చైనాలో అత్యధికం.. బంగ్లాదేశ్‌లో అత్యల్పం
2023లో 692 కోట్ల స్మార్ట్‌ఫోన్లు..
2024 చివరి నాటికి 713 కోట్లకు పైగా చేరుకుంటాయని అంచనా
భారత్‌లో 2023 నాటికి 65.90 కోట్ల స్మార్ట్‌ఫోన్లు...
2026 నాటికి 35జీబీకి చేరనున్న నెలవారీ డేటా వినియోగం
ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతోంది. కమ్యూనికేషన్, వెబ్ బ్రౌజింగ్, నావిగేషన్, వినోదం వంటి సేవలతోపాటు ఆర్థిక లావాదేవీలు, సామాజిక అవసరాల విషయంలో విస్తృత మార్పులు రావడంతో ప్రతి వ్యక్తికి స్మార్ట్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారింది. ఒక వ్యక్తి వద్ద ఒకటి కంటే ఎక్కువ కూడా స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. దీంతో 2023లో ప్రపంచ వ్యాప్తంగా 692 కోట్లు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. పట్టణాల్లో 83 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 78 శాతం స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.
ఇదే ఒరవడి కొనసాగితే 2025 నాటికి ప్రపంచ జనాభాలో 90.33 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉంటారని యూరప్‌కు చెందిన ఈ–కామర్స్ సేవలు అందిస్తున్న ఒబెర్లో అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. 2026 నాటికి 752 కోట్ల వరకు స్మార్ట్‌ఫోన్లు వినియోగదారుల చేతుల్లో ఉంటాయని ఆ సంస్థ అంచనా వేసింది. చైనాలో గత ఏడాది వరకు అత్యధికంగా 97.46 కోట్లు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో అత్యల్పంగా 5 కోట్లు మాత్రమే ఉన్నాయి. అయితే అమెరికా(27.61కోట్లు) కన్నా దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా మనదేశంలో 65.90 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. – సాక్షి, అమరావతి
ఫోన్‌లోనే ఇంటర్నెట్ వినియోగం అత్యధికం...
స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఇంటర్నెట్ వినియోగం సులభమైంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారుల్లో 200 కోట్ల మంది (57.14శాతం) స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా యాక్సెస్ చేశారు. ఇది 2025 నాటికి 72.6శాతాకి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2023లో నెలవారీ సగటు డేటా వినియోగం 14 జీబీగా ఉంటే.. 5జీ అందుబాటులోకి రావడంతో 2026 నాటికి 35జీబీకి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం ఇలా...
⇒ 83% సంభాషణలతో పాటుగా ఈ–మెయిల్, ఫొటోలు తీసుకోవడం
⇒ 76% ఇంటర్నెట్ సర్ఫింగ్
⇒ 73% బ్రౌజింగ్, మ్యాపింగ్, నావిగేషన్
⇒ 60% ఆన్‌లైన్ బ్యాంకింగ్
⇒ 59% వీడియో కాల్స్ మాట్లాడటం
⇒ 58% వీడియోలు తీసుకోవడం
⇒ 71% ఆన్‌లైన్ షాపింగ్
⇒ 67% సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం, చూడటం
⇒ 58% వార్తలు చదవడం/ సమాచారం ఇవ్వడం
⇒ 57% సాధారణ ప్రయోజన యాప్‌లు
⇒ 66% పాడ్ క్యాస్ట్‌లు
⇒ 52% గేమ్‌లు ఆడడం
⇒ 44% లాంగ్ వీడియోలు చూడటం
⇒ 65% షార్ట్ వీడియోలు చూడటం
⇒ 35% ఆన్‌లైన్ వీడియో గేమ్‌లు ఆడటం
Comments
Please login to add a commentAdd a comment