personal details leaked
-
షాకింగ్..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారుల డేటా లీక్?
ప్రముఖ దేశీయ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతి పెద్దదైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు వినియోగదారుల డేటా లీకైనట్లు తెలుస్తోంది. ఓ హ్యాకర్ వారి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన 7.5 జీబీ డాటాను డార్క్ వెబ్‌లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే డేటా గల్లంతుపై వస్తున్న వరుస కథనాల్ని హెచ్డీఎఫ్సీ యాజమాన్యం కొట్టిపారేసింది. ఓ ప్రముఖ అండర్‌గ్రౌండ్ హ్యాకర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారుల సమాచారాన్ని డార్క్ వెబ్‌లో పోస్ట్ చేశాడు. పైగా అందులో ఎలాంటి పేమెంట్ చెల్లించకుండానే డేటాను తీసుకోవచ్చని తెలిపారు. ఈ డేటా గల్లంతుపై ఓ మీడియా సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి వివరణ కోరింది. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారి ప్రతినిధి మాట్లాడుతూ.. మా సంస్థలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించలేరు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను వేరేవాళ్లు యాక్సెస్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. మా కస్టమర్ల వ్యక్తిగత గోప్యతే లక్ష్యంగా.. సంబంధిత వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. -
వేలాది భారతీయుల వివరాలు లీక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన సర్వర్ నుంచి వేలాదిమంది భారతీయులకు చెందిన వ్యక్తిగత వివరాలు లీకయ్యాయి. పలువురి పేర్లు, మొబైల్ నెంబర్లు, చిరునామాలు, కోవిడ్ పరీక్షా వివరాలతో కూడిన డేటా ఆన్లైన్ సెర్చ్‌లో ప్రత్యక్షమైంది. ఈ లీకైన వివరాలను రైడ్ ఫోరమ్స్ వెబ్సైట్లో ఒక సైబర్ క్రిమినల్ అమ్మకానికి కూడా పెట్టాడు. ఇలా దాదాపు 20వేల ఇండియన్ల వ్యక్తిగత వివరాలు అమ్మకానికి కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి చెందిన ఒక సీడీఎన్ (కంటెంట్ డెలివరీ నెట్వర్క్) నుంచి ఈ వివరాలు బహిర్గతమయ్యాయని, ఈ వివరాలు డార్క్ వెబ్‌లో కూడా లభిస్తున్నాయని, సెర్చ్ ఇంజన్లలో లభిస్తున్న దాదాపు 9 లక్షల వివరాలను గూగుల్ ఇండెక్స్ చేసిందని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రాజశేఖర్ రాజాహారియా ట్వీట్ చేశారు. వీటన్నింటినీ డీ ఇండెక్స్ వెంటనే డీఇండెక్స్ చేయాలని హెచ్చరించారు. (ప్రశ్నలకు వేగంగా జవాబులిచ్చేందుకు సెర్చ్ ఇంజన్లు శోధనకు ముందు సమాచారాన్ని సమీకరించే ప్రక్రియను ఇండెక్సింగ్ అంటారు). ఈ విషయమై ఐటీ శాఖ ఇంతవరకు స్పందించలేదు. రాపిడ్ ఫోరమ్స్‌లో అమ్మకానికి పెట్టిన శాంపిల్ డాక్యుమెంట్లో ఈ వివరాలన్నీ కోవిన్ పోర్టల్‌లో అప్‌లోడింగ్‌కు ఉంచిన డేటాగా చూపుతోంది. కరోనా కాలంలో నిబంధనల పర్యవేక్షణ నుంచి వ్యాక్సినేషన్ వరకు పలు అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కువగా డిజిటల్ సాంకేతికతపై ఆధారపడింది. ఈ దశలో ప్రభుత్వ సర్వర్నుంచి డేటా లీకైనట్లు వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రజలు నకిలీ కాల్స్, ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజశేఖర్ సూచించారు. కోవిన్ నుంచి ఎలాంటి లీకులు లేవు కోవిన్ పోర్టల్ నుంచి ఎలాంటి లీకేజీ జరగలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లోని ప్రజల వివరాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. కోవిన్‌లో వ్యక్తుల చిరునామాలుకానీ ఆర్టీపీసీఆర్ పరీక్షా వివరాలు కానీ సేకరించలేదని గుర్తు చేసింది. కోవిన్ పోర్టల్ నుంచి డేటా లీకైందన్న వార్తలు వస్తున్నాయని, కానీ ఈ పోర్టల్ సురక్షితమని, ఎలాంటి వివరాలు బయటకు పోలేదని మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. -
భారతీయుల ‘ఫేస్బుక్’ వివరాలు ఆన్లైన్లో
న్యూఢిల్లీ: ఏకంగా 61 లక్షల మంది భారతీయుల ‘ఫేస్బుక్’ ఖాతా వివరాలు లీక్ అయ్యాయి. ఫేస్బుక్ అకౌంట్లకు సంబంధించిన ఫోన్ నంబర్లు, పేర్లు ఆన్లైన్లో హ్యాకింగ్ వేదికల్లో అందుబాటులోకొచ్చాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అలోన్ గాల్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 53.3 కోట్ల ఫేస్బుక్ యూజర్ల వివరాలు హ్యాకింగ్ ఫోరమ్‌లలో ఉచితంగా లభిస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఆన్లైన్లో లీక్ అయిన అకౌంట్లను దేశాలవారీగా చూస్తే 61 లక్షల మంది భారతీయుల అకౌంట్లు, 3.23 కోట్ల అమెరికన్ దేశీయుల అకౌంట్లు, బ్రిటన్‌కు చెందిన కోటీ 15 లక్షల ఖాతాలు, ఆస్ట్రేలియాకు చెందిన 73 లక్షల యూజర్ అకౌంట్లు ఉచితంగా హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లేనని ఆయన అంచనావేశారు. లీక్ అయిన డాటాలో కోట్లాది యూజర్ల ఫోన్ నంబర్లు, ఫేస్బుక్ ఐడీలు, యూజర్ల పూర్తి పేర్లు ఉన్నాయి. వీటిని హ్యాకర్లు చేజిక్కించుకుని సోషల్ ఇంజనీరింగ్ స్కామింగ్, హ్యాకింగ్, మార్కెటింగ్‌కు పాల్పడే ప్రమాదముందని అలోన్ హెచ్చరించారు. -
50 కోట్ల ఫేస్బుక్ ఖాతాల వివరాలు ఆన్లైన్లో
న్యూయార్క్: ప్రఖ్యాత సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో లొసుగులు మరోసారి బట్టబయలయ్యాయి. 50 కోట్ల ఫేస్బుక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఓ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా సైట్లలోని ఖాతాదారులకు చెందిన వివరాలు ఆన్లైన్లో హ్యాకర్లకు అందుబాటులోకి రావడంతో ఆందోళనలు మొదలయ్యాయి. అకౌంట్లలోని ఆ వివరాలు చాలా పాతవి. 106 దేశాలకు చెందిన ఫేస్బుక్ ఖాతాదారులకు చెందిన ఫోన్ నంబర్లు, ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, వారి లొకేషన్లు, పుట్టినతేదీలు, ఈమెయిల్ అడ్రస్ తదితర వివరాలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయని ‘బిజినెస్ ఇన్సైడర్’తన కథనంలో పేర్కొంది. 2018లో ఫేస్బుక్ ఓ ఫీచర్‌ను అందుబాటులో లేకుండా చేసింది. తెలియని వారి ఫేస్బుక్ అకౌంట్ వివరాలు తెల్సుకునేందుకు వారి ఫోన్‌నంబర్‌ను ఫేస్బుక్లో సెర్చ్ చేసి వివరాలు రాబట్టడం ఆ ఫీచర్ ప్రత్యేకత. దీన్ని ఆసరాగా చేసుకుని గతంలో కేంబ్రిడ్జ్ అనలైటికా అనే రాజకీయ సంబంధ సంస్థ ఏకంగా 8.7కోట్ల ఫేస్బుక్ యూజర్ల డాటాను వారికి తెలీకుండానే సేకరించింది. ఈ అంశం అప్పట్లో చాలా వివాదమైంది. -
వివిధ దేశాధినేతల కీలక డాక్యుమెంట్లు లీక్!
-
ఇంటర్నెట్లో వివిధ దేశాధినేతల కీలక డాక్యుమెంట్లు!
లండన్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రపంచ నాయకుల కీలక డాక్యుమెంట్లు ఇంటర్నెట్లో పెట్టారు. ఆస్ట్రేలియా అధికారులు పొరపాటున ఈ వివరాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. ఈ విధంగా లీకైనవాటిలో ఆ నాయకుల పాస్‌పోర్టు, ప్రయాణ వివరాలతోపాటు వ్యక్తిగత అంశాలు కూడా ఉన్నాయి. జీ-20 తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు గత ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు ప్రధాని మోదీతోపాటు 31మంది వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ఆ సందర్భంగా సేకరించిన ప్రపంచ నాయకుల డేటా పొరపాటున ఈ విధంగా బహిర్గతమైంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, జర్మన్ చాన్సలర్ మార్కెల్, చైనా అధ్యక్షుడు జింపింగ్, జపాన్ ప్రధాని షింజో అబే, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తదితరుల వ్యక్తిగత వివరాలు బయటకు వెల్లడయ్యాయి.