భళా...భారత్!
ఇంటర్నెట్ వాడకంలో దూసుకుపోతున్న భారత్
ఇంటర్నెట్ వాడకంలో భారత్ రోజురోజుకి అభివృద్ధి చెందుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గత పదేళ్లతో పోల్చి చూస్తే భారత్‌లో ఇంటర్నెట్ వాడకం ఆశించిన స్థాయిలో కంటే ఎక్కువగానే వృద్ధి చెందిందని ‘అకామయ్’ సంస్థ ప్రకటించింది.
ఈ సంస్థ ‘ది స్టేట్ ఆఫ్ ది ఇంటర్నెట్ క్యూ3– 2016’ పేరిట తన నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఇంటర్నెట్ వాడకంలో భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దినదినాభివృద్ధి చెందుతుందని నివేదికలో పేర్కొంది.