Internet In 2021: This Happened In Every Minute At World Wide Web? Details Inside - Sakshi
Sakshi News home page

Internet In 2021: ఇంటర్నెట్‌.. కేవలం ఒక్క నిమిషంలో జరిగే విధ్వంసం గురించి తెలుసా?

Published Tue, Jan 11 2022 1:07 PM | Last Updated on Tue, Jan 11 2022 1:32 PM

Internet In 2021 This Happened In Every Minute At World Wide Web - Sakshi

ఇంటర్నెట్‌ ఒక గ్లోబల్‌ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌. ఈ భూమ్మీద అతిపెద్ద కమ్యూనికేషన్‌ వ్యవస్థ. యూజర్లకు వివిధ రకాల సమాచారంతో పాటు పరస్పర సంభాషణల కోసం సౌకర్యాలు అందిస్తున్న వేదిక. అలాంటి వేదికపై ఒక్క నిమిషంలో జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో తెలుసా?


వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వెబ్‌సైట్‌ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. 2021లో వివిధ ఇంటర్నెట్‌ ప్లాట్‌ఫామ్స్‌(సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కలిపి)లో ఒక్క నిమిషంలో ఏమేం జరిగిందో వివరించింది. బ్రౌజింగ్‌, స్ట్రీమింగ్‌, అప్‌లోడ్‌, డౌన్‌లోడ్‌.. ఇలా మొత్తం వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించి లోరీ లూయిస్‌ అనే ఆవిడ.. ఈ వివరాల్ని ఆల్‌యాక్సెస్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వీటి ఆధారం ఏం తేలిందంటే..
 

  • యూట్యూబ్‌.. 500 గంటల నిడివి ఉన్న కంటెంట్‌ కేవలం ఒక్క నిమిషంలోనే అప్‌లోడ్‌ అయ్యింది.
     
  • ఇంటర్నెట్‌లో 197 మిలియన్లకు పైగా ఈమెయిల్స్‌ పంపించుకుంటున్నారు.
     
  • వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లలో నిమిషానికి 69 మిలియన్ల మెసేజ్‌లు పంపించుకున్నారు.
     
  • ఇన్‌స్టాగ్రామ్‌లో నిమిషానికి దాదాపు ఏడు లక్షల స్టోరీలు షేర్‌ అవుతున్నాయి.
     
  • ప్రొఫెషనల్‌ సైట్‌ లింక్డిన్‌లో సుమారు పదివేల మంది కనెక్ట్ అవుతున్నారు. 
     
  • టిక్‌టాక్‌ లాంటి వీడియో కంటెంట్‌ జనరేటింగ్‌ యాప్‌లో ఐదు వేల డౌన్‌లోడ్‌లు చేస్తున్నారు
     
  • నెట్‌ఫ్లిక్స్‌లో నిమిషానికి 28 వేలకు పైగా సబ్‌స్క్రయిబర్స్‌ వీక్షణ కొనసాగుతోంది. 


నోట్‌: మరికొన్ని అంశాలపై పరిశోధన జరిగినప్పటికీ.. పూర్తి స్థాయి లెక్కలు తేలకపోవడంతో ఈ లిస్ట్‌లో జత చేర్చలేదు. ఆన్‌లైన్‌ షాపింగ్‌, మరికొన్ని ప్లాట్‌ఫామ్‌ల వివరాలు పొందుపర్చలేదు. ఇది కేవలం  ఆల్‌యాక్సెస్‌ డేటా మాత్రమే!.

ఇంటర్నెట్‌ ఉపయోగం వల్ల లాభాలు మాత్రమే కాదు.. భూమ్మీదకు కర్బన ఉద్గారాలు విడుదలై వినాశం వైపు అడుగులు కూడా వేస్తోంది. అందుకే ఇంటర్నెట్‌ యూసేజ్‌ను తగ్గించాలని, పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు పర్యావరణ నిపుణులు.

ఇంటర్నెట్‌లో డాటాను లెక్కించడం కష్టమే!. ఒక అంచనా ప్రకారం మాత్రం.. ఒకరోజులో 1.145 ట్రిలియన్‌ ఎంబీ క్రియేట్‌ అవుతోంది.


చదవండి: మళ్లీ అదే అంధకారమా!.. 20 ఏళ్లు వెనక్కి వెళ్లక తప్పదా?

 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement