందిన ఈ–కామర్స్ సేవలు అందిస్తున్న ఒబెర్లో అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. 2026 నాటికి 752 కోట్ల వరకు స్మార్ట్ఫోన్లు వినియోగదారుల చేతుల్లో ఉంటాయని ఆ సంస్థ అంచనా వేసింది. చైనాలో గత ఏడాది వరకు అత్యధికంగా 97.46 కోట్లు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో అత్యల్పంగా 5 కోట్లు మాత్రమే ఉన్నాయి. అయితే అమెరికా(27.61కోట్లు) కన్నా దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా మనదేశంలో 65.90 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. – సాక్షి, అమరావతిఫోన్లోనే ఇంటర్నెట్ వినియోగం అత్యధికం...స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఇంటర్నెట్ వినియోగం సులభమైంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారుల్లో 200 కోట్ల మంది (57.14శాతం) స్మార్ట్ఫోన్ల ద్వారా యాక్సెస్ చేశారు. ఇది 2025 నాటికి 72.6శాతాకి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2023లో నెలవారీ సగటు డేటా వినియోగం 14 జీబీగా ఉంటే.. 5జీ అందుబాటులోకి రావడంతో 2026 నాటికి 35జీబీకి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం ఇలా...⇒ 83% సంభాషణలతో పాటుగా ఈ–మెయిల్, ఫొటోలు తీసుకోవడం⇒ 76% ఇంటర్నెట్ సర్ఫింగ్⇒ 73% బ్రౌజింగ్, మ్యాపింగ్, నావిగేషన్⇒ 60% ఆన్లైన్ బ్యాంకింగ్⇒ 59% వీడియో కాల్స్ మాట్లాడటం⇒ 58% వీడియోలు తీసుకోవడం⇒ 71% ఆన్లైన్ షాపింగ్⇒ 67% సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం, చూడటం⇒ 58% వార్తలు చదవడం/ సమాచారం ఇవ్వడం⇒ 57% సాధారణ ప్రయోజన యాప్‌లు⇒ 66% పాడ్ క్యాస్ట్‌లు⇒ 52% గేమ్‌లు ఆడడం⇒ 44% లాంగ్ వీడియోలు చూడటం⇒ 65% షార్ట్ వీడియోలు చూడటం⇒ 35% ఆన్లైన్ వీడియో గేమ్‌లు ఆడటం -
ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకుంటున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గత నాలుగేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంటర్నెట్ వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇంటర్నెట్ వినియోగం, ఇంటర్నెట్ సబ్్రస్కిప్షన్లలో దేశంలో అన్ని రాష్ట్రాలను మించిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2022–23 సుస్థిర ప్రగతి లక్ష్యాల పురోగతి నివేదిక వెల్లడించింది. దేశం మొత్తం ప్రతి వంద మంది జనాభాకు 59.97 ఇంటర్నెట్ సబ్్రస్కిప్షన్లు ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ వంద మంది జనాభాకు 120.33 ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దేశ సగటు, ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువగా రాష్ట్రంలో ఇంటర్నెట్ వినియోగం ఉన్నట్లు నివేదిక తెలిపింది. దేశం మొత్తం 2018–19లో ప్రతి వంద మందికి 47.94 ఇంటర్నెట్ సబ్్రస్కిప్షన్లు ఉండగా ఇప్పుడు 59.97కు పెరిగాయి. రాష్ట్రంలో 2018–19లో ప్రతి వంద మందికి 94.59 సబ్్రస్కిప్షన్లు ఉండగా 2022–23 నాటికి 120.33 సబ్్రస్కిప్షన్లకు పెరగడం గమనార్హం. మరే ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత పెద్ద సంఖ్యలో సబ్్రస్కిప్షన్లు లేవు. ఆంధ్రప్రదేశ్ తరువాత కేరళలో అత్యధికంగా సబ్్రస్కిప్షన్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కేరళలో ప్రతి వంద మందికి 87.50 సబ్్రస్కిప్షన్లు ఉన్నాయి. ఆ తరువాత పంజాబ్‌లో 85.97 సబ్్రస్కిప్షన్లు ఉన్నాయి. పశ్చిమబెంగాల్లో అత్యల్పంగా 41.26 సబ్్రస్కిప్షన్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో 2019–20 నుంచి ఇంటర్నెట్ సబ్్రస్కిప్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. 2021–22లో అంతకు ముందు సంవత్సరానికన్నా కొంత మేర తగ్గినప్పటికీ మరుసటి ఏడాది పెరిగాయి. -
నెట్ ఇంట పల్లెలు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ భారతంలో ‘ఇంటర్నెట్’వేగంగా విస్తరిస్తోంది. 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా గ్రామాల్లో 40 శాతం ఇంటర్నెట్ వినియోగం పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ప్రస్తుతం 72 కోట్ల క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారని తేల్చిన సర్వే... వారిలో గ్రామాల్లో 42.5 కోట్ల మంది, పట్టణాల్లో 29.5 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రముఖ పరిశోధన సంస్థ నీల్సెన్ ‘ఇండియా ఇంటర్నెట్ రిపోర్ట్–2023’ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల మందిపై సర్వే చేపట్టి ఈ వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా చూస్తే 12 ఏళ్లకు పైబడిన 45 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు వీడియో కంటెంట్ల వీక్షణ, కాలింగ్‌లో నిమగ్నమవుతున్నట్లు అధ్యయనంలో స్పష్టమైంది. మొత్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి చూస్తే మహిళల ఇంటర్నెట్ వినియోగంలో 35 శాతం వృద్ధి నమోదైనట్లు నివేదిక తెలిపింది. నివేదికలో ఏముందంటే... ♦ మహిళలు, గ్రామీణ భారతం, అల్పఆదాయవర్గాల ఇళ్లలో ఇంటర్నెట్ యూజర్లు వేగంగా పెరుగుతున్నారు. సగం గ్రామీణ భారతం ఆన్లైన్ సేవల వినియోగంలో 2021తో పోలిస్తే 2022లో నెట్ వాడకం 40 % పెరిగింది. ♦ అదే కాలానికి మహిళల నెట్ వినియోగం 35%, విద్య, ఆదాయపరంగా చివరగా ఉన్న వర్గాల్లో 30% పెరిగింది. ♦ స్మార్ట్ఫోన్ల ద్వారా సమాచారం, వీడియోలషేరింగ్ అధికంగా కొనసాగుతోంది. ♦ 2021తో పోలిస్తే 43% డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి ♦ ప్రాంతీయ భాషల ప్లాట్‌ఫామ్‌ల పెరుగుదలతో వీడియోల వీక్షణ పెరిగింది. ♦ షార్ట్ వీడియోలు, మ్యూజిక్ల వ్యాప్తిలో వృద్ధి నమోదైంది. ♦ మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో 90% రోజువారీ ఉపయోగిస్తున్నవారే. ♦ ప్రతి ముగ్గురిలో ఒకరు బ్యాంకింగ్, ఇతర చెల్లింపుల కోసం నెట్‌ను వాడుతున్నారు. ♦ గ్రామీణ భారతంలో 8.5 కోట్ల మంది షేరింగ్ ద్వారా ఇతరులతో కలిసి వీడియోలు వీక్షించడంతోపాటు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. ♦ తక్కువ ధర హ్యాండ్సెట్ల ద్వారా అత్యధికంగా స్మార్ట్‌ఫోన్ షేరింగ్ అవుతోంది. ♦ కామ్స్టోర్ డేటా ప్రకారం యూట్యూబ్‌కు 46.3 కోట్ల మంది యునిక్ విజిటర్స్ ఉన్నారు. ♦ మెటా (ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ కలిపి)కు 30 కోట్ల నుంచి 50 కోట్ల మంది యూజర్లు ఉండగా ఆయా యాప్‌ల వినియోగాన్ని బట్టి యూజర్లు పెరుగుతున్నారు. -
సైబర్ క్రైమ్: పిల్లలు ఏం చూస్తున్నారు?
సురేష్ ఇంటికి వస్తూనే వందన మీద కేకేశాడు ‘మన పర్సనల్ ఫొటోలు సోషల్‌మీడియాలో ఎందుకు పోస్ట్ చేశావ’ని. వందన తన ఫోన్ తీసుకొని చెక్ చేసింది. భర్త చెప్పింది నిజమే. కొడుకు వీడియో గేమ్ ఆడుకుంటానని అదేపనిగా విసిగిస్తుంటే తన మొబైల్ ఫోన్ ఇచ్చింది. ఎని మిదేళ్ల కొడుకు చేసిన నిర్వాకానికి తలకొట్టేసినట్లయ్యింది. సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన ఫొటోలు తొలగించి ఊపిరి పీల్చుకుంది. ఎందుకలా చేశావని అడిగితే తనకేమీ తెలియదని ఆటలో మునిగిపోయిన కొడుకును చూస్తూ ‘ఇక నుంచి వీడిని ఫోన్ ముట్టకోనివ్వకూడద’ ని గట్టిగా నిర్ణయించుకుంది. (పేర్లు మార్చడమైది). సురేశ్, వందన విషయంలోనే కాదు పిల్లలున్న ప్రతి ఇంట్లో డిజిటల్ వినియోగంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఊహ తెలియని పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో... అనే ఆందోళన ఎక్కువయ్యింది. బడి పాఠాలు కూడా డిజిటల్లోకి మారాక ఇంటర్నెట్ వాడకం పిల్లల్లోనూ పెరిగింది. ఇలాంటప్పుడు పిల్లలకు ఏది మంచి, ఏది చెడు తెలియజేయాల్సిన అవసరం తల్లిదండ్రులకు తప్పక ఉంది. డిజిటల్ శ్రేయస్సు... ఈ రోజుల్లో పిల్లల స్మార్ట్ ఫోన్ స్క్రీన్ సమయాన్ని నియంత్రించడం కష్టమైన పనే. 7నుంచి 13 ఏళ్ల పిల్లలు చాలా రకాల సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఉపయోగిస్తున్నారు. డిజిటల్ శ్రేయస్సు విషయంలో అన్ని వయసుల వారికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అలాగే, డిజిటల్ టెక్నాలజీతో మెరుగైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రమాదాలు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. మన దగ్గరి డేటా.. మన దేశంలో 2021లో ఇంటర్నెట్, సోషల్ మీడియాను వినియోగించేవారి సంఖ్య దాదాపు 1.39 బిలియన్ల జనాభా ఉంది. 1.10 బిలియన్లకు మొబైల్ కనెక్షన్‌కి యాక్సెస్ ఉంది. వీరిలో 624 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు. 448 మిలియన్ల మంది యాక్టివ్ సోషల్ మీడియా వినియోగదారులు. సగటు ఇంటర్నెట్ వినియోగం రోజుకు 6.36 గంటలు అయితే సోషల్ మీడియా వినియోగం 2.25 గంటలు. మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను వినడానికి వెచ్చించిన సగటు సమయం 1.53 గంటలు. గేమింగ్‌లో గడిపే సగటు సమయం 1.20 గంటలు. 16 నుండి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల ఇంటర్నెట్ వినియోగదారులలో 92.8% మంది వీడియో గేమ్‌లు ఆడుతున్నారని నివేదికలు ఉన్నాయి. మార్గదర్శకాలు తప్పనిసరి... ఈ రోజుల్లో పిల్లలు సెకండరీ స్కూల్‌కి వెళ్లడంతోనే మరింత స్వతంత్రులు అవుతున్నారు. వైవిధ్యమైన అలవాట్లతో మరింత నమ్మకంగా ఇంటర్నెట్ వినియోగదారులుగా మారుతున్నారు. తల్లిదండ్రులు యాప్ ద్వారా కొనుగోళ్లను ఆపేయాలి. పిల్లలతో తరచూ ఇంటర్నెట్ భద్రత గురించి మాట్లాడాలి. పిల్లలకు వ్యక్తిగతం కాకుండా కుటుంబ ఇ–మెయిల్‌ను సెట్ చేయాలి. వీడియోగేమ్‌ల రేటింగ్, వయసు బార్లను తనిఖీ చేయాలి. పెద్దలకు చిట్కాలు... ∙పిల్లలు స్క్రీన్‌ని ఎక్కువగా వాడుతున్నారని టెక్నాలజీ యాక్సెస్‌ను బ్లాక్ చేయవద్దు. అంటే, ఫోన్లు లాగేసుకోవడం, ఇంటర్నెట్ కట్ చేయడం.. చేయకూడదు. ∙ పిల్లలకు ఇష్టమైన యాప్‌లు, సైట్లపై మీరూ ఆసక్తి చూపండి. ∙కొన్ని పరిమితులను సెట్ చేయడానికి కంటెంట్ ఫిల్టర్ సాఫ్ట్వేర్లను వాడచ్చు. ∙పడకగది, భోజన సమయం, ప్రయాణంలో.. ఇంటర్నెట్ను వాడద్దని కుటుంబమంతటికీ పరిమితిని నిర్ణయంచండి. ∙ఆన్లైన్లో ఏ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయ కూడదో/ఓవర్షేర్ చేయకూడదో తప్పనిసరిగా నేర్పించాలి. ∙ఆఫ్ స్క్రీన్ సమయం, ఆన్‌స్క్రీన్ సమయాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్పాలి. ∙వయసు పరిమితులు (ఉదా: 18 ఏళ్లు) ఉన్న సైట్లకు సైన్ అప్ చేయడానికి మీ చిన్నారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వవద్దు. అవసరం, అవగాహన లేని సమాచారం ఇవ్వాలనుకోకూడదు. పెద్దలు వేసుకోదగిన ప్రశ్నలు ► మీ పిల్లలు ఆన్లైన్ ద్వారా ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారో, ఎందుకు జరుపుతున్నారో, ఈ పరస్పరచర్య నుండి వారు ఏం పొందుతున్నారో .. తెలుసుకోవడం ముఖ్యం. ► ఆన్లైన్లో ఏ సమాచారం గురించి వెతుకుతున్నారు. అందుకు వారు ఉపయోగించే సాధనాలు ఏమిటి, వాటి మూలాలు ఏమిటి.. తనిఖీ చేయడం అవసరం. ► మీ డిజిటల్ కార్యకలాపాల మంచి, చెడు తెలిసే విధానం ఏమిటి, వాటి ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ∙పిల్లలు తమ చుట్టూ ఉన్నంత సురక్షితంగా, ఆన్లైన్ వేదికల్లో ఉన్నారా. ఈ తరహా డిజిటల్ శ్రేయస్సుపై అవగాహన, అభ్యాసం ఎప్పుడూ ఆగిపోకూడదు. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వన్ ట్రిలియన్ దిశగా ఇంటర్నెట్ ఆర్ధిక వ్యవస్థ, ఆమూడు వర్గాల ప్రజలే కీలకం!
Indian Internet Economy 2030 Forecast: మనదేశ ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ అంచనా వేసింది. రెడ్‌సీర్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం గతేడాది 50శాతం వృద్ధితో ముందుకు సాగిన దేశ ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది. ఇంటర్నెట్ వ్యాప్తి రేటు హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్,పెరిగిన ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ కంటెంట్ వినియోగంతో ఆర్ధిక వ్యవస్థ వేగవంతం అయ్యేందుకు ఆజ్యం పోసినట్లు అధ్యయనం తెలిపింది. ►రెడ్‌సీర్ సీఈఓ, వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ..వన్ ట్రిలియన్ వినియోగదారుల ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థకు ఇ-టైలింగ్, ఇ-హెల్త్, ఫుడ్‌టెక్, ఆన్లైన్ మొబిలిటీ, క్విక్ కామర్స్ వంటి రంగాలు వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదిని సృష్టించడానికి కారణమైందని అన్నారు. ►ఈ సందర్భంగా నివేదిక దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల్ని మూడు విభాగాలు విభజించింది. ఈ మూడు వర్గాలకు చెందిన ప్రజల అవసరాలు, వారి జీతభత్యాలు, ఇంటర్నెట్ తో ఎలాంటి అవసరం ఉంది? ఇంటర్నెట్ తో వారి సమస్యల్ని ఎలా పరిష్కరించవచ్చు. ఇలా పలు అంశాల ఆధారంగా ఇంటర్నెట్ ఆర్ధిక వ్యవస్థ ఎలా వృద్ధి సాధిస్తుందో రెడ్‌సీర్ నివేదికను విడుదల చేసింది. ►వాటిలో మొదటిది మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నివసించే 80-100 మిలియన్ల జనాభా కలిగిన మనదేశానికి చెందిన వాళ్లు సంవత్సరానికి 12వేల డాలర్ల(రూ.9,04,182.00 ఇండియన్ కరెన్సీ ) కంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని పొందుతారు. ►రెండవ విభాగంలో 100-200 మిలియన్ల జనాభా ఉన్న వీరు సంవత్సరానికి 5వేల నుండి 12వేల డాలర్ల వరకు వరకు పొందేవారు. ►మూడవ వర్గం 400-500 మిలియన్ల జనాభా కలిగిన గ్రామీణ ప్రాంతాలు, టైర్-2 నగరాలు. వీరు ప్రాథమిక వార్షిక ఆదాయం 5వేలడాలర్లు ( రూ.3,76,742.50 ఇండియన్ కరెన్సీ). ఇంటర్నెట్ ఆర్ధిక వ్యవస్థ మరింత అభివృద్ధి చెందడానికి సహాయపడే విభాగం.వారి సమస్యలను పరిష్కరించేలా వారికి సహాయం చేసేందుకు ఇంటర్నెట్ చాలా అవసరమని రెడ్ సీర్ తెలిపింది. ►ఈ మూడు విభాగాలకు చెందిన ప్రజల జీవన విధానం ఇంటర్నెట్ ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటుందని రెడ్ సీర్ రిపోర్ట్ హైలెట్ చేసింది. -
ఒక్క నిమిషానికి ఇంటర్నెట్లో జరిగే విధ్వంసం గురించి తెలుసా?
ఇంటర్నెట్ ఒక గ్లోబల్ కంప్యూటర్ నెట్వర్క్. ఈ భూమ్మీద అతిపెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థ. యూజర్లకు వివిధ రకాల సమాచారంతో పాటు పరస్పర సంభాషణల కోసం సౌకర్యాలు అందిస్తున్న వేదిక. అలాంటి వేదికపై ఒక్క నిమిషంలో జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో తెలుసా? వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెబ్సైట్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. 2021లో వివిధ ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్స్(సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కలిపి)లో ఒక్క నిమిషంలో ఏమేం జరిగిందో వివరించింది. బ్రౌజింగ్, స్ట్రీమింగ్, అప్లోడ్, డౌన్లోడ్.. ఇలా మొత్తం వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించి లోరీ లూయిస్ అనే ఆవిడ.. ఈ వివరాల్ని ఆల్‌యాక్సెస్ వెబ్సైట్లో పొందుపరిచింది. వీటి ఆధారం ఏం తేలిందంటే.. యూట్యూబ్.. 500 గంటల నిడివి ఉన్న కంటెంట్ కేవలం ఒక్క నిమిషంలోనే అప్లోడ్ అయ్యింది. ఇంటర్నెట్లో 197 మిలియన్లకు పైగా ఈమెయిల్స్ పంపించుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్లలో నిమిషానికి 69 మిలియన్ల మెసేజ్‌లు పంపించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిమిషానికి దాదాపు ఏడు లక్షల స్టోరీలు షేర్ అవుతున్నాయి. ప్రొఫెషనల్ సైట్ లింక్డిన్లో సుమారు పదివేల మంది కనెక్ట్ అవుతున్నారు. టిక్‌టాక్ లాంటి వీడియో కంటెంట్ జనరేటింగ్ యాప్‌లో ఐదు వేల డౌన్లోడ్లు చేస్తున్నారు నెట్‌ఫ్లిక్స్‌లో నిమిషానికి 28 వేలకు పైగా సబ్‌స్క్రయిబర్స్ వీక్షణ కొనసాగుతోంది. నోట్: మరికొన్ని అంశాలపై పరిశోధన జరిగినప్పటికీ.. పూర్తి స్థాయి లెక్కలు తేలకపోవడంతో ఈ లిస్ట్‌లో జత చేర్చలేదు. ఆన్లైన్ షాపింగ్, మరికొన్ని ప్లాట్‌ఫామ్‌ల వివరాలు పొందుపర్చలేదు. ఇది కేవలం ఆల్‌యాక్సెస్ డేటా మాత్రమే!. ►ఇంటర్నెట్ ఉపయోగం వల్ల లాభాలు మాత్రమే కాదు.. భూమ్మీదకు కర్బన ఉద్గారాలు విడుదలై వినాశం వైపు అడుగులు కూడా వేస్తోంది. అందుకే ఇంటర్నెట్ యూసేజ్‌ను తగ్గించాలని, పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు పర్యావరణ నిపుణులు. ►ఇంటర్నెట్లో డాటాను లెక్కించడం కష్టమే!. ఒక అంచనా ప్రకారం మాత్రం.. ఒకరోజులో 1.145 ట్రిలియన్ ఎంబీ క్రియేట్ అవుతోంది. చదవండి: మళ్లీ అదే అంధకారమా!.. 20 ఏళ్లు వెనక్కి వెళ్లక తప్పదా? -
12345, ఇవేం పాస్వర్డ్లురా నాయనా! మరీ ఇంత బద్ధకమా?
Most Common Passwords In India: నార్డ్‌పాస్ అనే గ్లోబల్ సంస్థ 50 దేశాల్లో పాస్‌వర్డ్‌ల తీరును, వాటిని ఛేదించడానికి ఎంత సమయం పడుతుందనే అంశంపై చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. దీనికోసం ఈ సంస్థ 4టీబీ సామర్థ్యమున్న డేటాబేస్‌ను విశ్లేషించింది. అందులో చాలా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. భద్రతపరంగా సాధించాల్సింది ఇంకా చాలానే ఉంది దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ సైబర్ భద్రత పరంగా మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. దేశంలో ఎక్కువ మంది తమ ఖాతాలకు పెట్టుకున్న పాస్వర్డ్ ఏంటంటే.. ‘PASSWORD’. పోలీసులు, భద్రతా సంస్థలు సులభంగా ఛేదించగలిగే పాస్వర్డ్లు పెట్టుకోకుండా సంక్లిష్లమైనవి పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. భారత్‌లో ‘PASSWORD’ తర్వాత ఎక్కువ మంది పెట్టుకున్న పాస్వర్డ్లు 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567, qwerty and abc 123 ఇవే అని ఆ అధ్యయనంలో తేలింది. వీటిలో india123 తప్ప మిగిలిన వాటిని ఒక సెకను కన్నా తక్కువ సమయంలోనే హ్యాక్ చేయొచ్చు. india123 పాస్‌వర్డ్‌ను కనుక్కునేందుకు మాత్రం 17 నిమిషాలు పట్టింది. కరోనా వైరస్ విజృంభణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ సేవలు పెరిగిపోయాయి. బడి, గుడి మొదలుకొని అన్నింటా డిజిటల్ సేవలే. బ్యాంకింగ్, ఈ–కామర్స్ వంటి వాటిలో మరీ ఎక్కువ. కరెన్సీ నోట్ల వాడకం తగ్గింది... కార్డులు, ఫోన్ పేమెంట్లు, ఆన్లైన్ చెల్లింపులు పెరిగిపోయాయి. ఆయా సేవలు పొందాలంటే మనకు ఆ సంబంధిత సంస్థ వెబ్సైట్లో అకౌంట్ ఉండాలి. దానికి ఒక పాస్వర్డ్ తప్పనిసరి. అయితే, పాస్వర్డ్ బలహీనంగా ఉంటే మన ఖాతాలు హ్యాక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిజిటల్ జీవితానికి గేట్‌వే ‘పాస్వర్డ్లు అనేవి మన డిజిటల్ జీవితాలకు గేట్‌వే లాంటివి. అదీగాక ఆన్లైన్లో మనం గడిపే సమయం క్రమక్రమంగా పెరిగిపోతోంది. అందువల్ల సైబర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని మనం పాస్వర్డ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది’ అని అంటారు నార్డ్‌పాస్ సీఈఓ జొనాస్ కర్క్లీస్. దురదృష్టవశాత్తు చాలామంది బలహీనమైన పాస్వర్డ్లు పెట్టుకుంటున్నారని, వాటిని కూడా ‘ఆరోగ్యకరంగా’ పెట్టుకోవాలని చెబుతారాయన. ప్రపంచవ్యాప్తంగా పాస్‌వర్డ్‌ల జాబితాలో తొలి మూడు స్థానాల్లో వరుససంఖ్యలు ఉన్నాయి. 50 దేశాల్లో 123456, 123456789, 12345 తర్వాత ఎక్కువ మంది పెట్టుకున్న పాస్వర్డ్లు qwerty, password అని పెట్టుకున్నట్లు గుర్తించారు. మన జీవితాల్లో కీలక పాత్ర పోషించే పాస్‌వర్డ్‌ను పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆ అధ్యయనం నొక్కిచెప్పింది. ఇది హ్యాకింగ్‌కు, ఇతరుల ఊహలకు అందకుండా ఉండాలి. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
భారీగా పెరుగుతున్న ఇంటర్నెట్ సగటు వినియోగం
ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. నగరాలే కాదు గ్రామీణ ప్రాంతాలకూ ఇది పాకింది. దేశంలో 10 మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లలో.. తొమ్మిది మంది ప్రతిరోజు ఇంటర్నెట్లో విహరిస్తున్నారట. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కాంటార్ క్యూబ్ నివేదిక ప్రకారం.. యాక్టివ్ యూజర్ సగటున రోజూ 107 నిముషాలు(ఒక గంట 47 నిముషాలు) నెట్ వాడుతున్నారు. గ్రామీణ యూజర్లతో పోలిస్తే అర్బన్ కస్టమర్లు 17 శాతం ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ఇరు ప్రాంతాల వారూ మొబైల్లోనే క్లిక్ చేస్తున్నారు. అందుబాటు ధరలో మొబైల్స్ లభించడం, చవక డేటా చార్జీల కారణంగా ఇంటర్నెట్ వాడకం విషయంలో మొబైల్ తొలి ఎంపిక అయింది. టెలికం కంపెనీల దూకుడుకుతోడు ఆధునిక ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు వెల్లువెత్తుతుండడంతో మార్కెట్ అనూహ్యంగా వృద్ధి చెందుతోంది. అయిదేళ్లలో 90 కోట్లు.. యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదార్లు 2025 నాటికి 90 కోట్లకు చేరుకుంటారని నివేదిక అంచనా వేస్తోంది. 2020లో ఈ సంఖ్య 62.2 కోట్లుంది. అయిదేళ్లలో ఇంటర్నెట్ వాడుతున్న మొత్తం కస్టమర్లలో అత్యధికులు గ్రామీణ భారత్ నుంచి ఉంటారు. దేశంలో డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది. పెరుగుతున్న గ్రామీణ నెటిజన్ల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి తగ్గ వ్యవస్థ అభివృద్ధి చెందాలి. ఇంటర్నెట్ విస్తృతి గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో రెండింతలు ఉన్నప్పటికీ.. గ్రామాల్లో ఇంటర్నెట్ వాడకం ఏటా వేగంగా పెరుగుతోంది. రాబోయే కొన్నేళ్లు వ్యవహారిక భాషలు, వాయిస్, వీడియోలు డిజిటల్ వ్యవస్థ మార్పుకు కీలకం కానున్నాయని కాంటార్ ప్రతినిధి విశ్వప్రియ భట్టాచార్జీ తెలిపారు. ఇవీ ఇంటర్నెట్ గణాంకాలు.. దేశంలో 2020లో ఇంటర్నెట్ యూజర్లు పట్టణ ప్రాంతాల్లో 4 శాతం పెరిగి 32.3 కోట్లుగా ఉన్నారు. పట్టణ జనాభాలో వీరి వాటా 67 శాతం. ఇక గ్రామీణ భారత్‌లో నెటిజన్లు 13 శాతం పెరిగి 29.9 కోట్లకు చేరుకున్నారు. గ్రామీణ జనాభాలో వీరి వాటా 31 శాతం ఉంది. యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లలో టాప్–9 మెట్రోల వాటా 33 శాతం నమోదైంది. ప్రతి అయిదుగురిలో ఇద్దరు చిన్న పట్టణాల నుంచి ఉంటున్నారు. 143.3 కోట్ల జనాభాలో 43 శాతం మంది (62.2 కోట్లు) యాక్టివ్ ఇంటర్నెట్ కస్టమర్లు ఉన్నారు. గ్రామాల్లో అత్యధికులు ఇప్పటికీ ఇంటర్నెట్కు దూరంగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నెట్ వృద్ధికి ఆస్కారం ఉంది’ అని నివేదిక వివరించింది. చదవండి: రూ.25,000 వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ -
భారీగా పెరుగుతున్న నెట్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఇండియా బాటలో గ్రేటర్ నగరం శరవేగంగా ముందుకు దూసుకెళుతోంది. ఇంటర్నెట్ ఆధారిత సమాచార వినియోగంలో ముందుడే గ్రేటర్ నెటిజన్లు ఈ విషయంలో మరింత స్పీడు పెంచుతున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభణ కారణంగా మహానగరం పరిధిలోని వందలాది ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీలు వేలాది మందికి వర్క్ ఫ్రం హోంకు అనుమతించాయి. మరోవైపు మెజారిటీ నగరవాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. దీంతో ఇంటర్నెట్ వినియోగం అధికమైంది. ఉద్యోగులు, విద్యార్దులు, గృహిణులు అనే తేడా లేకుండా అందరికి నెట్ వినియోగం తప్పని సరైంది. ఈ నేపథ్యంలో సాధారణ స్పీడ్ ఉండే ఇంటర్నెట్ కంటే, ఇప్పుడు హైస్పీడ్ ఇంటర్నెట్ వినియోగానికే గ్రేటర్‌సిటేజన్లు మొగ్గుచూపుతున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజా అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా డిజిటల్ ఇండియా శకం సృష్టించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు 2021 చివరి నాటికి దేశంలో సుమారు 82 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. ఇదే తరుణంలో మహానగరం కూడా ఇదే ట్రెండ్ నెలకొన్నట్లు పేర్కొంది. ఇక నెట్‌వినియోగానికి వస్తే గ్రేటర్ పరిధిలో సుమారు 50 లక్షలమంది నెటిజన్లు ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. మన దేశంలోని చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ వంటి మహనగరాల్లో కూడా ఇంతే స్థాయిలో నెటిజన్లు ఉన్నట్లు ఈ అధ్యయనం అంచనా వేసింది. హైస్స్డ్ ఇంటర్నెట్కు ఆదరణ గ్రేటర్ నగరంలో నెటిజన్లలో సుమారు 65 శాతం మంది ఆప్టికల్ ఫైబర్ నెట్ కనెక్షన్లనే ఇష్టపడుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇతర టెలికాం సర్వీసుల కన్నా ఈ కనెక్షన్ల ద్వారా ఇటు ఆర్థికంగా.. అటు సమాచార పరంగా మెరుగైన సర్వీసులు పొందుతున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారట. ఇక స్పీడు విషయానికి వస్తే ప్రధానంగా 60 నుంచి 100 మెగా బైట్స్ పర్ సెకన్ స్పీడున్న ఇంటర్నెట్కే మెజార్టీ సిటీజన్లు ఓటేస్తున్నారట. సర్వసాధారణంగా 2.5 మెగాబైట్స్ పర్ సెకండ్ స్పీడు ఉండే నెట్ వినియోగానికి ఆదరణ క్రమంగా తగ్గున్నట్లు వెల్లడించింది. ఇక హైస్పీడ్ ఇంటర్నెట్ అంటే 60,100 ఎంబీపీఎస్ వేగం ఉన్న నెట్.. సాధారణ 2.5 ఎంబీపీఎస్ నెట్‌కంటే 400 రెట్లు అధిక సామర్థ్యం,వేగం ఉంటుందని, కావాల్సిన సమాచారం డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు పది నిమిషాల వ్యవధిలో ఏకంగా అత్యంత స్పష్టత,భారీ నిడివిగల 10 హెచ్డీ(హై డిఫినిషన్) వీడియోలను డొన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇక సమాచారం డౌన్లోడ్ చేసుకోవడమే కాదు... సంబంధిత సమాచారాన్ని తక్కువ వ్యవధిలో యూఎస్బీ డైవ్ద్వారా ఇతరులకు షేర్, చేయడం కూడా సులభంగా మారిందన్నారు. గ్రేటర్లో 5 మెగాబైట్స్ పర్ సెకన్, ఒక గెగా టైట్ పర్ సెకన్ స్పీడున్న నెట్‌వినియోగానికి అయ్యే ఖర్చు ఇతర మెట్రోనగరాలతో పోలిస్తే తక్కువేనని వెల్లడించింది. చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ -
‘పిల్లల ఇంటర్నెట్’పై కన్నేయాలి
సాక్షి, హైదరాబాద్: సైబర్‌నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు వినియోగించే సోషల్ మీడియాపై పేరెంట్స్ ప్రత్యేకదృష్టి సారించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితుల్లో ఇంటర్నెట్ వినియోగం నాలుగింతలు పెరిగిందని, ఆన్లైన్ మోసాలు కూడా ఆందోళనకరస్థాయిలో నమోదవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. విమెన్‌సేఫ్టీ వింగ్ చేపట్టిన ‘సైబ్హర్’ప్రాజెక్టులో భాగంగా ‘ఆన్లైన్ పోస్టింగుల్లో వాస్తవాలు–అవాస్తవాలు, వేటిని నమ్మాలి‘అనే అంశంపై తెలంగాణ పోలీస్ శాఖ మహిళాభద్రతావిభాగం నిర్వహించిన వెబ్ ఆధారిత చర్చగోష్టిలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కామారెడ్డి ఎస్పీ ఎం.శ్వేత, యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ నిపుణులు జార్జ్, సి–డాక్ అసోసియేట్ డైరెక్టర్ సీఏఎస్ మూర్తి తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఎస్పీ శ్వేత మాట్లాడుతూ భౌతిక ప్రపంచానికి, వర్చువల్ ప్రపంచానికి చాలా వ్యత్యాసముందని, సోషల్ మీడియాలో వచ్చే అంశాలను వాస్తవాలతో బేరీజు వేసుకోకపోతే పిల్లలు, యువత సులువుగా నమ్మి మోసపోయే ప్రమాదముందని అన్నారు. ఇంటర్నెట్ వినియోగం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించిన నేపథ్యంలో కొత్తరకాల నేరాలు వెలుగుచూస్తున్నాయని చెప్పారు. యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ జార్జ్ మాట్లాడుతూ మహిళలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాలను అరికట్టేందుకు యూనిసెఫ్ ఆధ్వర్యంలో బాలసురక్ష, శ్రీ సురక్ష అనే ప్రత్యేక యాప్‌లను రూపొందించామని చెప్పారు. సీఏఎస్ మూర్తి మాట్లాడుతూ సైబర్ నేరాలు అన్నివర్గాలను బాధితులుగా చేస్తున్నాయని, మహిళలు, పిల్లలు వీటి బారిన పడేవారిలో అధికశాతమున్నారని తెలిపారు. మహిళాభద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతిæ లక్రా, డీఐజీ సుమతి ఈ కార్యక్రమాన్ని సైబ్‌హర్‌లో భాగంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ సెల్ తొలి వార్షికోత్సవం! విదేశీ భర్తల వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ సెల్ తొలి వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. ఎన్ఆర్ఐ సెల్‌కు ఇప్పటిదాకా 101 ఫిర్యాదులు రాగా అందు లో ఆరుగురి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది కేసుల్లో లుకవుట్ నోటీసులు జారీ చేశారు. 44 కేసుల్లో నిందితులను ఇండియాకు రప్పించేలా వారు పనిచేసే కం పెనీలకు లేఖలు రాశారు. కరోనా కాలంలో గృహహింసను తగ్గించేందుకు పలు భాషల్లో ఆన్లైన్ కౌన్సెలింగ్ ఇచ్చారు. తాజాగా పిల్లలు, మహిళలకు ఆరోగ్యకరమైన సైబర్ ప్రపంచాన్ని అందించేందుకు నెలపాటు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. -
నెట్టింట్లో జనం
దేశ ప్రజలను కరోనా ఇళ్లకే పరిమితం చేసింది. లాక్డౌన్ కొత్త విషయాలను అనుభవంలోకి తెచ్చింది. ఇంటర్నెట్ ప్రధానస్రవంతిలో భాగమైంది. నీల్సన్, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్సీ)విడుదల చేసిన డేటాని బట్టి గత నెల రోజులుగా నగరాల్లో ఇంటర్నెట్ వాడుతోన్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగి 54 శాతానికి చేరింది. ఇంకా చెప్పాలంటే నగరాల్లో నివసించే ప్రతి ఇద్దరిలో ఒకరు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నట్టు అధ్యయనం వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగిస్తోన్న వారు 32 శాతానికి పెరిగారు. ఇంటర్నెట్ వినియోగం జాతీయ సగటు 40 శాతంగా ఉంది. ఇంటర్నెట్ వినియోగానికి స్మార్ట్ ఫోన్లనే సాధనంగా ఉపయోగిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభించక ముందు రోజుకి మూడు గంటల 22 నిమిషాలపాటు స్మార్ట్ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ వినియోగించేవారు. అయితే కరోనా లాక్డౌన్ కాలంలో రోజుకి నాలుగు గంటలపాటు స్మార్ట్ఫోన్లపైనే సమయాన్ని వెచ్చిస్తున్నట్టు అధ్యయనం పేర్కొంది. చాటింగ్, సోషల్ నెట్వర్కింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌లకోసం ప్రధానంగా మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. -
ఏపీ డేటా యమ ‘స్పీడ్’
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. మార్చి 22 నుంచి ఇప్పటివరకూ 12 శాతం డేటా వాడకం పెరిగినట్లు టెలికాం మంత్రిత్వ శాఖ చెబుతోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో డేటా వినియోగిస్తున్నారు. కానీ.. అక్కడ లాక్డౌన్ వేళ అదనంగా పెరిగిన వినియోగం 9 శాతం మాత్రమే. మార్చి 21కి ముందు రోజువారీ వినియోగం దేశ వ్యాప్తంగా 282 పెటాబైట్స్ (వెయ్యి టెరాబైట్స్) ఉంటే.. లాక్డౌన్ తర్వాత 308 పెటాబైట్స్‌కు పెరిగింది. మార్చి 22, 27 తేదీల్లో ఏకంగా 312 పెటాబైట్స్ వినియోగించారు. ఒక పెటాబైట్.. 500 బిలియన్ పేజీల ప్రింట్ టెక్టŠస్కు సమానం. వినియోగం పెరగడానికి కారణాలివీ ► వివిధ సంస్థలు సర్వే నిర్వహించగా.. అన్ని పనులు ఆన్లైన్లో జరగడమే డేటా వినియోగం పెరగడానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తేలింది. ► జూమ్‌తో పాటు అనేక ఆన్లైన్ వీడియో యాప్‌ల వినియోగం బాగా పెరిగింది. దాదాపు 250 మందితో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే వీలున్న ఇలాంటి యాప్‌లపైనే ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఆధారపడుతున్నాయి. సమీక్షలు, సమావేశాలు అన్నీ ఇందులోనే జరుగుతున్నాయి. ► కోవిడ్ సమాచారం చేరవేయడం, చర్యలు విస్తృతం చేయడానికి వెబ్ తరహా పర్యవేక్షణలు చేస్తున్నారు. ► మరోవైపు ఆన్లైన్ క్లాస్‌లు ఉండనే ఉన్నాయి. ప్రధాన యూనివర్సిటీలన్నీ హై క్వాలిటీ డేటాతో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇది కూడా డేటా వినియోగాన్ని పెంచుతోంది. ► డేటా వినియోగంలో వినోదం పాత్ర ప్రధానమైనదే అంటున్నారు నిపుణులు. పల్లె, పట్నం తేడా లేకుండా నెట్ అందుబాటులో ఉన్న ప్రతిచోట సినిమాలు, వినోద యాప్‌లకు జనం కనెక్ట్ అవుతున్నారు. ► కుటుంబీకులంతా ఒకే చోట ఉండటం.. ఏదో ఒక వెరైటీ ఫుడ్ అందించాలన్న తపనతో మహిళలు ఆన్లైన్ వంటలకు కనెక్ట్ అవుతున్నారని తేలింది. -
ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్లో..
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా జన సంచారం లేక బోసిపోతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు స్వీయ నిర్బంధం పేరిట ఇళ్లకే పరిమితం కావడంతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో పెరిగిన ఆన్లైన్ రద్దీని తట్టుకునేందుకు టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇంటర్నెట్ సామర్థ్యం పెంపుదలపై దృష్టి సారించారు. మార్చి మొదటి వారంలో రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రం హోమ్) వెసులుబాటును కల్పించాయి. విద్యాసంస్థల మూసివేత, కార్పొరేట్, ప్రభుత్వ సంస్థలు కూడా ఇళ్ల నుంచే పని చేయాలని తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు ఐదున్నర లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, సుమారు 70 శాతం మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి అవసరమైన సాంకేతిక వసతులు సమకూర్చేందుకు ఐటీ సంస్థలు ఇంటర్నెట్ సేవలు అందించే డాంగుల్స్‌ను గంప గుత్తగా కొనుగోలు చేశాయి. గతంలో రూ.999 మేర పలికిన డాంగుల్ ధర ప్రస్తుతం రెండింతలు పలుకుతోంది. మరోవైపు మార్చి రెండో వారం నుంచి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల కోసం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. గతంలో ఉన్న బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్యతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో కేవలం పక్షం రోజుల వ్యవధిలో మూడింతలు పెరిగినట్లు సర్వీస్ ప్రొవైడర్లు చెప్తున్నారు. ఆన్లైన్లోనే గడుపుతున్న జనం లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన జనం ఎక్కువ సమయం ఆన్లైన్లోనే గడుపుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల వినియోగం పెరగడంతో పాటు వినోదం కోసం ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో మొబైల్ ఇంటర్నెట్ వాడకం కూడా గణనీయంగా పెరిగిందని టెలికం సంస్థలు చెప్తున్నాయి. బ్యాం కింగ్ లావాదేవీలు కూడా ఆన్లైన్ విధానంలో జరుగుతుండటం కూడా ఇంటర్నెట్ వాడకం పెరిగేందుకు దోహదం చేస్తోంది. దేశవ్యాప్తంగా మార్చి రెండో వారంతో పోలిస్తే ప్రస్తుతం 30 శాతం మేర డేటా వినియోగం పెరగ్గా, మెట్రో నగరాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆన్లైన్ వినియోగం పెరిగిపోవడంతో రద్దీ పెరిగి ఇంటర్నెట్ వేగం తగ్గినట్లు వినియోగదారులు చెప్తున్నారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెరిగిన ఇంటర్నెట్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన సేవలు అందించేందుకు టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ) ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాయి. సమాచార, వినోద రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) సర్వీస్ ప్రొవైడర్లు వీడియోల నాణ్యతను తగ్గించాయి. వీడియో నాణ్యతను తగ్గించడం ద్వారా సుమారు 20% మేర డేటాను పొదుపు చేయ డం సాధ్యమవుతుందని ఓటీటీ సర్వీస్ ప్రొవైడర్లు చెప్తున్నారు. మరోవైపు పెరిగిన ఇంటర్నెట్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని టెలికామ్ సంస్థలు, ఐఎస్పీలు బ్యాండ్‌విడ్త్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రంలో బలమైన ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ వ్యవస్థ, డేటా సెంటర్లు ఉన్నందున బ్యాండ్‌విడ్త్ (సామర్థ్యం) పెంచడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. -
కరోనా ఎఫెక్ట్‌తో డేటాకు భారీ డిమాండ్
సాక్షి, అమరావతి: కరోనా (కోవిడ్–19) వైరస్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. గడచిన నాలుగు రోజుల నుంచి ఇంటర్నెట్ డేటా వినియోగంలో 20 నుంచి 25 శాతం వృద్ధి కనిపిస్తోందని, ఇది రానున్న కాలంలో మరింత పెరుగుతుందని టెలికాం, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు పేర్కొన్నారు. - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కలిపి రిలయన్స్ జియో చందాదారులు సగటున రోజూ 5,000 టెట్రాబైట్స్ డేటాను వినియోగిస్తుంటే అది ఇప్పుడు 6,000 టెట్రాబైట్స్‌కు పెరిగింది. - గతంలో రిలయన్స్ జియో చందాదారుడు నెలకు సగటున 11 నుంచి 15 జీబీ డేటాను వినియోగించే వారు. ఇప్పుడది మరో 25 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా. - కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో పెద్దసంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు ఇంటి నుంచే పని చేసేందుకు మొగ్గుచూపుతుండటంతో డేటాకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. - బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో చాలా కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించడంతో ఒక్కసారిగా వ్యక్తిగత డేటా వినియోగంలో డిమాండ్ పెరిగింది. ఈ రెండు నగరాల నుంచి చాలా మంది రాష్ట్రంలోని సొంత ఊర్లకు వచ్చి ఇక్కడి నుంచే పనిచేస్తున్నారు. - పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా పూర్తి సమర్థతతో ఉన్నామని, ట్రాఫిక్ ఇంకా పెరిగినా నెట్‌వర్క్‌లు స్తంభించే అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ప్రొవైడర్లు స్పష్టం చేస్తున్నారు. - రిలయన్స్, ఎయిర్టెల్ వంటి సంస్థలు డిమాండ్‌కు అనుగుణంగా సరికొత్త టాప్అప్ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. - వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యమా అని ఒక్కసారిగా ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, డాంగిల్స్‌కు డిమాండ్ పెరిగింది. -
ఆలోచనలనూ పసిగట్టేస్తారు..
సాక్షి, హైదరాబాద్ : ఒకనాడు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం సంపాదించాలంటే మంచి స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీషు అనర్గలంగా మాట్లాడగలగాలి. అవి ఉంటే యువతకు ఉద్యోగం వచ్చినట్లే. ఇప్పుడు ట్రెండ్ మారింది. వాటితో ముఖ్యంగా ఉద్యోగం సంపాదించాలంటే ప్రతిభ, బహుభాషా నైపుణ్యంతో పాటు మంచి వ్యక్తిత్వం ఉండాలని సంస్థలు కోరుకుంటున్నాయి. ప్రపంచం కుగ్రామం అయిన తర్వాత ఇంటర్నెట్ వినియోగం హద్దులు దాటుతోంది. చేతిలో సెల్‌ఫోన్ లేనిదే పక్కమీద నుంచి యువతీ – యువకులు లేవలేని పరిస్థితి. ఈ మధ్య యువత విపరీతంగా నెట్టింట్లో బందీ అవుతున్నారు. దీని ప్రభావం కార్పొరేట్ ఉద్యోగ నియామకాలపై పడుతోంది. తమ సంస్థలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఫేస్బుక్, ట్విట్టర్ తదితర ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఆయా సంస్థల మానవనరుల విభాగం సిబ్బంది అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నాయి. అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో యువత ఇటీవల ఎక్కువగా సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. దీనిలో ఫేస్‌బుక్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేచింది మొదలు ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఉన్నాం అంశాలను స్నేహితులతో పంచుకుంటున్నారు. వీటిలో కొన్ని వ్యక్తిగత అంశాలు కూడా ఉంటున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు, ప్రైవేటు సంస్థలు రహస్యంగా ఉద్యోగుల మానసిక పరిపక్వతను అంచానా వేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో వ్యక్తిత్వాన్ని పసిగడుతూ ఓ అంచనాకు వస్తున్నాయి. తమ సంస్థల్లో కొలువుకోసం పోటీ పడే అభ్యర్థులకు తెలియకుండానే యాజమాన్యాలు ఆ అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వీరవిహారం చేసే యువత జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలో లక్షల మంది యువత నిత్యం అంతర్జాలంలో మునిగి తేలుతున్నట్లు అంచనా. వ్యక్తిత్వానికి ప్రయారిటి గతంలో ఉద్యోగంలోకి తీసుకునే ముందు ఆ వ్యక్తి గుణగణాలు తెలుసుకోవడానికి ఇద్దరు పెద్ద మనుషులతో సంతకాలు తీసుకునేవారు. కాలం మారుతోంది. అందుకు అనుగుణంగా సంస్థలు గతంలో తమ ఉద్యోగుల నియామకాల్లో అభ్యర్థి ప్రతిభాపాటవాలతో పాటు , ఆంగ్ల పరిజ్ఞానం, సామాజిక అంశాలపై పట్టు చూసేవారు. ఇప్పుడు వీటికితోడు అభ్యర్థి వ్యవహారశైలి, మనస్తత్వం తదితరాలు తెలుసుకునేందుకు సామాజిక మాధ్యమాలపై నిఘా పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉంచే ఫొటోలు, వ్యక్తి తాలుకా సెల్ఫీలు వ్యక్తిత్వాన్ని బయటపెడుతున్నాయంటున్నారు. విదేశాల్లో అమలవుతున్న ఈ విధానం మన దేశంలో దాదాపు 50 శాతంపైగా సంస్థలు అమలు చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు అర్హతలు కోల్పోతున్న యువత.. ఇటీవల యూకేలో ఫేస్బుక్ ఖాతాలపై అధ్యయనం చేసిన ఓ సంస్థ వ్యక్తి తాను ఆ ఖాతాలో పెట్టిన వార్త, ఫొటోలకు లైక్‌లు వస్తున్నాయో చూసుకోవటం పెరిగిందని, ఇది ఓ రకమైన మానసిక వ్యాధిగా ఉందని తెలిపింది. వచ్చే లైక్‌లపై జోరుగా పందేలు కూడా జరుగుతున్నాయి. మా ఖాతాల గురించి ఇతరులకు ఎలా తెలుస్తుంది. అనే అనుమానం రావడం సహజం, ఉద్యోగానికి దరఖాస్తు చేసే సమయంలో పొందుపర్చిన ఈ మెయిల్ ఐడీ ఆధారంగా అతని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, అర్కుట్ వంటి సైట్లలోని అభ్యర్థి ఖాతాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాలకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల్లో చాలా మంది ఆ విధానంలో అర్హతలను కోల్పోతున్నట్లు అనధికారిక సమాచారం. అతి అనర్థం గతంలో పోల్చితే యువతలో అంతర్జాల వినియోగం బాగా పెరిగింది. చాలా మంది ఫేస్‌బుక్‌లు వినియోగిస్తున్నారు. దానిలో పెట్టే పోస్టింగ్‌లు, షేరింగ్‌లు పంచుకునే అభిప్రాయాలతో వ్యక్తి ఆలోచనలను, విపరీత ధోరణలను అంచనా వేయవచ్చు. తమ ఖాతాల్లో పోస్టింగ్‌లు పెట్టే యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉద్యోగ నియామకాల్లో వీటిని పరిగణలోకి తీసుకుంటున్నాయని గుర్తించాలి. – డాక్టర్ బివి పట్టాభిరామ్. -
డిజిటల్ ఇండియా ఎక్కడా?
మనం పదే పదే వల్లెవేసే డిజిటల్ ఇండియాలో ప్రతి నలుగురిలో ఒక్కరు మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్టు తాజా పరిశోధన తేల్చి చెప్పింది. 2017 లో అతి తక్కువ మంది వయోజనులు ఇంటర్నెట్ వినియోగంలో భారత్‌దే ప్రథమ స్థానమని ప్యూ(పీడబ్ల్యూ) పరిశోధనా సంస్థ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. అత్యధికంగా 96 శాతం మంది మేజర్లు ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న దేశంగా దక్షిణ కొరియా ప్రథమ స్థానంలో ఉన్నట్టు 37 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వే వెల్లడించింది. భారతదేశంలో స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్న మేజర్లు 2013 లో12 శాతం ఉంటే, 2017లో పదిశాతం పెరిగి 22 శాతానికి చేరింది. సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 8 శాతం నుంచి గత యేడాది 12 శాతానికి పెరిగి ప్రస్తుతం 20 శాతానికి చేరింది. దీనర్థం మన దేశంలో 78 శాతం మంది మేజర్లు స్మార్ట్ఫోన్లు కలిగిలేరు. 80 శాతం మందికి ఫేస్బుక్, ట్విట్టర్ గురించి అవగాహన లేదు. అభివృద్ధి చెందుతోన్న, చెందిన దేశాలకూ మధ్య ఇంటర్నెట్ వాడకంలో ఉన్న వ్యత్యాసం కొంత తగ్గినప్పటికీ, ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగించని ప్రాంతాలు ఇంకా అనేకం ఉన్నట్టు అధ్యయనం స్పష్టం చేస్తోంది. -
భళా...భారత్!
ఇంటర్నెట్ వాడకంలో దూసుకుపోతున్న భారత్ ఇంటర్నెట్ వాడకంలో భారత్ రోజురోజుకి అభివృద్ధి చెందుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గత పదేళ్లతో పోల్చి చూస్తే భారత్‌లో ఇంటర్నెట్ వాడకం ఆశించిన స్థాయిలో కంటే ఎక్కువగానే వృద్ధి చెందిందని ‘అకామయ్’ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ ‘ది స్టేట్ ఆఫ్ ది ఇంటర్నెట్ క్యూ3– 2016’ పేరిట తన నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఇంటర్నెట్ వాడకంలో భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దినదినాభివృద్ధి చెందుతుందని నివేదికలో పేర్కొంది. -
మొబైల్ డాటా ఎక్కువగా వాడేది వారే!
హెల్సింకి: మొదట ఫోన్ మాట్లాడటానికే పరిమితమైన మొబైల్‌ఫోన్ ఇప్పుడు అన్నీ తానై కూర్చుంది. మెయిల్స్ చెక్ చేసుకోవడం దగ్గర నుంచి న్యూస్, చాటింగ్, వీడియోలు, యాప్స్ ఇలా మొబైల్ ఫోన్ల వినియోగం చెప్పలేనంత పెరిగిపోయింది. అయితే మొబైల్లో ఇలాంటి ఏ సర్వీస్‌ను వాడాలన్నా ఇంటర్నెట్ డేటా తప్పనిసరైంది. మొబైల్, ట్యాబ్‌లలో ఇంటర్నెట్ డాటాను ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగిస్తున్న దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. ఈ ఏడాది తొలి అర్థభాగంలో ఇంటర్నెట్ డాటా వినియోగంపై స్వీడష్ టెలీకమ్మూనికేషన్ సంస్థ టెఫీసియంట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 32 యూరోపియన్, ఆసియా దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన ఉత్తర కొరయా కంటే ఫిన్లాండ్ వాసులు రెండింతలు డాటా ఎక్కువగా వాడి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. అక్కడ డాటా చార్జీలు చౌకగా ఉండటం దీనికి కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
మూడేళ్లలో 55 కోట్ల మంది నెటిజన్లు
న్యూఢిల్లీ: దేశీయంగా ఇంటర్నెట్ను ఉపయోగించే వారి సంఖ్య 2018 నాటికల్లా 55 కోట్ల స్థాయికి చేరుకోనుందని కన్సల్టెన్సీ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ఒక నివేదికలో వెల్లడించింది. నెట్ వినియోగంపై అవగాహన పెరుగుతుండటం, అందుబాటు రేట్లలో ఇంటర్నెట్ లభిస్తుండటం ఇందుకు తోడ్పడనుంది. 2014లో నెటిజన్ల సంఖ్య 19 కోట్లుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య 13 కోట్ల నుంచి 30 కోట్లకు పెరగగలదని బీసీజీ పేర్కొంది. నెట్ వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 40% మేర పెరిగే అవకాశం ఉందని వివరించింది. గ్రామీణ ప్రాంతాల్లో గతేడాది 6 కోట్లుగా ఉన్న నెటిజన్ల సంఖ్య 2018 నాటికి 28 కోట్లకు పెరగొచ్చని పేర్కొంది. నెట్ వాడకానికి అనువైన పరికరాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నెట్వర్క్ లభ్యత కూడా మరింత పెరగాల్సిన అవసరం ఉంటుందని వివరించింది. భారత్‌లో అమ్ముడవుతున్న మొబైల్స్‌లో మూడింట రెండొంతుల ఇంటర్నెట్కి అనువైనవేనని బీసీజీ తెలిపింది. అయితే అత్యంత చౌకైన వాటి రేట్లు కూడా 60 డాలర్ల పైనే ఉంటున్నాయని, వీటి రేట్లు మరింత తగ్గాల్సిన అవసరం ఉందని వివరించింది. -
హైదరాబాద్ ఇంటర్నెట్ యూజర్స్ 22,00,000
హైదరాబాద్: మహానగరంలో ఇంటర్నెట్ వినియోగం అధికంగా పెరిగింది. నాలుగేళ్ల క్రితం వరకు ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి అంతర్జాలాన్ని వినియోగించేవారిలో మార్పు వచ్చింది. తమ ఇంటికే నేరుగా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటున్నారు. బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిల్టెల్ తదితర పెరొందిన కంపెనీలతో పాటు సుమారు 200 వరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. నెట్ కనెక్షన్‌దారుల సంఖ్య సుమారు 22 లక్షల వరకు ఉంటుందని అంచనా. మరోవైపు సుమారు 10 లక్షల వరకు మొబైల్ కనెక్షన్ దారులు ఇంటర్నెట్ యూజర్లుగా మారారు. -
ఇంటర్నెట్ యూజర్లు@ 24 కోట్లు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. మొబైల్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేసే వినియోగదారులు బాగా పెరుగుతుండటంతో ఈ ఏడాది జూన్ కల్లా భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 28 శాతం వృద్ధితో 24.3 కోట్లకు చేరుతుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) తెలిపింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..., గతేడాది జూన్‌నాటికి భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 19 కోట్లుగా ఉంది. 2012లో 15 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ ఉపయోగించేవారి సంఖ్య 2013లో 42 శాతం వృద్ధి చెంది 21.3 కోట్లకు పెరిగింది. 2012లో 6.8 కోట్లుగా ఉన్న మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2013లో 92% వృద్ధితో 13 కోట్లకు చేరింది. ఇక ఈ ఏడాది జూన్‌కల్లా వీరి సంఖ్య 18.5 కోట్లకు పెరుగుతుందని అంచనా. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల వాటా 76%గా ఉంటుంది. ఇంటర్నెట్ వినియోగం వృద్ధి చెందుతున్న కారణంగా ఇ-కామర్స్, డిజిటల్ అడ్వర్టైజింగ్ కూ డా చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతున్నాయి. 2012 ఏడాది చివరినాటికి రూ.47,349 కోట్లుగా ఉన్న డిజిటల్ కామర్స్ మార్కెట్ గతేడాది చివరి కల్లా రూ.62,967 కోట్లకు వృద్ధి చెందింది. ఇక డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్ ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,938 కోట్లకు చేరుతుంది. -
బ్రిటన్‌లో 73 శాతం కొనుగోళ్లు ఆన్లైన్లోనే
మీరు ఇంటర్నెట్ ఎంతవరకు ఉపయోగిస్తారు? గట్టిగా మాట్లాడితే భారతదేశంలో ఎంతమంది రోజూ ఉపయోగిస్తున్నారు.. అది కూడా ఆన్లైన్ షాపింగ్ కోసం ఏమాత్రం ఉపయోగపడుతోంది? మన దేశం మాటేమిటో గానీ, ఇంగ్లండ్‌లో మాత్రం ఏకంగా 73 శాతం మంది తమకు కావల్సిన వాటన్నింటినీ కేవలం ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారట. ఈ విషయం అక్కడి ప్రభుత్వం వెల్లడించిన వివరాల్లో తేలింది. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటస్టిక్స్ (ఓఎన్ఎస్) లెక్కల ప్రకారం, బ్రిటన్‌లో ప్రస్తుతం 3.6 కోట్ల మంది పెద్దలు లేదా, మొత్తం జనాభాలో దాదాపు 73 శాతం మంది ప్రతిరోజూ ఇంటర్నెట్ ఉపయోగస్తున్నారు. 2006 సంవత్సరంలో కేవలం 2 కోట్ల మందే ఉపయోగించగా, ఇప్పుడీ సంఖ్య గణనీయంగా పెరిగిందన్నమాట. 2.1 కోట్ల కుటుంబాలు లేదా మొత్తం కుటుంబాల్లో 83 శాతం వాటికి ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ప్రజల రోజువారీ జీవన విధానాన్ని ఇంటర్నెట్ శరవేగంగా మార్చేసిందని ఓఎన్ఎస్ తెలిపింది. పెద్దల్లో మూడింట రెండొంతుల మంది ఇంటర్నెట్ వాడుతుండగా, ప్రతి పదిమందిలో ఆరుగురు మొబైల్‌ఫోన్ లేదా పోర్టబుల్ కంప్యూటర్లను ఇంటర్నెట్ కోసం ఉపయోగిస్తున్నారట. అయితే, బ్రిటన్‌లోని దాదాపు 40 లక్షల కుటుంబాలు లేదా.. మొత్తం కుటుంబాల్లో 17 శాతం మందికి ఇప్పటికీ అసలు ఇంటర్నెట్ సౌకర్యమే లేదు. ఇక నెట్ వాడకంలో వివరాలు చూస్తే, దాదాపు సగం మందికి పైగా వార్తా పత్రికలు చదవడానికి లేదా డౌన్లోడ్ చేయడానికే ఉపయోగిస్తున్నారు. దీంతో వార్తా పత్రికలు కొని చదవడం బాగా తగ్గిపోయింది. సోషల్ నెట్వర్కింగ్ కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగిందని ఓఎన్ఎస్ చెప్పింది. తమకు ఇంట్లో కావల్సిన వస్తువులు కొనుగోలు చేయడానికి 72 శాతం మంది ఆన్లైన్ స్టోర్స్ మీదే ఆధారపడుతున్నారు. 2008లో ఈ సంఖ్య 53 శాతం మాత్రమే. బ్రిటిష్ మహిళల్లో సగం మంది తమ దుస్తులను కూడా ఆన్లైన్లోనే కొంటున్నారు.