నిమిషం ఆలస్యమైనా 'ఎంసెట్'కు అనుమతించం | Students late by one minute not allowed to appear Eamcet in Telangana | Sakshi
Sakshi News home page

నిమిషం ఆలస్యమైనా 'ఎంసెట్'కు అనుమతించం

Published Sat, May 14 2016 1:04 PM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

Students late by one minute not allowed to appear Eamcet in Telangana

హైదరాబాద్ : ఎంసెట్ పరీక్ష ఆదివారం నిర్వహిస్తామని ఆ పరీక్ష కన్వీనర్ రమణారావు శనివారం హైదరాబాద్లో తెలిపారు. ఈ పరీక్షకు 2.46 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.... అలాగే మెడికల్ పరీక్ష మ.2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా మిగతా 12 కోర్సులకు మెడికల్ ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 1,01,014 మంది విద్యార్థులు, ఇంజినీరింగ్ పరీక్షకు 1,43,516 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని రమణారావు స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement