ఇప్పుడు మనం చెప్పుకోబోయే యాప్స్ తెగ వాడేస్తున్నారా? అయితే, మీకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఉబెర్, ఓలా, రాపిడో వంటి రైడ్-హైలింగ్ యాప్స్ వారి వినియోగదారులకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ సర్ఫ్ షార్క్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఈ డేటాను "తృతీయపక్ష ప్రకటనల" కోసం ఉపయోగిస్తున్నారు. సర్ఫ్ షార్క్ డేటా సెన్సిటివిటీ ఇండెక్స్ అనేది రైడ్-హైలింగ్ యాప్స్ అనేవి వారి వినియోగదారుల నుంచి ఏ రకమైన డేటా సేకరిస్తున్నాయో తెలియజేస్తుంది.
గ్రాబ్ టాక్సీ, యాండెక్స్ గో, ఉబెర్ కంపెనీల యాప్స్ ప్రపంచంలో అత్యంత ఎక్కువ డేటా సేకరిస్తున్న టాక్సీ యాప్స్'గా నిలిచాయి. వినియోగదారుల నుంచి డేటా సేకరిస్తున్న పరంగా స్వదేశీ రైడ్-షేరింగ్ యాప్ ఓలా 6వ స్థానంలో నిలిచింది. బెంగళూరుకు చెందిన రాపిడో ప్రముఖ గ్రాబ్ టాక్సీ యాప్ కంటే దాదాపు పది రెట్లు తక్కువ డేటాను సేకరిస్తుంది. వినియోగదారులకు సేవలను అందించడానికి యూజర్ పేరు, ఫోన్ నంబర్, స్థానాన్ని మాత్రమే సేకరిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. 3 అంశాల ఆధారంగా ఈ డేటా సేకరిస్తున్నట్లు సర్ఫ్ షార్క్ తెలిపింది. గ్రాబ్ టాక్సీ కాంటాక్ట్, ఫైనాన్షియల్, లొకేషన్ సమాచారం, యూజర్ కంటెంట్ వంటి వివరాలు కూడా సేకరస్తున్నట్లు ఇందులో తేలింది. ఉబెర్, లిఫ్ట్ కలిసి 7వ స్థానంలో నిలిచాయి. జాతి, జాతి, లైంగిక దృక్పథం, గర్భధారణ, ప్రసవ సమాచారం, బయోమెట్రిక్ డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించే ఏకైక రైడ్-హైలింగ్ యాప్ గా లిఫ్ట్ నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment