User data
-
రియల్మీ ఫోన్లలో వ్యక్తిగత డేటా సేకరణ? స్పందించిన కేంద్రమంత్రి
చైనాకు చెందిన మొబైల్ కంపెనీ రియల్మీ ఫోన్లలోని కాల్ లాగ్‌లు, లొకేషన్ సమాచారం, ఎస్సెమ్మెస్ వంటి వినియోగదారుల వ్యక్తిగత డేటాను సేకరిస్తోందని యూజర్లు ఆరోపిస్తున్నారు. రియల్మీ ఫోన్లలోని 'మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీసెస్' వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని క్యాప్చర్ చేస్తుందని, ఈ సర్వీస్ డిఫాల్ట్‌గా యాక్టివేట్ చేశారని పేర్కొంటూ ఓ యూజర్ చేసిన ట్వీట్‌కు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. దీనిని తనిఖీ చేస్తామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ను కూడా ఆయన ట్యాగ్ చేశారు. ‘రియల్మీ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్ డేటా (కాల్ లాగ్‌లు, ఎస్సెమ్మెస్, లొకేషన్ సమాచారం) క్యాప్చర్ చేసే ఫీచర్ (మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీసెస్) ఉంది. ఇది డిఫాల్ట్‌గా 'ఆన్'లో ఉంది. సెట్టింగ్‌లు -> అదనపు సెట్టింగ్‌లు -> సిస్టమ్ సేవలు -> మెరుగుపరచబడిన ఇంటెలిజెంట్ సర్వీసెస్‌కి వెళ్లినప్పుడు డిఫాల్ట్ ఫీచర్‌గా 'ఆన్' ఉండటం చూడవచ్చు. భారతీయ వినియోగదారుల అనుమతి లేకుండా వారి డేటాను సేకరిస్తున్నారు. ఇది డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉన్నందున ఇది బలవంతపు సమ్మతి. ఈ డేటా చైనాకు పంపుతున్నారా?’ అంటూ రిషి బాగ్రీ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ సర్వీస్ ఫీచర్ సెట్టింగ్‌ల కింద లోతుగా ఉండటంతో చాలా మంది వినియోగదారులకు దాని గురించి కూడా తెలియదు. కానీ ఈ ట్వీట్‌ను ఫాలో అయిన మరికొందరు యూజర్లు వన్‌ప్లస్ ఫోన్లలో కూడా ఇలాంటి ఫీచర్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఒప్పో, వివో, రియల్మీ కంపెనీలకు మాతృ సంస్థ బీబీకే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్. వన్‌ప్లస్ బ్రాండ్ కూడా ఒప్పో అనుబంధ సంస్థే. రియల్మీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 14.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. రియల్మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ ఇటీవలే తప్పుకున్నారు. ఉన్నట్టుండి తన పదవి రాజీనామా చేశారు. Will hv this tested and checked @rishibagree copy: @GoI_MeitY https://t.co/4hkA5YWsIg — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) June 16, 2023 -
Indian Railways: మన డేటాతో రైల్వే వ్యాపారం!
న్యూఢిల్లీ: ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ప్రయాణికుల డేటాపై దృష్టి సారించింది. వివిధ ప్రైవేట్, ప్రభుత్వ రంగ కంపెనీలకు ఈ డేటాను అందించే వ్యాపారం ద్వారా రూ. 1,000 కోట్ల వరకూ ఆదాయం సమకూర్చుకోవచ్చని (మానిటైజేషన్) అంచనా వేస్తోంది. అలాగే కస్టమర్లకు సదుపాయాలను, సర్వీసులను మరింత మెరుగుపర్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమలుకు విధి విధానాలను రూపొందించడానికి కన్సల్టెంట్ సర్వీసులను ఐఆర్సీటీసీ వినియోగించుకోనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా టెండరు ప్రకటన జారీ చేసింది. ఆతిథ్య, ఇంధన, మౌలిక, వైద్య తదితర రంగాల సంస్థలకు ఈ తరహా డేటా ఉపయోగకరంగా ఉండగలదని భావిస్తున్నట్లు టెండరు ప్రకటనలో పేర్కొంది. ఉదాహరణకు ట్రావెల్ సంస్థలతో ఈ డేటాను పంచుకుంటే.. ఆయా సంస్థలు తమ సర్వీసులు వినియోగించుకోవాలంటూ ప్రయాణికులకు వివరాలను పంపే అవకాశముంది. ‘‘భారతీయ రైల్వేస్ తన కస్టమర్/వెండార్ యాప్‌లు, అంతర్గత యాప్‌లలో ఉండే డేటాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని హోటల్, ట్రావెల్, బీమా, వైద్యం, ఏవియేషన్ తదితర విభాగాల సంస్థలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం ద్వారా మానిటైజ్ చేయదల్చుకుంది. తద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని .. అలాగే కస్టమర్లకు సదుపాయాలను, సేవలను మరింత మెరుగుపర్చవచ్చని భావిస్తోంది’’ అని వివరించింది. దీనికోసం ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ .. వినియోగదారు డేటాను ఈ విధంగా ఉపయోగించుకోవడంలో గోప్యతా నిబంధనలపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించవచ్చనే అంశంపై తగు సూచనలు చేయాల్సి ఉంటుంది. డేటా ప్రైవసీ విషయంలో చట్టాలు, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రణాళికను అమలు చేసేందుకు నిబంధనలను క్షుణ్నంగా అధ్యయం చేయా ల్సి ఉంటుంది. ప్రయాణికులు, రవాణా సేవలు ఉపయోగించుకునే కస్టమర్లు మొదలైన వర్గాల ప్రాథమిక డేటాను విశ్లేషించాలి. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, అయితే దీన్ని అమలు చేయాలంటూ రైల్వే బోర్డు నుంచి ఒత్తిడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రైవసీకి రిస్కులపై సందేహాలు... ప్రయాణికుల వ్యక్తిగత డేటాను ఇలా ఎవరికిపడితే వారికి ఇవ్వడమనేది వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లయ్యే అవకాశాలు ఉన్నా యని సీయూటీఎస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అమోల్ కులకర్ణి అభిప్రాయపడ్డారు. సాధారణంగా డేటాను క్రోడీకరించి, ఏ వివరాలు ఎవరివి అనేది బైటపడకుండా గోప్యంగాను, భద్రంగానూ ఉంచాలని ఆయన చెప్పారు. అయితే, గోప్యనీయతను పాటించకుండా ఐఆర్సీటీసీ గానీ ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు డేటాను ఇచ్చిన పక్షంలో ప్రైవసీ హక్కులకు భంగం కలగడంతో పాటు సదరు డేటా దుర్వినియోగానికి అవకాశాలు ఉన్నాయని కులకర్ణి పేర్కొన్నారు. అయితే, ఇలా డేటాను షేర్ చేసుకోవడం అక్రమం అనేందుకు తగిన చట్టాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ డేటాను షేర్ చేసుకుంటే దాన్ని తాను భద్రంగా ఉంచడంతో పాటు థర్డ్ పార్టీలు కూడా పటిష్టమైన ప్రమణాలు పాటించేలా ఐఆర్సీటీసీ చూడాల్సి ఉంటుందని కులకర్ణి చెప్పారు. రోజుకు 11 లక్షలకు పైగా టికెట్లు.. రైల్వే టికెట్లను బుక్ చేసుకునేందుకు ఏకైక మార్గంగా ఈ విషయంలో ఐఆర్సీటీసీకి గుత్తాధిపత్యం ఉంది. కంపెనీ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఐఆర్సీటీసీ ప్లాట్‌ఫాం ద్వారా 43 కోట్ల పైచిలుకు టికెట్లు బుక్ అయ్యాయి. రోజువారీ దాదాపు 63 లక్షల లాగిన్స్ నమోదయ్యాయి. 8 కోట్ల మంది పైగా యూజర్లు ఐఆర్సీటీసీ ఆన్లైన్ సేవలు వినియోగించుకుంటున్నారు. టికెట్ల బుకింగ్స్‌లో దాదాపు 46 శాతం వాటా మొబైల్ యాప్‌దే ఉంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీ దగ్గర భారీ స్థాయిలో ప్రయాణికుల డేటా ఉంటోంది. -
గూగుల్ కొత్త రూల్స్.. ఇక యాప్‌లు ఇన్స్టాల్ చేసేముందు అది తప్పనిసరి!
స్మార్ట్ ఫోన్లు వాడకం పెరిగినప్పటి నుంచి ప్రతీ సేవలు అరచేతిలోకి వచ్చాయనే చెప్పాలి. మనం ఆ సేవల కోసం ప్రత్యేకంగా సంబంధిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో దానికి అవసరమైన అనుమతులను ఇచ్చేస్తాం. ఇలా చేయడం వల్ల యూజర్లకు సంబంధించిన విలువైన సమాచారం సైబర్ నేరాగాళ్ల చేతిలోకి వెళ్తోందని వాదనలు ఇటీవల గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ డెవలపర్స్‌కు డేటా సేఫ్టీ పేరుతో కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్ల డేటా భద్రతకు భరోసా కల్పించనుంది. యాప్ డెవలపర్లకు ఇది చేయాల్సిందే.. కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం.. యూజర్లు యాప్‌లను ఇన్స్టాల్ చేసే సమయంలో యాప్ డెవలపర్ ఎలాంటి డేటా సేకరిస్తున్నారు, దాన్ని ఎవరితోనైనా పంచుకుంటున్నారా? అనే సమాచారాన్ని తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. అలా డెవలపర్ అందించిన సమాచారాన్ని గూగుల్ చెక్ చేసి నిబంధనలు పాటించిన యాప్‌లను తీసుకుని వాటిని యూజర్‌కు తెలిసేలా ప్లేస్టోర్‌లో ఉంచుతుంది. ఒకవేళ యాప్ డెవలపర్ యూజర్ డేటా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యకలపాలు జరిపినా తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటుంది. అందుకు జూలై 20 నాటికి ప్రతి యాప్ డెవలపర్ డేటా సేఫ్టీ డ్యాకుమెంట్ని సమర్పించాలని గూగుల్ స్పష్టం చేసింది. ఒకవేళ డేటా సేఫ్టీ నిబంధనలను పాటించని యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. చదవండి: Reliance Jio: ట్రాయ్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో ధన్ ధనా ధన్! -
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్..! ఈ యాప్‌ను వెంటనే డిలీట్ చేయండి..! లేకపోతే అంతే సంగతులు..!
రోజురోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తుందో...అంతే వేగంతో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. సైబర్ నేరస్తులు కొంత పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. కొత్త మంది హ్యకర్లు ఏకంగా గూగుల్‌ప్లే స్టోర్‌లోకి నకిలీ యాప్స్‌ను చొప్పించి..సదరు యాప్స్ ద్వారా మాల్వేర్స్ను స్మార్ట్ఫోన్లలోకి ఎక్కిస్తున్నారు. ఇలాంటిదే తాజాగా కార్టూనిఫైయర్ యాప్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్ల ఫేస్బుక్ డేటాను దొంగిలిస్తోన్నట్లు తెలుస్తోంది. లక్ష మందిపై ప్రభావం..! కార్టూనిఫైయర్ యాప్‌లో FaceStealer అనే మాల్వేర్ను గుర్తించారు. కార్టూనిఫైయర్ యాప్(cartoonifier app)తో హ్యకర్లు ఆయా యూజర్ల ఫేస్బుక్ ఖాతాల పాస్‌వర్డ్స్‌ను సొంతం చేసుకుంటున్నట్లు ప్రడియో(Pradeo) వెల్లడించింది. ఇప్పటికే ఈ యాప్‌ను సుమారు లక్షకు పైగా ఆండ్రాయిడ్ యూజర్లు ఇన్స్టాల్ చేసినట్లు ప్రడియో తన నివేదికలో పేర్కొంది. కాగా ఈ యాప్‌పై గూగుల్ ప్రతినిధులు స్పందించారు. 'క్రాఫ్ట్సార్ట్ కార్టూన్ ఫోటో టూల్స్' పేరుతో ఉన్న యాప్ ఇకపై డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదని, ప్లే స్టోర్ నుంచి తొలగించమని గూగుల్ ప్రతినిధి ప్రముఖ టెక్ బ్లాగింగ్ సంస్థ బ్లీపింగ్ కంప్యూటర్‌కు తెలియజేశారు. ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్న వారు వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలని సూచించారు. అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్‌లో సదరు యాప్స్‌ను చెక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం మంచిందంటూ సూచించారు. ఒక యాప్‌ను డౌన్లోడ్ చేసే ముందు వీటిని దృష్టిలో పెట్టుకోండి. యాప్‌ను ఇన్స్టాల్ చేసే ముందు సంబంధింత యాప్ డెవలపర్ ఎవరో, తనీఖీ చేసి ధృవీకరించాలి. యాప్‌పై గల రివ్యూలను, రేటింగ్లను చూడడం మంచింది. మాల్వేర్ కల్గిన యాప్స్‌ను యూజర్లు రివ్యూలో రిపోర్ట్ చేస్తూ ఉంటారు. యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మైక్రోఫోన్, కాంటాక్ట్స్, ఇతర డేటాను యాక్సెస్ చేసే వాటిని అసలు ఇన్స్టాల్ చేయకండి. ఎల్లప్పుడు Google Play Store లేదా Apple App store నుంచి మాత్రమే యాప్స్‌ను ఇన్స్టాల్ చేయాలి. చదవండి: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన రియల్మీ..! ధర ఎంతంటే..? -
ఈ యాప్స్ వాడుతున్నారా.. అయితే, మీ మొత్తం డేటా కంపెనీల చేతుల్లోకి!
ఇప్పుడు మనం చెప్పుకోబోయే యాప్స్ తెగ వాడేస్తున్నారా? అయితే, మీకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఉబెర్, ఓలా, రాపిడో వంటి రైడ్-హైలింగ్ యాప్స్ వారి వినియోగదారులకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ సర్ఫ్ షార్క్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఈ డేటాను "తృతీయపక్ష ప్రకటనల" కోసం ఉపయోగిస్తున్నారు. సర్ఫ్ షార్క్ డేటా సెన్సిటివిటీ ఇండెక్స్ అనేది రైడ్-హైలింగ్ యాప్స్ అనేవి వారి వినియోగదారుల నుంచి ఏ రకమైన డేటా సేకరిస్తున్నాయో తెలియజేస్తుంది. గ్రాబ్ టాక్సీ, యాండెక్స్ గో, ఉబెర్ కంపెనీల యాప్స్ ప్రపంచంలో అత్యంత ఎక్కువ డేటా సేకరిస్తున్న టాక్సీ యాప్స్'గా నిలిచాయి. వినియోగదారుల నుంచి డేటా సేకరిస్తున్న పరంగా స్వదేశీ రైడ్-షేరింగ్ యాప్ ఓలా 6వ స్థానంలో నిలిచింది. బెంగళూరుకు చెందిన రాపిడో ప్రముఖ గ్రాబ్ టాక్సీ యాప్ కంటే దాదాపు పది రెట్లు తక్కువ డేటాను సేకరిస్తుంది. వినియోగదారులకు సేవలను అందించడానికి యూజర్ పేరు, ఫోన్ నంబర్, స్థానాన్ని మాత్రమే సేకరిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. 3 అంశాల ఆధారంగా ఈ డేటా సేకరిస్తున్నట్లు సర్ఫ్ షార్క్ తెలిపింది. గ్రాబ్ టాక్సీ కాంటాక్ట్, ఫైనాన్షియల్, లొకేషన్ సమాచారం, యూజర్ కంటెంట్ వంటి వివరాలు కూడా సేకరస్తున్నట్లు ఇందులో తేలింది. ఉబెర్, లిఫ్ట్ కలిసి 7వ స్థానంలో నిలిచాయి. జాతి, జాతి, లైంగిక దృక్పథం, గర్భధారణ, ప్రసవ సమాచారం, బయోమెట్రిక్ డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించే ఏకైక రైడ్-హైలింగ్ యాప్ గా లిఫ్ట్ నిలిచింది. (చదవండి: ప్రపంచంలో మరో వింత.. అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో) -
ఫేస్బుక్ యూజర్లకు మరో భారీ షాక్..!
నిన్న ఒక్కసారిగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు షాక్ గురయ్యారు. ఏడుగంటల పాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నెట్వర్క్ పూర్తిగా నిలిచిపోయింది. సర్వర్స్‌లో నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నిలిచిపోయిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఫేస్బుక్ టెక్నాలజీ ఆఫీసర్ స్పందిస్తూ యూజర్ల అందరికి క్షమాపణలను తెలియజేశారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలను తిరిగి మాన్యువల్‌గా పునరుద్ధరించడంతో సుమారు 7 గంటల సమయం పట్టిన్నట్లు వెల్లడించారు. ఒక్కసారిగా ఫేస్బుక్ సర్వర్లు డౌన్ అవ్వడంతో బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకమ్‌బర్గ్ సుమారు 7 బిలియన్డాలర్లకు పైగా నష్టపోయాడని పేర్కొంది. ఫేస్బుక్ యూజర్లకు మరో షాక్...! ఒక్కసారిగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో షాక్ గురైన యూజర్లకు రష్యన్ ప్రైవసీ అఫైర్స్ మరో షాకిచ్చింది. ఫేస్బుక్ గ్లోబల్ నెట్వర్క్స్ అంతరాయం కల్గిన సమయంలో హ్యకర్లు డార్క్ వెబ్ హ్యాకర్ ఫోరమ్‌లో ఫేస్బుక్ యూజర్ల డేటాను విక్రయించారని నివేదించింది. ఫేస్బుక్ యూజర్ల చిరునామా, పేరు, ఈ-మెయిల్ చిరునామా, ఫోన్ నంబర్లను అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. ఒక నివేదిక ప్రకారం దాదాపు 1.5 బిలియన్ ఫేస్బుక్ ఖాతాలు డార్క్ వెబ్‌లో అమ్మకానికి వచ్చినట్లు రష్యన్ ప్రైవసీ అఫైర్స్ నివేదించింది. కొంతమంది హ్యాకర్లు ఫేస్బుక్ వినియోగదారుల డేటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు నిర్ధారణలు ఉన్నాయి. ఫేస్బుక్ యూజర్ల డేటాను డార్క్‌వెబ్‌లో కొనుగోలు చేద్దామనుకున్న ఓ వ్యక్తికి హ్యాకర్లనుంచి 5,000 డాలర్లను చెల్లించగా తిరిగి ఎటువంటి డేటాను పొందలేదని ఆ వ్యక్తి రిపోర్ట్చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ చివరలో, కొంతమంది హ్యాకర్లు తమ వద్ద 1.5 బిలియన్ ఫేస్బుక్ యూజర్ డేటా ఉందని పేర్కొంటూ పోస్ట్ చేసారు. స్పందించిన ఫేస్బుక్..! ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ ఐనా సమయంలో యూజర్ల డేటా అసలు లీక్ అవ్వలేదని ఫేస్బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. యూజర్ల డేటాకు డోకా లేదని వెల్లడించింది. యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఫేస్బుక్ చర్యలను తీసుకుంటుందని తెలిపింది. ఎందుకైనా మంచిది ఇలా చేస్తే బెటర్..! ఫేస్బుక్ యూజర్లు తమ డేటాను చోరికి గురిఅవ్వకుండా ఉండడం కోసం 2 అథనిటికేషన్ పాస్‌వర్డ్‌ను యూజర్లు తమ ఖాతాలకు ఏర్పాటు చేయడం మంచిది. అంతేకాకుండా స్ట్రాగ్ పాస్‌వర్డ్‌లను కూడా తమ ఫేస్బుక్ అకౌంట్లకు ఏర్పాటు చేసుకోవాలని పలు టెక్నికల్ నిపుణులు వెల్లడిస్తున్నారు. “Data of Over 1.5 Billion Facebook Users Sold on Hacker Forum Information of over 1.5 billion Facebook users being sold on popular hacking-related forum, potentially enabling cybercriminals and unscrupulous advertisers to target Internet users globally” https://t.co/JE8uSJbOg9 — Amrita Bhinder 🇮🇳 (@amritabhinder) October 4, 2021 చదవండి: కోట్లమంది చిరాకు.. డిలీట్ ఫేస్బుక్ ట్రెండ్! గ్యాప్‌లో కుమ్మేసిన ట్విటర్, టెలిగ్రామ్ -
ఆన్ లైన్ లో లింక్డిన్ యూజర్ల డేటా లీక్
-
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ డేటా చైనా సర్వర్లలోకి!
పబ్జీ..! అదేనండీ మనదేశంలో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో విడుదలైన ఈ గేమ్‌పై మరో వివాదం తలెత్తింది. ఈ గేమ్‌ను ఆడేందుకు లాగిన్ అయిన ఇండియన్ యూజర్ల డేటా చైనా సర్వర్లలోకి వెళ్లిందనే ఆధారాలు కలకలం రేపుతున్నాయి. దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన 116 యాప్స్‌పై కేంద్రం గతేడాది సెప్టెంబర్ 16న నిషేధం విధించిన విషయం తెలిసిందే. వాటిలో చైనా టెన్సెంట్ సంస్థకు చెందిన పబ్జీ కూడా ఉంది. వాస్తవానికి పబ్జీ చైనాది కాదు. సౌత్ కొరియాకు చెందిన యాప్. ఈ పేటెంట్ రైట్స్ ను చైనా టెన్సెంట్ సంస్థ దక్కించుకొని దాని కార్యకలాపాల్ని నిర్వ హిస్తుంది. వివిధ దేశాల్లో గేమ్‌ను రిలీజ్ చేసి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంది. కానీ బోర్డర్లో భారత్ పై కాలు దువ్విన చైనాకు చెక్ పెట్టేందుకు.. కేంద్రం చైనా యాప్స్ పై నిషేధం విధించింది. నిషేదంతో పబ్జీ మాతృసంస్థ సౌత్ కొరియాకు చెందిన క్రాఫ్టన్ సంస్థ పబ్జీ గేమ్‌ను కాస్తా బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా మార్పులు చేసి మార్కెట్ లో విడుదల చేసింది. ఐజీఎన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. చైనా సంస్థ ముంబై కేంద్రంగా సర్వర్లను ఏర్పాటు చేసిందని, ఇప్పుడు విడుదలైన బీజీఎంఐ వినియోగదారుల డేటా ముంబైలో ఉన్న సర్వర్ లనుంచి నుంచి అక్రమంగా చైనాలో ఉన్న సంస్థ సర్వర్లలోకి వెళ్లినట్లు పేర్కొంది. అందుకు సంబంధించిన ఆధారాల్ని విడుదల చేసింది. అయితే ఈ డేటా వ్యవహారంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురావడం లేదని, భారతీయుల డేటాను దొంగతనం చేసి సర్వర్లలోకి పంపుకోవడం ఎంత దారుణం అని ఒకరు కామెంట్ చేస్తుంటే .. చైనా ఉత్పత్తులపై బ్యాన్ విధించాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. -
భారతీయుల ‘ఫేస్బుక్’ వివరాలు ఆన్లైన్లో
న్యూఢిల్లీ: ఏకంగా 61 లక్షల మంది భారతీయుల ‘ఫేస్బుక్’ ఖాతా వివరాలు లీక్ అయ్యాయి. ఫేస్బుక్ అకౌంట్లకు సంబంధించిన ఫోన్ నంబర్లు, పేర్లు ఆన్లైన్లో హ్యాకింగ్ వేదికల్లో అందుబాటులోకొచ్చాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అలోన్ గాల్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 53.3 కోట్ల ఫేస్బుక్ యూజర్ల వివరాలు హ్యాకింగ్ ఫోరమ్‌లలో ఉచితంగా లభిస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఆన్లైన్లో లీక్ అయిన అకౌంట్లను దేశాలవారీగా చూస్తే 61 లక్షల మంది భారతీయుల అకౌంట్లు, 3.23 కోట్ల అమెరికన్ దేశీయుల అకౌంట్లు, బ్రిటన్‌కు చెందిన కోటీ 15 లక్షల ఖాతాలు, ఆస్ట్రేలియాకు చెందిన 73 లక్షల యూజర్ అకౌంట్లు ఉచితంగా హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లేనని ఆయన అంచనావేశారు. లీక్ అయిన డాటాలో కోట్లాది యూజర్ల ఫోన్ నంబర్లు, ఫేస్బుక్ ఐడీలు, యూజర్ల పూర్తి పేర్లు ఉన్నాయి. వీటిని హ్యాకర్లు చేజిక్కించుకుని సోషల్ ఇంజనీరింగ్ స్కామింగ్, హ్యాకింగ్, మార్కెటింగ్‌కు పాల్పడే ప్రమాదముందని అలోన్ హెచ్చరించారు. -
50 కోట్ల ఫేస్బుక్ ఖాతాల వివరాలు ఆన్లైన్లో
న్యూయార్క్: ప్రఖ్యాత సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో లొసుగులు మరోసారి బట్టబయలయ్యాయి. 50 కోట్ల ఫేస్బుక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఓ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా సైట్లలోని ఖాతాదారులకు చెందిన వివరాలు ఆన్లైన్లో హ్యాకర్లకు అందుబాటులోకి రావడంతో ఆందోళనలు మొదలయ్యాయి. అకౌంట్లలోని ఆ వివరాలు చాలా పాతవి. 106 దేశాలకు చెందిన ఫేస్బుక్ ఖాతాదారులకు చెందిన ఫోన్ నంబర్లు, ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, వారి లొకేషన్లు, పుట్టినతేదీలు, ఈమెయిల్ అడ్రస్ తదితర వివరాలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయని ‘బిజినెస్ ఇన్సైడర్’తన కథనంలో పేర్కొంది. 2018లో ఫేస్బుక్ ఓ ఫీచర్‌ను అందుబాటులో లేకుండా చేసింది. తెలియని వారి ఫేస్బుక్ అకౌంట్ వివరాలు తెల్సుకునేందుకు వారి ఫోన్‌నంబర్‌ను ఫేస్బుక్లో సెర్చ్ చేసి వివరాలు రాబట్టడం ఆ ఫీచర్ ప్రత్యేకత. దీన్ని ఆసరాగా చేసుకుని గతంలో కేంబ్రిడ్జ్ అనలైటికా అనే రాజకీయ సంబంధ సంస్థ ఏకంగా 8.7కోట్ల ఫేస్బుక్ యూజర్ల డాటాను వారికి తెలీకుండానే సేకరించింది. ఈ అంశం అప్పట్లో చాలా వివాదమైంది. -
రహస్య మోడ్‌లో అశ్లీల సైట్లలో విహరించినా..
న్యూయార్క్ : రహస్య (ఇన్‌కాగ్నిటో) మోడ్‌లో అశ్లీల సైట్లలో విహరించినా యూజర్ల గుట్టును గూగుల్, ఫేస్బుక్ సహా పలు కంపెనీలు ఇట్టే ఒడిసిపడుతున్నాయి. తాము పోర్న్ చూస్తున్నట్టు ఎవరికీ తెలియదని ప్రైవేట్ బ్రౌజింగ్‌లో అశ్లీల సైట్లను చూసినా వారి బ్రౌజింగ్ హిస్టరీని ఆయా కంపెనీలు పసిగడుతున్నాయని మైక్రోసాఫ్ట్, కార్నిగీ మెలన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా చేపట్టిన సంయుక్త అథ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు విశ్లేషించిన 22,484 అశ్లీల సైట్లలో 93 శాతం సైట్లు థర్డ్ పార్టీ యాప్స్‌కు డేటాను లీక్ చేసినట్టు అథ్యయనంలో వెల్లడైంది. ప్రైవసీ పాలసీల్లో ఉన్న సంక్లిష్టతల కారణంగా యూజర్ల అనుమతి లేకుండా ట్రాకర్లు ఆయా కంపెనీలకు పంపుతున్న డేటా ద్వారా యూజర్ల వ్యక్తిగత అలవాట్లు, శృంగార ప్రాధాన్యతలు తెలసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. అశ్లీల సైట్స్‌లో 93 శాతం పేజీలు యూజర్ డేటాను థర్డ్ పార్టీకి చేరవేస్తున్నాయని, 79 శాతం థర్డ్ పార్టీ కుకీల(ట్రాకింగ్ కోసం ఉపయోగించే)ను కలిగి ఉన్నాయని అథ్యయనం వెల్లడించింది. అశ్లీల సైట్లలో కేవలం 17 శాతం సైట్లు మాత్రమే సమాచార భద్రతను కలిగి ఉన్నాయని తేలింది. యూజర్లను ట్రాక్ చేస్తున్నట్టు గుర్తించిన టాప్ టెన్ థర్డ్ పార్టీల జాబితాలో ఎక్సోక్లిక్, జ్యూసీయాడ్స్, ఈరో అడ్వర్టైజింగ్లున్నాయని తెలిపింది. గూగుల్, ఫేస్‌బుక్‌లు నాన్-పోర్నోగ్రఫీ-స్పెసిఫిక్ సర్వీసుల జాబితాలో ఉన్నాయి. గూగుల్ ఈ జాబితాలో ఉన్నప్పటికీ యూజర్ల అశ్లీల సైట్లలో విహరించే అలవాట్లను వారికి తెలియకుండానే పరిశీలిస్తున్నట్టు అథ్యయనం వెల్లడించింది. ఒరాకిల్ 24 శాతం అశ్లీల సైట్లను వీక్షించే యూజర్లను ట్రాక్ చేస్తున్నట్టు ఈ అథ్యయనం పేర్కొంది. పరిశోధకులు వెబ్ఎక్స్రే సాఫ్ట్వేర్ ఫ్లాట్‌ఫాంను ఉపయోగించి యూజర్ల డేటాను సమీకరిస్తున్న కంపెనీలను గుర్తించారు. -
వాట్సాప్‌కు భారీ షాక్
పారిస్: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు గట్టి షాక్ తగిలింది. యూజర్ డేటాను ఫేస్బుక్లో షేర్ చేయడాన్ని నిలిపివేయాలని ఫ్రాన్స్ ప్రైవసీ అథారిటీ వాట్సాప్‌ను కోరింది. ఫేస్‌బుక్‌కు బదలాయించిన యూజర్ల డేటా నకలును అందచేయాలని వాట్సాప్‌ను నేషనల్ డేటా ప్రొటెక్షన్ ఆదేశించింది. నెలరోజుల్లోగా ఫేస్‌బుక్‌కు యూజర్ డేటా షేరింగ్‌ను నిలిపివేయాలని స్పష్టం చేస్తూ వాట్సాప్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే కమిషన్ కోరిన డేటా శాంపిల్‌ను తాము సమర్పించలేమని, సర్వర్లు అమెరికాలో ఉండటంతో తాము ఏమీ చేయలేమని వాట్సాప్ చేతులెత్తేసింది.దీనిపై సీరియస్ అయిన నేషనల్ డేటా ప్రొటెక్షన్ తమ చట్టాలకు అనుగుణంగా నెలలోగా ఎఫ్బీలో యూజర్ డేటాను షేర్ చేయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. 2014లో ఫేస్బుక్ వాట్సాప్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రకటనలు, భద్రత వంటి కారణాలతో తమ యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌కు బదలాయిస్తున్నట్టు 2016, ఆగస్ట్ 25న వాట్సాప్ పేర్కొంది.వాట్సాప్, ఫేస్బుక్ డేటా షేరింగ్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. వాట్సాప్ యూజర్ల డేటాను సమీకరించడం నిలిపివేయాలని గతంలో జర్మనీ ఫేస్‌బుక్‌ను ఆదేశించింది. మరోవైపు తీవ్ర విమర్శల నేపథ్యంలో బ్రిటన్‌లో వాట్సాప్ యూజర్ డేటా సేకరణను నిలిపివేసేందుకు ఫేస్బుక్ అంగీకరించింది. -
ఆన్లైన్ బ్యాంకింగ్‌కు కొత్త వైరస్ ముప్పు
న్యూఢిల్లీ: ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలకు తాజాగా మరో వైరస్ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. యూజర్ల డేటా, పాస్‌వర్డ్‌లను చోరీ చేసే ‘డెరైజా’ వైరస్ శరవేగంగా సిస్టమ్స్‌లోకి చొరబడుతోంది. ప్రమాదకరమైన ట్రోజన్ వైరస్ కోవకి చెందిన డెరైజా విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ ఆఫ్ ఇండియా(సెర్ట్-ఇన్) ఆన్లైన్ బ్యాంకింగ్ కస్టమర్లను హెచ్చరించింది. అసలైన బ్యాంకుల నుంచే వచ్చినట్లు అనిపించే ఈమెయిల్స్‌లో అటాచ్మెంట్ రూపంలో ఈ వైరస్ వస్తుందని పేర్కొంది. పొరపాటున దీన్ని ఇన్స్టాల్ చేస్తే సిస్టమ్‌లో తిష్టవేసి బ్యాంకింగ్ పాస్వర్డ్లు మొదలైన వాటిని తస్కరిస్తుందని హెచ్చరించింది. వైరస్‌తో ముప్పు ఇదీ.. సెర్ట్-ఇన్ వివరాల ప్రకారం స్పామ్ మెసేజీల కింద ఈమెయిల్లో జిప్ లేదా పీడీఎఫ్ అటాచ్మెంట్ల రూపంలో ఈ వైరస్ వ చ్చే అవకాశం ఉంది. ఈ అటాచ్మెంట్లను డౌన్లోడ్ చేసుకుని, అందులోని ప్రోగ్రామ్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలంటూ బ్యాంకు సూచిస్తున్నట్లుగా ఈమెయిల్ సారాంశం ఉంటుంది. దానికి అనుగుణంగా జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని అన్జిప్ చేసిన పక్షంలో అందులోని మాల్వేర్ ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత భద్రతకు సంబంధించిన సెటింగ్స్ అన్నింటినీ కూడా ఛేదిస్తుంది. బ్రౌజర్‌ను హైజాక్ చేయడం, కీ స్ట్రోక్స్ వివరాలను వైరస్ రూపకర్తకు చేరవేయడం మొదలైనవి చేస్తుంది. ఇది క్రోమ్, ఫైర్ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సహా వివిధ వెబ్ బ్రౌజర్లలో ప్రమాదకరమైన కోడ్‌ను ఈ మాల్వేర్ పొందుపరుస్తుంది. ఫలితంగా యూజరు తన బ్యాంకు వెబ్సైట్ పేరును టైప్ చేసినప్పుడు ముందుగా .. వైరస్ సర్వర్‌కు సంకేతాలు వెడతాయి. ఆ తర్వాత అసలు సిసలు బ్యాంకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో యూజర్ టైప్ చేసే వివరాలన్నీ కూడా వైరస్ సర్వర్‌కు చేరిపోతాయి. జాగ్రత్త చర్యలు.. ఈ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను సెర్ట్-ఇన్ సూచించింది. డాట్ వీబీఎస్, బీఏటీ, ఈఎక్స్ఈ, పీఐఎఫ్, ఎస్సీఆర్ ఎక్స్‌టెన్షన్స్‌తో వచ్చే ఈమెయిల్ అటాచ్‌మెంట్స్‌ను బ్లాక్ చేసేలా ఈమెయిల్ సెటింగ్స్‌ను మార్చుకోవాలని పేర్కొంది. అలాగే ఇంటర్నెట్, లోకల్ ఇంట్రానెట్ సెక్యూరిటీ జోన్ సెటింగ్స్‌ను అధిక స్థాయికి పెంచుకోవాలని తెలిపింది. సాధ్యమైనంత వరకూ విశ్వసించతగని వెబ్సైట్లను బ్రౌజ్ చేయొద్దని, ఫైర్‌వాల్‌ను యాక్టివ్‌గా ఉంచాలని సూచించింది. అలాగే తెలియని ఐడీల నుంచి వచ్చే మెయిల్స్‌ను తెరవొద్దని, సాధ్యమైనంత వరకూ యాంటీ మాల్వేర్ ఇంజిన్స్‌ను స్కాన్ చేసుకుని, అప్-టు-డేట్ ఉండేలా చూసుకోవాలని సెర్ట్-ఇన్ తెలిపింది. -
సెక్యూరిటీ ఆందోళనలను పరిష్కరిస్తాం: షియోమి
న్యూఢిల్లీ: తమ మొబైల్ ఫోన్ వినియోగదారుల నుంచి అనుమతి లేకుం డా ఎలాంటి డేటాను సేకరించటం లేదని చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి స్పష్టం చేసింది. యూజర్ల డేటా భద్రత విషయంలో నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు సంబంధిత భారతీయ ప్రభుత్వ సంస్థలను సంప్రదించనున్నట్లు కంపెనీ వివరించింది. షియోమీ కంపెనీ భారత్‌లో విక్రయిస్తున్న ఫోన్లను తమ అధికారులు, కుటుం బీకులు వాడొద్దంటూ గత వారం భారతీయ వాయు సేన(ఐఏఎఫ్) హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ ఫోన్లలోని డేటా అంతా చైనాలోని సర్వర్లకు చేరుతోందని.. దీనివల్ల సెక్యూరిటీ రిస్కులు పొంచిఉన్నాయని ఐఏఎఫ్ అంటోంది. షియోమి భారత్‌లో ప్రవేశపెట్టిన ఎంఐ3, రెడ్మి 1ఎస్ ఫోన్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇతర దేశాల(చైనాయేతర) కస్టమర్లకు సంబంధించి డేటాను అమెరికా, సింగపూర్ డేటా సెంటర్లకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని, ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుందని షియోమీ వైస్ ప్రెసిడెంట్ హ్యూగో బర్రా చెప్పారు.