పారిస్: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు గట్టి షాక్ తగిలింది. యూజర్ డేటాను ఫేస్‌బుక్‌లో షేర్ చేయడాన్ని నిలిపివేయాలని ఫ్రాన్స్ ప్రైవసీ అథారిటీ వాట్సాప్‌ను కోరింది. ఫేస్‌బుక్‌కు బదలాయించిన యూజర్ల డేటా నకలును అందచేయాలని వాట్సాప్‌ను నేషనల్ డేటా ప్రొటెక్షన్ ఆదేశించింది. నెలరోజుల్లోగా ఫేస్‌బుక్‌కు యూజర్ డేటా షేరింగ్‌ను నిలిపివేయాలని స్పష్టం చేస్తూ వాట్సాప్‌కు నోటీసులు జారీ చేసింది.
అయితే కమిషన్ కోరిన డేటా శాంపిల్‌ను తాము సమర్పించలేమని, సర్వర్‌లు అమెరికాలో ఉండటంతో తాము ఏమీ చేయలేమని వాట్సాప్ చేతులెత్తేసింది.దీనిపై సీరియస్ అయిన నేషనల్ డేటా ప్రొటెక్షన్ తమ చట్టాలకు అనుగుణంగా నెలలోగా ఎఫ్‌బీలో యూజర్ డేటాను షేర్ చేయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
2014లో ఫేస్‌బుక్ వాట్సాప్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రకటనలు, భద్రత వంటి కారణాలతో తమ యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌కు బదలాయిస్తున్నట్టు 2016, ఆగస్ట్ 25న వాట్సాప్ పేర్కొంది.వాట్సాప్, ఫేస్‌బుక్ డేటా షేరింగ్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది.
వాట్సాప్ యూజర్ల డేటాను సమీకరించడం నిలిపివేయాలని గతంలో జర్మనీ ఫేస్‌బుక్‌ను ఆదేశించింది. మరోవైపు తీవ్ర విమర్శల నేపథ్యంలో బ్రిటన్‌లో వాట్సాప్ యూజర్ డేటా సేకరణను నిలిపివేసేందుకు ఫేస్‌బుక్ అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment