50 కోట్ల ఫేస్‌బుక్‌ ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో | Facebook data on more than 500 million accounts found online | Sakshi
Sakshi News home page

50 కోట్ల ఫేస్‌బుక్‌ ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో

Published Mon, Apr 5 2021 4:06 AM | Last Updated on Mon, Apr 5 2021 4:43 AM

Facebook data on more than 500 million accounts found online - Sakshi

న్యూయార్క్‌: ప్రఖ్యాత సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో లొసుగులు మరోసారి బట్టబయలయ్యాయి. 50 కోట్ల ఫేస్‌బుక్‌ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఓ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఫేస్‌బుక్, ఇతర సోషల్‌ మీడియా సైట్లలోని ఖాతాదారులకు చెందిన వివరాలు ఆన్‌లైన్‌లో హ్యాకర్లకు అందుబాటులోకి రావడంతో ఆందోళనలు మొదలయ్యాయి. అకౌంట్లలోని ఆ వివరాలు చాలా పాతవి. 106 దేశాలకు చెందిన ఫేస్‌బుక్‌ ఖాతాదారులకు చెందిన ఫోన్‌ నంబర్లు, ఫేస్‌బుక్‌ ఐడీలు, పూర్తి పేర్లు, వారి లొకేషన్లు, పుట్టినతేదీలు, ఈమెయిల్‌ అడ్రస్‌ తదితర వివరాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయని ‘బిజినెస్‌ ఇన్‌సైడర్‌’తన కథనంలో పేర్కొంది. 2018లో ఫేస్‌బుక్‌ ఓ ఫీచర్‌ను అందుబాటులో లేకుండా చేసింది. తెలియని వారి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ వివరాలు తెల్సుకునేందుకు వారి ఫోన్‌నంబర్‌ను ఫేస్‌బుక్‌లో సెర్చ్‌ చేసి వివరాలు రాబట్టడం ఆ ఫీచర్‌ ప్రత్యేకత. దీన్ని ఆసరాగా చేసుకుని గతంలో కేంబ్రిడ్జ్‌ అనలైటికా అనే రాజకీయ సంబంధ సంస్థ ఏకంగా 8.7కోట్ల ఫేస్‌బుక్‌ యూజర్ల డాటాను వారికి తెలీకుండానే సేకరించింది. ఈ అంశం అప్పట్లో చాలా వివాదమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement