ప్రతీకాత్మక చిత్రం
మనం పదే పదే వల్లెవేసే డిజిటల్ ఇండియాలో ప్రతి నలుగురిలో ఒక్కరు మాత్రమే ఇంటర్‌నెట్ వినియోగిస్తున్నట్టు తాజా పరిశోధన తేల్చి చెప్పింది. 2017 లో అతి తక్కువ మంది వయోజనులు ఇంటర్‌నెట్ వినియోగంలో భారత్‌దే ప్రథమ స్థానమని ప్యూ(పీడబ్ల్యూ) పరిశోధనా సంస్థ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. అత్యధికంగా 96 శాతం మంది మేజర్లు ఇంటర్‌నెట్‌కి కనెక్ట్ అయి ఉన్న దేశంగా దక్షిణ కొరియా ప్రథమ స్థానంలో ఉన్నట్టు 37 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వే వెల్లడించింది.
భారతదేశంలో స్మార్ట్ ఫోన్‌లు కలిగి ఉన్న మేజర్లు 2013 లో12 శాతం ఉంటే, 2017లో పదిశాతం పెరిగి 22 శాతానికి చేరింది. సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 8 శాతం నుంచి గత యేడాది 12 శాతానికి పెరిగి ప్రస్తుతం 20 శాతానికి చేరింది. దీనర్థం మన దేశంలో 78 శాతం మంది మేజర్లు స్మార్ట్‌ఫోన్‌లు కలిగిలేరు. 80 శాతం మందికి ఫేస్‌బుక్, ట్విట్టర్ గురించి అవగాహన లేదు. అభివృద్ధి చెందుతోన్న, చెందిన దేశాలకూ మధ్య ఇంటర్‌నెట్ వాడకంలో ఉన్న వ్యత్యాసం కొంత తగ్గినప్పటికీ, ప్రపంచంలో ఇంటర్‌నెట్ వినియోగించని ప్రాంతాలు ఇంకా అనేకం ఉన్నట్టు అధ్యయనం స్పష్టం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment