ఇంటర్నెట్లో వివిధ దేశాధినేతల కీలక డాక్యుమెంట్లు! | Modi among 31 leaders to have personal details leaked at G20 | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్లో వివిధ దేశాధినేతల కీలక డాక్యుమెంట్లు!

Published Mon, Mar 30 2015 4:19 PM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

జీ-20 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన వివిధ దేశాల నేతలు

జీ-20 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన వివిధ దేశాల నేతలు

లండన్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రపంచ నాయకుల కీలక డాక్యుమెంట్లు ఇంటర్నెట్లో పెట్టారు. ఆస్ట్రేలియా అధికారులు పొరపాటున ఈ వివరాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. ఈ విధంగా లీకైనవాటిలో ఆ నాయకుల పాస్పోర్టు, ప్రయాణ వివరాలతోపాటు వ్యక్తిగత అంశాలు కూడా ఉన్నాయి.

 జీ-20 తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు గత ఏడాది నవంబర్లో  ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు ప్రధాని మోదీతోపాటు 31మంది వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ఆ సందర్భంగా సేకరించిన ప్రపంచ నాయకుల డేటా పొరపాటున ఈ విధంగా బహిర్గతమైంది.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, జర్మన్ చాన్సలర్ మార్కెల్, చైనా అధ్యక్షుడు జింపింగ్, జపాన్ ప్రధాని షింజో అబే, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తదితరుల వ్యక్తిగత వివరాలు బయటకు వెల్లడయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement