Business Insider
-
50 కోట్ల ఫేస్బుక్ ఖాతాల వివరాలు ఆన్లైన్లో
న్యూయార్క్: ప్రఖ్యాత సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో లొసుగులు మరోసారి బట్టబయలయ్యాయి. 50 కోట్ల ఫేస్బుక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఓ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా సైట్లలోని ఖాతాదారులకు చెందిన వివరాలు ఆన్లైన్లో హ్యాకర్లకు అందుబాటులోకి రావడంతో ఆందోళనలు మొదలయ్యాయి. అకౌంట్లలోని ఆ వివరాలు చాలా పాతవి. 106 దేశాలకు చెందిన ఫేస్బుక్ ఖాతాదారులకు చెందిన ఫోన్ నంబర్లు, ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, వారి లొకేషన్లు, పుట్టినతేదీలు, ఈమెయిల్ అడ్రస్ తదితర వివరాలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయని ‘బిజినెస్ ఇన్సైడర్’తన కథనంలో పేర్కొంది. 2018లో ఫేస్బుక్ ఓ ఫీచర్‌ను అందుబాటులో లేకుండా చేసింది. తెలియని వారి ఫేస్బుక్ అకౌంట్ వివరాలు తెల్సుకునేందుకు వారి ఫోన్‌నంబర్‌ను ఫేస్బుక్లో సెర్చ్ చేసి వివరాలు రాబట్టడం ఆ ఫీచర్ ప్రత్యేకత. దీన్ని ఆసరాగా చేసుకుని గతంలో కేంబ్రిడ్జ్ అనలైటికా అనే రాజకీయ సంబంధ సంస్థ ఏకంగా 8.7కోట్ల ఫేస్బుక్ యూజర్ల డాటాను వారికి తెలీకుండానే సేకరించింది. ఈ అంశం అప్పట్లో చాలా వివాదమైంది. -
700 మంది ఉద్యోగులను పీకేస్తున్న టెక్ దిగ్గజం
న్యూఢిల్లీ : బహుళ జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాప్ట్లో మరికొన్ని రోజుల్లో 700 ఉద్యోగాలు హుష్ కాకి కానున్నాయి. వచ్చే వారంలో ప్రకటించబోయే ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఉద్యోగాల కోతను మైక్రోసాప్ట్ ప్రకటిస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2017 జూన్ వరకు 2,850 ఉద్యోగాలకు కోత విధించబోతున్నామని మైక్రోసాప్ట్ ఇంతకమున్నుపే ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఈ నెలలో 700 మందికి కంపెనీ గుడ్ బై చెప్పనుందట. 2016 జూన్ 30 వరకు మైక్రోసాప్ట్లో 1,14,000 మంది ఉద్యోగులున్నారు. కంపెనీ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను జనవరి 26న గురువారం ప్రకటించనుంది. థామ్సన్ రాయిటర్స్ అంచనాల ప్రకారం కంపెనీ 25.27 బిలియన్ డాలర్ల రెవెన్యూ ఆర్జిస్తుందని తెలుస్తోంది. 2013లో నోకియాను సొంతం చేసుకున్న అనంతరం స్మార్ట్ ఫోన్ బిజినెస్‌లో పనిచేస్తున్న 25వేలకు పైగా ఉద్యోగులను మైక్రోసాప్ట్ పీకేసింది. ఈ ఉద్యోగాల కోత లక్ష్యం వివిధ యూనిట్లలో స్కిల్స్‌ను అప్డేట్ చేయడమేనని బిజినెస్ ఇన్సైడర్ రిపోర్టు చేసింది.