One minute
-
‘మీరెవరండీ బాబూ’.. ఇదెలా ఎలా సాధ్యం?
‘ఎన్ని పాటలు పాడగలరు?’ అని అడిగితే ‘ఎన్నయినా సరే’ అంటారు పాటలను ప్రేమించే గాయకులు. ‘ఒకే ఒక్క నిమిషంలో ఎన్ని పాడగలరు?’ అని అడిగితే మాత్రం– ‘మీరెవరండీ బాబూ’ అంటారు. అయితే సాత్ కొరియాకు చెందిన ఒక యువ జంట ఇండోనేషియా నుంచి ఇండియా (బాలీవుడ్ సినిమా సుఖూన్లోని దిల్ కో ఖరార్ ఆయా.. పాట) వరకు తొమ్మిది భాషలలో 13 పాటలు పాడారు. ఈ వీడియో 2.1 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ‘ఇది సరేగానీ.. ఒక్క నిమిషంలో 13 పాటలు ఎలా సాధ్యం?’ అనే సందేహం అందరికీ వస్తుంది. 13 పాటలలోని ఒక్కో చరణాన్ని తీసుకొని ఒకే పాటలా చాలా స్పీడ్‌గా పాడారు. చదవండి: ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే? -
ఒక్క నిమిషానికి ఇంటర్నెట్లో జరిగే విధ్వంసం గురించి తెలుసా?
ఇంటర్నెట్ ఒక గ్లోబల్ కంప్యూటర్ నెట్వర్క్. ఈ భూమ్మీద అతిపెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థ. యూజర్లకు వివిధ రకాల సమాచారంతో పాటు పరస్పర సంభాషణల కోసం సౌకర్యాలు అందిస్తున్న వేదిక. అలాంటి వేదికపై ఒక్క నిమిషంలో జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో తెలుసా? వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెబ్సైట్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. 2021లో వివిధ ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్స్(సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కలిపి)లో ఒక్క నిమిషంలో ఏమేం జరిగిందో వివరించింది. బ్రౌజింగ్, స్ట్రీమింగ్, అప్లోడ్, డౌన్లోడ్.. ఇలా మొత్తం వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించి లోరీ లూయిస్ అనే ఆవిడ.. ఈ వివరాల్ని ఆల్‌యాక్సెస్ వెబ్సైట్లో పొందుపరిచింది. వీటి ఆధారం ఏం తేలిందంటే.. యూట్యూబ్.. 500 గంటల నిడివి ఉన్న కంటెంట్ కేవలం ఒక్క నిమిషంలోనే అప్లోడ్ అయ్యింది. ఇంటర్నెట్లో 197 మిలియన్లకు పైగా ఈమెయిల్స్ పంపించుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్లలో నిమిషానికి 69 మిలియన్ల మెసేజ్‌లు పంపించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిమిషానికి దాదాపు ఏడు లక్షల స్టోరీలు షేర్ అవుతున్నాయి. ప్రొఫెషనల్ సైట్ లింక్డిన్లో సుమారు పదివేల మంది కనెక్ట్ అవుతున్నారు. టిక్‌టాక్ లాంటి వీడియో కంటెంట్ జనరేటింగ్ యాప్‌లో ఐదు వేల డౌన్లోడ్లు చేస్తున్నారు నెట్‌ఫ్లిక్స్‌లో నిమిషానికి 28 వేలకు పైగా సబ్‌స్క్రయిబర్స్ వీక్షణ కొనసాగుతోంది. నోట్: మరికొన్ని అంశాలపై పరిశోధన జరిగినప్పటికీ.. పూర్తి స్థాయి లెక్కలు తేలకపోవడంతో ఈ లిస్ట్‌లో జత చేర్చలేదు. ఆన్లైన్ షాపింగ్, మరికొన్ని ప్లాట్‌ఫామ్‌ల వివరాలు పొందుపర్చలేదు. ఇది కేవలం ఆల్‌యాక్సెస్ డేటా మాత్రమే!. ►ఇంటర్నెట్ ఉపయోగం వల్ల లాభాలు మాత్రమే కాదు.. భూమ్మీదకు కర్బన ఉద్గారాలు విడుదలై వినాశం వైపు అడుగులు కూడా వేస్తోంది. అందుకే ఇంటర్నెట్ యూసేజ్‌ను తగ్గించాలని, పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు పర్యావరణ నిపుణులు. ►ఇంటర్నెట్లో డాటాను లెక్కించడం కష్టమే!. ఒక అంచనా ప్రకారం మాత్రం.. ఒకరోజులో 1.145 ట్రిలియన్ ఎంబీ క్రియేట్ అవుతోంది. చదవండి: మళ్లీ అదే అంధకారమా!.. 20 ఏళ్లు వెనక్కి వెళ్లక తప్పదా? -
దిగ్గజ కంపెనీలు.. ఒక్క నిమిషపు ఆదాయమెంతో తెలుసా?
సాక్షి, వెబ్‌డెస్క్: అమెజాన్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, నెట్‌ఫ్లిక్స్.. దిగ్గజ కంపెనీలుగా ఒక వెలుగు వెలుగుతున్నాయి. రకరకాల సర్వీసులతో ఈ బడా బడా కంపెనీలు ప్రజలకు చేరువ అయ్యాయి.. ఇంకా అవుతూనే ఉన్నాయి. వాటి ద్వారా వెళ్తున్న ఆదాయం బిలియన్ల డాలర్లలో ఉంటుందన్నది ఊహించిందే. కానీ, ఆ కంపెనీలు నిమిషానికి ఎంత సంపాదిస్తాయో ఊహించగలరా? ఈ క్యూరియాసిటీని గుర్తించిన టెక్ నిపుణుడు..జర్నలిస్ట్ జోన్ ఎర్లిచ్‌మన్ ఒక అంచనాతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అమెజాన్ కంపెనీ నిమిషం రెవెన్యూ 8,37,000 అమెరికన్ డాలర్లు(మన కరెన్సీలో ఆరున్నర కోట్ల రూపాయల దాకా ఉండొచ్చు)!, ఆ తర్వాతి ప్లేస్‌లో యాపిల్ 6,92,000 డాలర్లు(ఐదు కోట్లుపైనే) ఉంది. గూగుల్ 4,23,000 డాలర్లు(మూడు కోట్ల రూపాయలపైనే), మైక్రోసాఫ్ట్ 3,22,000 డాలర్లు, ఫేస్బుక్ రెవెన్యూ నిమిషానికి 2,02,000 డాలర్లు, డిస్నీ కంపెనీ లక్షా ఇరవై వేల డాలర్లు, టెస్లా ఎనభై వేల డాలర్లు, కోకా కోలా 70,000 డాలర్లు, నెట్‌ఫ్లిక్స్ 55 వేల డాలర్లు, కాఫీ స్టోర్ల ఫ్రాంఛైజీ స్టార్‌బక్స్ 52,000 డాలర్లు, మెక్ డొనాల్డ్స్ 40 వేలడాలర్లుగా నిమిషపు రెవెన్యూ ఉందని, ఇంటర్నేషనల్ మార్కెట్ లెక్కల ప్రకారం(జులై రెండోవారం).. ఇది ఒక అంచనా మాత్రమేనని ఎర్లిచ్‌మన్ స్పష్టం చేశాడు. ఇక రోజూ వారీ లాభం సుమారు యాపిల్ ఒక్కరోజు లాభం 240 మిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు 1,700 కోట్లు)గా ఉంది. గూగుల్ 182 మిలియన్ డాలర్లు, మైక్రోసాఫ్ట్ 162 మిలియన్ డాలర్లు, ఫేస్బుక్ 109 మిలియన్ డాలర్లు, అమెజాన్ 102 అమెరికన్ డాలర్లుగా ఉంది. మొత్తంగా వీటి రోజూవారీ లాభం అంతా కలిసి 795 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది. బిలియన్ సంపాదనకు.. 1994లో ప్రారంభమైన అమెజాన్ ఐదేళ్లలో బిలియన్ సంపాదన మార్క్‌ను చేరుకోగా, గూగుల్ ఐదేళ్లలో, యాపిల్ ఆరేళ్లలో, ఉబెర్ ఆరేళ్లలో, పేపాల్ ఏడేళ్లలో, ట్విటర్ ఎనిమిదేళ్లలో, నెట్‌ఫ్లిక్స్ తొమిదేళ్లలో బిలియన్ రెవెన్యూను ఖాతాలో వేసుకోగలిగాయి. -
ఒక రూపాయి డిపాజిట్ చేస్తే...
న్యూఢిల్లీ: పొదుపుఖాతాలపై ఇండస్ట్రీలోనే ఉత్తమ వడ్డీరేట్లు అందిస్తున్నామంటున్న ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ తన ఖాతాదారులను ఆకట్టుకునేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ బ్యాంక్‌లో నగదు డిపాజిట్ చేసిన ఖాతాదారుడికి అదనపు ప్రయోజనాలు అందిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో జమచేసే ఒక్కో రూపాయికి ఒక నిమిషం టాక్ టైమ్ ను అందిస్తోంది. వినియోగదారులకు ఎక్కువ వడ్డీ రేట్లు అందించడంతోపాటు పాటు ఈ అదనపు ప్రయోజనం ద్వారా ఎక్కువ ఖాతాదారులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ ఆఫర్ ఇస్తున్నట్టు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ , ఎండీ, సీఈఓ శశి అరోరా తెలిపారు. ఉదా : ఒక కస్టమర్ రూ .1000 లను పొదుపు ఖాతాలో జమచేస్తే అతను / ఆమెకి 1000 నిమిషాల ఉచిత టాక్ టైం లభిస్తుంది. ఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ కి దేశీయ కాల్స్ కోసం ఈ టాక్ టైంను వాడుకోవచ్చు. అలాగే మొదటిసారి డిపాజిట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కూడా బ్యాంక్ స్పష్టం చేసింది. కాగా పైలట్ ప్రాతిపదికన రాజస్థాన్ లో నవంబర్ 23 న ప్రారంభమైన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ 7.25శాతం వడ్డీ అందిస్తోంది.దీంతోపాటు లక్ష రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా క్పలిస్తోంది. నాన్ ఎయిర్ టెల్ కస్టమర్లు కూడా తన ప్రత్యేక ఎయిర్ టెల్ రీటైల్ కౌంటర్ల ద్వారా ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను తెరవచ్చని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..!
- రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ పట్నంబజారు : ఒక్క నిముషం ఆలస్యమైనా అనుమతించేదిలేదని రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ స్పష్టం చేశారు. నగరపాలెంలోని పోలీసు కల్యాణ మండపంలో జిల్లా అధికారులు, డీఎస్పీలు, సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న జరిగే ఎస్ఐ అభ్యర్థుల పరీక్షల నిర్వహణకు 21 కళశాలల్లో 37 సెంటర్లు కేటాయించినట్లు వెల్లడించారు. అనేక ప్రాంతాల నుంచి 19,559 మంది అభ్యర్థులు హాజరవతారన్నారు. ఉదయం పది గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్, వాచీలకు పరీక్ష హాల్లోకి అనుమతిలేదన్నారు. మధ్యాహ్నం అభ్యర్థులకు తక్కువ సమయం ఉన్నందున పరీక్ష ప్రాంగణాల్లోనే క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి మాట్లాడుతూ బయోమెట్రిక్ విధానం ద్వారానే విద్యార్థులను లోపలికి అనుమతిస్తామని తెలిపారు. రూరల్ జిల్లా ఎస్పీ కె. నారాయణ్‌నాయక్ మాట్లాడుతూ పరీక్ష సమయంలో అభ్యర్థులు అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ పి.సిధ్ధయ్య, అడిషనల్ ఎస్పీలు జె.భాస్కరరావు, బీపీ తిరుపాల్, డీఎస్పీలు జేవీ సంతోష్, కేజీవీ సరిత, బీరం నాగేశ్వరరావు, మెహార్బాబు, కండె శ్రీనివాసులు, బి.సీతారామయ్య, బి. శ్రీనివాస్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
నిమిషం ఆలస్యమైనా 'ఎంసెట్'కు అనుమతించం
హైదరాబాద్ : ఎంసెట్ పరీక్ష ఆదివారం నిర్వహిస్తామని ఆ పరీక్ష కన్వీనర్ రమణారావు శనివారం హైదరాబాద్‌లో తెలిపారు. ఈ పరీక్షకు 2.46 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.... అలాగే మెడికల్ పరీక్ష మ.2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా మిగతా 12 కోర్సులకు మెడికల్ ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 1,01,014 మంది విద్యార్థులు, ఇంజినీరింగ్ పరీక్షకు 1,43,516 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని రమణారావు స్పష్టం చేశారు. -
వన్ మినిట్
అప్పట్లో... ఓ ప్రైవేట్ కంపెనీలో... బిగ్ బి అమితాబ్ బచ్చన్ వెండితెరపై తొలిసారి కనిపించిన చిత్రం ‘సాత్ హిందుస్తానీ’. 1969లో ఈ చిత్రం విడుదలైంది. అప్పటికి అమితాబ్ కోల్‌కతాలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి అవకాశం రావడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. తొలిచిత్రం తర్వాత రెండేళ్లకు ‘ఆనంద్’లో నటించారు అమితాబ్. ఆ హిట్ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేకుండా పోయింది -
వన్ మినిట్
ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ‘స్త్రీ’ చిత్రానికి ప్రముఖ కథారచయిత రావిశాస్త్రి మాటలు రాశారు. 2004లో వచ్చిన హిందీ చిత్రం ‘క్యూ హో గయా నా’ చిత్రంలో ఐశ్వర్యా రాయ్ కథానాయికగా నటించారు. ఆమె స్నేహితురాలి పాత్రను కాజల్ అగర్వాల్ చేశారు. ఆ తరువాత మూడేళ్లకు ‘లక్ష్మీ కల్యాణం’తో తెలుగులో కథానాయికగా అరంగేట్రం చేశారు. గిరిబాబు తనయుడైన రఘుబాబు నటుడు కాకముందు కొన్ని కన్నడ, తమిళ సినిమాలను తెలుగులోకి అనువదించారు. అలాగే నటులు ఆహుతి ప్రసాద్, హరిప్రసాద్, సుధాకర్‌తో కలిసి ‘పోలీస్ భార్య’, ‘మధురా నగరి’లో చిత్రాలను కన్నడంలోకి రీమేక్ చేశారు. ఆ రెండూ మంచి విజయం సాధించాయి. -
వన్ మినిట్ !
ఒడిషా శాసనసభలో వాయిదాల పర్వం ఎవరి నిరసన వారిదే భువనేశ్వర్: శాసనసభ శీతాకాల సమావేశాలు మూడో రోజైన శనివారం ఒక్క నిమిషం మాత్రమే జరిగాయి. అధికార, విపక్షాల ఆందోళనతో మూడు రోజుల నుంచి కార్యక్రమాలు నిరవధికంగా వాయిదా పడుతున్నాయి. శనివారం కూడా అదే పరిస్థితి. పైలీన్ హుద్‌హుద్ తుపానులు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినా కేంద్ర ప్రభుత్వం సాయం అందించడం లేదని, దీనిపై సభలో తీర్మానించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్, బీజేపీ సహకరించడం లేదని బీజేడీ ఆరోపిస్తోంది. చిట్‌ఫండ్ అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్, బీజేపీ ఆందోళన చేస్తున్నాయి. తనను దూషించిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రదీప్ మహారథి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా ఎమ్మెల్యే రాధారాణి పండా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి ధర్నా చేస్తున్నారు. స్పీకర్ ప్రయత్నం విఫలం శీతాకాల సమావేశాలు మూడో రోజున ప్రారంభమైన వెంటన వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. రెండు రోజులుగా సాగుతున్న ఆందోళనపై తన చాంబర్లో చర్చించేందుకు రావాలని అఖిల పక్షాలకు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ మాటలు పూర్తికాకుండానే అధికార, విపక్ష కాంగ్రెస్ సభ్యులు బ్యానర్లతో ఆందోళన చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే రాధారాణి ధర్నా చేశారు. దీంతో స్పీకర్ ఉదయం 11.30 గంటల వరకు సభను వాయిదా వేశారు. అప్పటికీ పరిస్థితి కుదుట పడకపోవడంతో మధ్యాహ్నం 12.30కు, తర్వాత 3 గంటలకు వాయిదా వేశారు. సభ్యుల తీరు మారకపోవడంతో సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. తర్వాత 4.30 గంటలకు వాయిదా వేశారు. సరోజ్‌కు సీబీఐ పిలుపుతో... మధ్యాహ్నం 12.30 గంటలకు సభాకార్యాక్రమాలు వాయిదా వేసిన స్పీకర్, బీజేపీ మహిళా ఎమ్మెల్యేను దూషించిన అభియోగంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తర్వాత సభ సక్రమంగా సాగుతుందని అందరూ భావించారు. నవీన్ నివాస్‌లో బీజేడీ అధికారిక వ్యవహారాలను పర్యవేక్షించే సరోజ్ సాహుకు సీబీఐ కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందని సమాచారం చేరడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. చిట్‌ఫండ్ అక్రమాల్లో సీఎం నవీన్, బీజేడీకి ప్రత్యక్ష సంబంధాలు తెరపూకి వస్తున్నాయని, తమ ఆరోపణ వాస్తవమని తేలుతోందని విపక్షాలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా చిట్‌ఫండ్ అక్రమాలపై సభలో నిరవధిక చర్చకు సీఎం నిరాకరించడం, స్పీకర్ అనుమతించకపోవడం సరికాదని పేర్కొన్నాయి. పరిస్థితి చేయి దాటడంతో సాయంత్రం 4.30 గంటల వరకు వాయిదా వేయడం అనివార్యమైంది. మొత్తం మీద శనివారం కేవలం ఒక్క నిముషం మాత్రమే సభా కార్యక్రమాలు జరిగాయి. అధికార పక్షమే కారణం: నర్సింగ మిశ్రా శాసన సభలో నెలకొన్న పరిస్థితులకు అధికార బిజూ జనతా దళ్ సభ్యులే కారణమని కాంగ్రెస్ శాసనసభా నాయకుడు నర్సింగ మిశ్రా ఆరోపించారు. చిట్‌ఫండ్ మోసాలపై సభలో విస్తృత చర్చకు వీలుగా ప్రశ్నోత్తరాల్ని రద్దు చేయాలని స్పీక ర్ను కోరుతుండగా, బీజేడీ సభ్యులు బ్యానర్లతో స్పీకర్ వెల్‌వైపు దూసుకువచ్చారన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు తమదైన శైలిలో రంగంలోకి దిగినట్లు ఆయన వివరించారు. స్పీకరు విన్నపాన్ని అధికార బీజేడీ సభ్యులు పెడచెవిన పెట్టి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం విచారకరమని వ్యాఖ్యానించారు. కాగా, నర్సింగ మిశ్రా వ్యాఖ్యల్ని బీజేడీ అధికార ప్రతినిధి సమీర్ రంజన్ దాస్ ఖండించారు. -
పరుగున వెళ్లినా.. పరీక్షను అందుకోలేక..
-
ఎంసెట్ విద్యార్థులకు 'ఒక్క నిమిషం' పరీక్ష