మొబైల్ డాటా ఎక్కువగా వాడేది వారే!
హెల్సింకి: మొదట ఫోన్ మాట్లాడటానికే పరిమితమైన మొబైల్‌ఫోన్ ఇప్పుడు అన్నీ తానై కూర్చుంది. మెయిల్స్ చెక్ చేసుకోవడం దగ్గర నుంచి న్యూస్, చాటింగ్, వీడియోలు, యాప్స్ ఇలా మొబైల్ ఫోన్ల వినియోగం చెప్పలేనంత పెరిగిపోయింది. అయితే మొబైల్‌లో ఇలాంటి ఏ సర్వీస్‌ను వాడాలన్నా ఇంటర్నెట్ డేటా తప్పనిసరైంది.
మొబైల్, ట్యాబ్‌లలో ఇంటర్నెట్ డాటాను ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగిస్తున్న దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. ఈ ఏడాది తొలి అర్థభాగంలో ఇంటర్నెట్ డాటా వినియోగంపై స్వీడష్ టెలీకమ్మూనికేషన్ సంస్థ టెఫీసియంట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 32 యూరోపియన్, ఆసియా దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన ఉత్తర కొరయా కంటే ఫిన్లాండ్ వాసులు రెండింతలు డాటా ఎక్కువగా వాడి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. అక్కడ డాటా చార్జీలు చౌకగా ఉండటం దీనికి కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.